Guntur: గుంటూరు నుంచి చెర్లపల్లి వెళ్తున్న ట్రైన్‌లో దారుణం చోటుచేసుకుంది. బోగిలో ఒంటరిగా ఉన్న ప్రయాణికురాలిపై కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ దుండగుడు. ఏపీ కి చెందిన ఓ మహిళ రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్‌లో సంత్రగాచి స్పెషల్ రైలు ఎక్కింది. రైలు గుంటూరు చేరుకోగా బోగిలో ఉన్న తోటి ప్రయాణికులు దిగిపోయారు. బోగిలో మహిళ ఒంటరిగా ఉండడం గమనించిన నిందితుడు కత్తితో బెదిరించి ఆమె వద్ద ఉన్న సెల్‌ఫోన్, హ్యండ్ బ్యాగ్ లాక్కున్నాడు. అంతటితో ఆగకుండా అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం పెద్దకూరపాడు స్టేషన్ వద్ద దిగి పారిపోయాడు. చర్లపల్లికి చేరుకున్న బాధితురాలు జిఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.