BigTV English

Natty Kumar: శ్రీ విష్ణు కి సపోర్టుగా నిర్మాత నట్టి కుమార్.. ఆయన తప్పు లేదంటూ..!

Natty Kumar: శ్రీ విష్ణు కి సపోర్టుగా నిర్మాత నట్టి కుమార్.. ఆయన తప్పు లేదంటూ..!
Natty Kumar: నటుడు శ్రీ విష్ణు నటించిన #సింగిల్ మూవీకి సంబంధించి రీసెంట్గా క్రైస్తవ సంఘాలు మండిపడిన సంగతి తెలిసిందే.ముఖ్యంగా శ్రీవిష్ణు గత కొద్ది రోజులుగా చేస్తున్న సినిమాలన్నీ క్రైస్తవ మతాన్ని కించపరుస్తున్నట్లుగా ఉన్నాయని క్రైస్తవ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇప్పటినుండి శ్రీ విష్ణు సినిమాలు బాయ్ కట్ చేయాలంటూ పిలుపు నిచ్చారు. అయితే క్రిస్టియన్స్ శ్రీవిష్ణుని టార్గెట్ చేయడానికి కారణం గత కొద్దిరోజులుగా ఆయన చేసే సినిమాలు క్రిస్టియన్స్ ని కించపరిచేలా ఉన్నాయి. అలా స్వాగ్ మూవీలో ఆయన గెటప్ శ్రీను లాగా మాట్లాడుతూ క్రైస్తవ మతాన్ని అవమానించారు. అలాగే ఓం భీమ్ బుష్ మూవీ లో కూడా అన్నీ నన్ను అడుగుతున్నారెందుకు నేను ఏమైనా ఏసు ప్రభువునా..అని అక్కడ కూడా అవమానించారు. ఇక రీసెంట్గా విడుదలైన #సింగల్ మూవీ లో కూడా క్రైస్తవ మతాన్ని కించపరిచినట్టు ఉండడంతో క్రైస్తవ సంఘాలు శ్రీవిష్ణు మూవీస్ ని బాయ్ కట్ చేయాలంటూ మండి పడ్డారు.

శ్రీ విష్ణు మూవీ బాయ్ కాట్.. స్పందించిన నట్టి కుమార్..


అయితే ఈ ఇష్యూ పై తాజాగా స్పందించారు తెలుగు నిర్మాత నట్టి కుమార్.. ఆయన మాట్లాడుతూ.. శ్రీ విష్ణుని బాయ్ కట్ చేయాలని క్రైస్తవ సంఘాలు మండిపడడంలో తప్పు. ఎందుకంటే అది శ్రీ విష్ణు చేసిన తప్పు కాదు. డైరెక్టర్, నిర్మాత, ఆ డైలాగు రాసిన రచయిత తప్పు. అంతేకానీ ఇందులో శ్రీవిష్ణు తప్పు లేదు.ఆయన హీరో మాత్రమే.డైరెక్టర్ ఏం చెప్తే అదే చేస్తాడు.ముందుగా బాయ్ కట్ చేయాల్సింది డైరెక్టర్ ని,ప్రొడ్యూసర్ని, సెన్సార్ ఆఫీసర్స్ ని.. సెన్సార్ వాళ్ళు ఈ సినిమాలు చూసి ముద్ర ఎందుకు వేస్తున్నారు. ముందుగానే ఈ సీన్ తొలగించాలి కదా. వాళ్లు అక్కడ కూర్చొని ఏం చేస్తున్నారు. సినిమా అంతా బాగానే ఉందని ముద్ర వేసి ఎందుకు రిలీజ్ చేసుకోమని చెబుతున్నారు. సెన్సార్ ఆఫీసర్లు ఏమి చేయకుండా బుద్ధ విగ్రహం లాగా కూర్చొని బ్యాగ్రౌండ్ నుండి వచ్చే డబ్బులు తీసుకుంటూ ఇలా ఒక మతాన్ని కించపరచడం మంచిది కాదు. మన భారత దేశంలో ఉన్న సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ అన్ని మతాలు సమానమే అని చూడాలి.

తప్పు హీరోది కాదు దర్శకులదే..


అలాగే సినిమా తీసే దర్శక నిర్మాతలు డైలాగ్స్ రాసే రచయితలు కూడా ఇతర మతాల వారిని కించపరచకుండా డైలాగ్స్ రాసుకోవాలి.వాళ్లు మొదట తప్పు చేస్తేనే కదా హీరో కూడా అది చేస్తారు.. ఇందులో హీరోలను తప్పుగా చిత్రీకరించవలసిన అవసరం లేదు.సెన్సార్ ఆఫీసర్ మీద కేసు పెట్టాలి. సెన్సార్ వాళ్ళు ఒక మతాన్ని కించపరిచేలా ఉన్న వాటిని రిలీజ్ చేసుకోమని ఎందుకు సర్టిఫికెట్లు ఇస్తున్నారు.. ఇండస్ట్రీలో అంత పెద్ద నిర్మాత గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ కి ఈ విషయం తెలియదా ఒక మతాన్ని కించపరచకూడదని, 10 మందికి చెప్పే ఆయనే ఇలాంటి సినిమాలు తీసుకువస్తే ఎలా అంటూ ప్రొడ్యూసర్ నట్టి కుమార్ సెన్సార్ వాళ్ళపై డైరెక్టర్, నిర్మాత,డైలాగు రచయితలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు శ్రీ విష్ణు చేసే సినిమాల్లో ఆయన తప్పేమీ లేదని, అంతా వాళ్ళ తప్పేనని చెప్పారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×