Gmail Hack| ఈ రోజుల్ల ప్రతి ఒక్కరూ ఈ మెయిల్ కలిగి ఉంటారు. ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఫోన్.. జి మెయిల్ అకౌంట్ తోనే పనిచేస్తుంది. గ్లూ ప్లే స్టోర్ ఉపగించాలంటే జి మెయిల్ కీలకం. అయితే, మీ సొంత డివైజ్ లు (ఫోన్, ల్యాప్ టాప్) కాకుండా ఇతర ఆఫీస్, ఫ్రెండ్స్ పరికరాల్లో మీ Gmail లాగిన్ చేసి ఉంచితే, హ్యాకర్లు మీ ఫోన్‌ను రిమోట్‌గా యాక్సెస్ చేయవచ్చు. మీ జి మెయిల్ హ్యాక్ చేసి ఫోన్ లో మీ వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ యాప్‌ల సమాచారం సైబర్ మోసగాళ్లు చేజిక్కించుకుంటారు. మీ Gmail ఎక్కడెక్కడ లాగిన్ అయి ఉందో చెక్ చేయడానికి కొన్ని సులభమైన మార్గాలను తెలుసుకోండి.
మీ బ్రౌజర్‌లో myaccount.google.comని తెరవండి. సెక్యూరిటీ విభాగానికి స్క్రోల్ చేసి, “Your Devices” ప్యానెల్‌ను చూడండి. ఇక్కడ “Manage all devices” బటన్‌పై క్లిక్ చేస్తే.. మీ జి మెయిల్ అకౌంట్ యాక్టివ్ ఉన్న అన్ని పరికరాల జాబితా కనిపిస్తుంది. ఇందులో మొబైల్ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు ఉండవచ్చు.
ఈ పరికరాల జాబితాను జాగ్రత్తగా పరిశీలించండి. ఒకవేళ మీకు తెలియని డివైజ్ కనిపిస్తే.. దాని గురించి మరింత అన్ని వివరాలు పరిశీలించండి. డివైజ్ రకం, స్థానం, చివరిగా యాక్సెస్ చేసిన సమయాన్ని తనిఖీ చేయండి. తెలియని డివైజ్ ఉంటే, వెంటనే ఆ పరికరాన్ని సెలెక్ట్ చేసి “Sign out” బటన్‌ను నొక్కండి. ఇలా చేయడం వల్ల ఆ అనుమాస్పద డివైజ్ నుంచి మీ అకౌంట్ లాగ్ అవుట్ అవుతుంది.
అనుమాస్పద లాగ్ అవుట్ చేసిన తర్వాత, మీ Gmail పాస్‌వర్డ్‌ను మార్చండి. బలమైన, క్లిష్టమైన పాస్‌వర్డ్‌ను ఎంచుకోండి. హ్యాకర్లు మీ ఖాతాను మళ్లీ యాక్సెస్ చేయడాన్ని ఈ క్లిష్టమైన పాస్ వర్డ్ కష్టతరం చేస్తుంది. మీ బ్యాంకింగ్ యాప్‌లు, వ్యక్తిగత సమాచారం వంటి లింక్ చేయబడిన ఇతర సేవలను కూడా రక్షిస్తుంది.
మీ Gmail ఖాతాను కంప్యూటర్‌లో తెరిచి, ఇమెయిల్ జాబితా క్రింద ఉన్న “Details” ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఇది మీ ఖాతా యొక్క ఇటీవలి కార్యకలాపాలను చూపే కొత్త విండోను తెరుస్తుంది. IP చిరునామాలు, యాక్సెస్ రకాలు, స్థానాలను చూడండి. తెలియని స్థానాల నుండి ఏదైనా సందేహాస్పద లాగిన్‌లు కనిపిస్తే వెంటనే చర్య తీసుకోండి.
మీ Gmail అకౌంట్‌తో వివిధ వెబ్‌సైట్‌లు, యాప్‌లు లింక్ అయి ఉండవచ్చు. ఇందులో కొన్ని హానికర యాప్‌లు కూడా ఉండవచ్చు. మీ Google అకౌంట్ పేజీలోని సెక్యూరిటీ విభాగంలో “Your connections to third-party apps & services” ఆప్షన్‌ను క్లిక్ చేయండి. “See all connections” బటన్‌పై నొక్కితే, మీ అకౌంట్‌కు అనుమతి ఉన్న యాప్‌ల జాబితా కనిపిస్తుంది.
ఈ యాప్‌ల జాబితాను జాగ్రత్తగా పరిశీలించండి. మీకు తెలియని లేదా ఉపయోగించని యాప్‌లు ఉంటే, వాటి యాక్సెస్ అనుమతులను వెంటనే రద్దు చేయండి. ఇలా చేయడం వల్ల మీ సమాచారం దొంగిలించబడకుండా నిరోధిస్తుంది. స్పామ్ పంపడాన్ని ఆపుతుంది. ఇది మీ ఆన్‌లైన్ ప్రెవెసీని గణనీయంగా పెంచుతుంది.
ఈ సెక్యూరిటీ చెక్‌లను ప్రతినెల పాటించండి. రెండు-అంచెల ధృవీకరణ (Two-Factor Authentication)ని యాక్టివేట్ చేయడం ద్వారా అదనపు రక్షణ పొందండి. షేర్డ్ లేదా పబ్లిక్ కంప్యూటర్‌లలో ఉపయోగించిన తర్వాత మీ జి మెయిల్ లాగ్ అవుట్ చేయడం మర్చిపోవద్దు. ఈ జాగ్రత్తలు పాటిస్తే సైబర్ మోసగాళ్లకు చెక్ పెట్టవచ్చు.
Also Read: మీ కంప్యూటర్ మౌస్ మీ రహస్యాలను వింటోంది.. కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు