Toxic Air Pollution| దీపావళి తర్వాత భారతదేశంలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉంది. ప్రధాన నగరాల్లో గాలి నాణ్యత (AQI – ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) 350ని దాటేసింది. ఆరోగ్యానికి ఈ గాలి ఎంతో హానికరం. వాయు కాలుష్యం ఈ స్థాయిలో ఉంటే శ్వాస తీసుకోవడం కష్టమవుతోంది. చాలా మంది కళ్ళలో మంట, శ్వాస సమస్యలతో ఆస్పత్రులకు వెళుతున్నారు. ఈ పరిస్థితుల్లో బయటకు వెళ్లే ముందు గాలి కాలుష్యం చెక్ చేయడానికి AQI స్థాయి గురించి తెలుసుకోవాలి.
మీ ప్రాంతంలో గాలి కాలుష్యం లెవెల్స్ చెక్ తెలుసుకోవడం సులభం. మీ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ యాప్ తెరిచి, “AQI near me” లేదా “AQI in [మీ నగరం పేరు]” అని టైప్ చేయండి. గూగుల్ వెంటనే AQI సమాచారాన్ని చూపిస్తుంది. ఈ సమాచారం రంగుల ఆధారంగా సులభంగా అర్థమవుతుంది.
AQI స్కేల్ గాలి నాణ్యత ఆధారంగా ఆరోగ్య ప్రమాదాలను అంచనా వేస్తుంది:
వాయు కాలుష్యం ద్వారా గాలిలొ విషపూరిత కణాలు వ్యాపిస్తాయి. ఇంట్లో శుభ్రమైన గాలి కోసం ఎయిర్ ప్యూరిఫైయర్ అవసరం. మీ ఇంట్లో అవసరాల కోసం అయిదు బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్‌లు జాబితా మీ కోసం
షావోమి స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ 4: ఈ ప్యూరిఫైయర్ ఇంట్లో 500 చదరపు అడుగల వరకు గదులకు అనుకూలం. ట్రిపుల్-లేయర్ ఫిల్టర్ 99.99 శాతం చిన్న కణాలను తొలగిస్తుంది. 360-డిగ్రీ గాలి కాలుష్యాన్ని సమర్థవంతంగా క్లీన్ చేస్తుంది.
హనీవెల్ ఎయిర్ ప్యూరిఫైయర్: ఇంట్లో 853 చ.అ. కంటే పెద్ద గదులకు సరిపోతుంది. ఇందులో H13 HEPA ఫిల్టర్‌తో 4-స్థాయి ఫిల్ట్రేషన్ ఉంది. 99.99 శాతం సూక్ష్మ కాలుష్య కణాలను కూడా తొలగిస్తుంది.
ఫిలిప్స్ AC4221 స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్: ఇది 700 చ.అ. గదులకు అనుకూలం. 99.97 శాతం వైరస్‌లు, PM2.5 కణాలను తొలగిస్తుంది. 4-లేయర్ ఫిల్ట్రేషన్ వ్యవస్థ ఉంది.
క్యూబో స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ Q1000: ఈ ప్యూరిఫైయర్ 4-లేయర్ ఫిల్టర్‌తో గాలిలో పొల్లెన్ (విషపూరిత కణాలు), పొగను తొలగిస్తుంది. ఇందులోని స్మార్ట్ AI.. ఆటోమేటిక్‌గా ఆన్/ఆఫ్ ఫీచర్ ఉంది.
షార్ప్ ఎయిర్ ప్యూరిఫైయర్: ప్లాస్మాక్లస్టర్ టెక్నాలజీ, 3-స్థాయి ఫిల్టర్‌తో 99.97% సూక్ష్మ ధూళిని తొలగిస్తుంది. 0.3 మైక్రాన్ కణాలను కూడా పట్టుకుంటుంది.
చలికాలంలో వాయు కాలుష్య సమస్య తీవ్ర మవుతుంది. ఈ సీజన్‌లో AQIని చెక్ చేస్తూ ఉండండి. ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైయర్ ఉపయోగించి శుభ్రమైన గాలిని పొందండి. ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి.
Also Read: ఉచిత వైఫైతో ప్రమాదం… మీ ఫోన్, కంప్యూటర్ అంతా హ్యాక్.. ఈ జాగ్రత్తలు పాటించండి