IND VS AUS: ఆస్ట్రేలియా వర్సెస్ టీమ్ ఇండియా ( Australia vs India, 2nd ODI ) మధ్య ఇవాళ రెండవ వన్డే జరగనుంది. అడిలైడ్ వేదికగా ( Adelaide Oval, Adelaide ) జరగనున్న ఈ వన్డే నేపథ్యంలో టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు సర్వం సిద్ధం చేసుకున్నాయి. మొదటి మ్యాచ్ లో ఓడిపోయిన టీమిండియా, అడిలైడ్ వేదికగా గెలవాలని నెట్స్ లో బాగానే ప్రాక్టీస్ చేసింది. ప్రతి ఒక్క ప్లేయర్ ప్రాక్టీస్ చేస్తూ చెమటోడ్చారు. ఇక ఇవాళ రెండో వన్డేకు సిద్ధమయ్యారు.
ఆస్ట్రేలియా వర్సెస్ టీమ్ ఇండియా ( Australia vs India, 2nd ODI ) మధ్య నేడు రెండో వన్డే జరగనుంది. అడిలైడ్ వేదికగా ఈ రెండో వన్డే జరగనుంది. ఉదయం 9 గంటల సమయంలో మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఎనిమిదిన్నర గంటలకు టాస్ ప్రక్రియ ఉంటుంది. ఈ మ్యాచ్ కు వర్షం అద్దంకిగా మారనున్న నేపథ్యంలో టాస్ కీలకం కానుంది. ఇందులో టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ తీసుకొనింది. మొదట బౌలింగ్ తీసుకుంటేనే మొన్నటి లాగా విజయం సాధించే అవకాశాలు ఉంటాయి. టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరగనున్న ఇవాళ్టి వన్డే మ్యాచ్ జియో హాట్ స్టార్ లో ( Jio hot star
) ఉచితంగానే చూడవచ్చు. స్టార్ స్పోర్ట్స్ లో ( Star Sports) కూడా ఈ మ్యాచ్ లు ప్రసారం అవుతున్నాయి.
టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరగనున్న ఇవాళ్టి రెండో వన్డేలో రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ ఖచ్చితంగా ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ లో వీళ్ళిద్దరూ రాణిస్తేనే, తర్వాతి మ్యాచ్ లో ఉంటారు. లేకపోతే ఈ ఇద్దరికీ ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే రోకో కాంబినేషన్ కు గౌతమ్ గంభీర్ కూడా వార్నింగ్ ఇచ్చాడట. రెండో వన్డేలో ఆడకపోతే, మూడో వన్డేలో ఆడించబోమని హెచ్చరించారట. కాబట్టి కచ్చితంగా రెండో వన్డేలో బాగా ఆడి టీం ఇండియన్ గెలిపించండి అని దిశా నిర్దేశం చేశారు.
ఆస్ట్రేలియా ప్రాబబుల్ XI: ట్రావిస్ హెడ్, మిచ్ మార్ష్ (కెప్టెన్), మాట్ షార్ట్, మాట్ రెన్‌షా, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), మిచ్ ఓవెన్, కూపర్ కోనోలీ/మార్నస్ లాబుస్చాగ్నే, మిచెల్ స్టార్క్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్
ఇండియా ప్రాబబుల్ XI: రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, KL రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్
Level: Australia 🚀 Meanwhile, Others… pic.twitter.com/bpjX8xxmUv
— CricketGully (@thecricketgully) October 22, 2025