Lightning Power: ఉరుములు, మెరుపులు అనగానే మనలో చాలామంది ముఖ్యంగా చిన్నపిల్లలు భయపడతారు. ముఖ్యంగా వర్షం వచ్చే సమయంలో ఉరుములు, మెరుపులు తరచుగా వస్తుంటాయి. అయితే ఈ ఉరుములు, మెరుపులు వచ్చినప్పుడు వాటి నుండి ఒక ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఈ ఎనర్జీని ఉపయోగించి కరెంట్ తయారు చేయొచ్చా అనే ప్రశ్న చాలా మందికి వచ్చే ఉంటుంది. దీనికి సైంటిస్టుల నుంచి ఏ సమాధానం వస్తుందో తెలియాలంటే ఈ ఆర్టికల్‌ను పూర్తిగా చదవాల్సిందే..
మెరుపులు ప్రకృతికి ఉన్న శక్తివంతమైన రూపం. మెరుపు వాతావరణంలో ఎలక్ట్రిక్ ఛార్జ్‌లను రిలీజ్ చేసి అపారమైన పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఆ పవర్ దాదాపు 10 గిగావాట్ వరకు ఉంటుందని, ఇది ఒక చిన్న నగరానికి కొంతకాలం పాటు కరెంట్ సరఫరా చేయగలదని సైంటిస్టులు చెబుతున్నారు. అయితే, మెరుపు విడుదల చేసిన పవర్‌ని తీసుకుని కరెంట్‌గా మార్చడానికి సాంకేతికంగా, ఆర్థికంగా ఎన్నో సవాళ్లు ఎదురుకోవలసిన పని.
లైటెనింగ్ పవర్‌ని తీసుకోవడానికి ముందుగా దాని హై వోల్టేజ్‌ను కంట్రోల్ చేయాలి. ఒక మెరుపులో దాదాపుగా మిలియన్ వోల్ట్ ల పవర్ ని కలిగి ఉండడం వల్ల సాధారణ ఎలక్ట్రిక్ సిస్టం కు అనుకూలంగా ఉండదు. దీనికోసం మోడర్న్ ట్రాన్సఫార్మర్లు , కెపాసిటర్లు , పవర్ స్టోరేజ్ సిస్టం లు అవసరం. ఉదాహరణకు, మెరుపును ఒక కండక్టర్ ద్వారా తీసుకుని దాని పవర్‌ని బ్యాటరీలు, సూపర్ కెపాసిటర్లలో స్టోర్ చేయవచ్చు. కానీ, మెరుపు దాని అనూహ్యత, క్షణిక స్వభావం వల్ల ఈ ప్రక్రియను మరింత కష్టంగా మారుస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు.
టెక్నికల్ గా లైటెనింగ్ పవర్ ని తీసుకోవడానికి లైటెనింగ్ రాడ్ ల వంటి టూల్స్ ను ఉపయోగించొచ్చు కానీ వీటిని సాధారణంగా బిల్డింగ్స్ ను రక్షించడానికి ఉపయోగిస్తారు తప్ప కరెంటు తయారు చేయడానికి కాదు. పవర్ గ్యాదరింగ్ కోసం, ఎక్కువ సామర్థ్యం గల కండక్టర్లు, పవర్ ఎక్స్చేంజి సిస్టం లు అవసరం. అయితే, మెరుపు వచ్చే సమయం గానీ, అది ఎక్కడ, ఎప్పుడు పడుతుందో ఖచ్చితంగా చెప్పడం కష్టమైన పని , ఇది కరెంటు తయారు చేయడానికి ఒక పెద్ద అడ్డంకిగా చెప్పుకోవచ్చు.
లైటెనింగ్ పవర్‌ను తీసుకునే అవకాశాలను తెలుసుకోవడానికి ప్రస్తుతం కొన్ని ప్రాజెక్టులు, ఎక్స్పెరిమెంట్లు జరుగుతున్నాయి. ఈ ఎక్స్పెరిమెంట్లు కనుక సక్సెస్ అయితే లైటెనింగ్ నుండి వచ్చే ఎనర్జీ తో కరెంటు ను సులభంగా తయారు చేసి కరెంటు కొరతను తగ్గించవచ్చు. ఉదాహరణకు, లేజర్ టెక్నాలజీని ఉపయోగించి లైటెనింగ్‌ను నిర్దిష్ట ప్రదేశాలకు మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఈ టెక్నాలజీ ఇంకా పూర్తిగా డెవలప్ కాలేదు. ఈ ప్రయత్నాలు సక్సెస్ అయినట్లయితే గ్రామీణ ప్రాంతాలకు కరెంటు ను అందించి అక్కడి కరెంటు కొరతను చాలా వరకు తగ్గించవచ్చు. కానీ, ఇది కమర్షియల్‌గా వర్కౌట్ అవ్వడానికి చాలా సమయం పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
లైటెనింగ్ పవర్ గ్యాదరింగ్ సిస్టంలను ఏర్పాటు చేయడానికి చాలా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. లేటెస్ట్ మోడల్ టూల్స్, మేనేజ్మెంట్, సెక్యూరిటీ మెజర్స్ ఈ ప్రక్రియను చాలా ఖరీదైనదిగా చేస్తాయి. ప్రస్తుతం, సోలార్ పవర్ లేదా విండ్ పవర్ వంటి పవర్ సోర్సెస్ మరింత స్థిరంగా, ఫైనాన్షియల్ పరంగా ప్రాఫిటబుల్‌గా ఉన్నాయి. లైటెనింగ్ థియరీ ప్రకారం దానిలోని పవర్‌ను తీసుకుని కరెంటు తయారు చేయడం సాధ్యమే అయినప్పటికీ, టెక్నికల్, ఫైనాన్షియల్, ప్రాక్టికల్‌గా ఎదురయ్యే సవాళ్లు దీనిని ప్రస్తుతం కష్టతరం చేస్తున్నాయి. ఇది భవిష్యత్తులోని టెక్నాలజీతో సాధ్యం అయ్యే అవకాశం ఉన్నా ఇప్పటికి ఇది ఒక కష్టమైనా లక్ష్యంగానే మిగిలిపోయింది.