ప్రఖ్యాత అమెరికన్ విశ్వవిద్యాలయం పరిశోధకులు ప్రపంచ మానవాళికి కీలక హెచ్చరికలు జారీ చేశారు. అక్టోబర్ 29కి ముందే సెలవులు తీసుకొని ఎంజాయ్ చేయాలని సూచించారు. ఆ తర్వాత మనుషులు ఉంటారో? లేరో? అనే అనుమానం వ్యక్తం చేశారు. వారి హెచ్చరికలు మన సౌర వ్యవస్థ గుండా ప్రయాణించే తెలియని ఇంటర్స్టెల్లార్ ఆబ్జెకట్ గురించి ఊహాగానాలకు ఆజ్యం పోసింది. 3I/ATLAS అనే పేరుతో పిలువబడే ఈ వస్తువు దాని అతిపెద్ద పరిమణాంతో పాటు అసాధారణ రసాయన సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లు పరిశోధకులు వెల్లడించారు.
3I/ATLASను తొలిసారి జూలైలో కనుగొన్నారు. ఇది దాదాపు 5.6 కిలోమీటర్ల వెడల్పు కలిగి ఉంటుంది. 33 బిలియన్ టన్నుల బరువు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అసాధారణ వేగంతో కదులుతూ.. ఔమువామువా అండ్ బోరిసోవ్ లాంటి గత ఇంటర్స్టెల్లార్ కంటే దాదాపు రెండు రెట్లు వేగంగా ప్రయాణిస్తుందన్నారు. ఈ వస్తువు అసాధారణ రసాయన కలయికతో ఉన్నట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. హవాయిలోని కెక్ II టెలిస్కోప్ నుంచి పరిశీలనలు చేసిన తర్వాత 3I/ATLAS నికెల్ టెట్రాకార్బొనిల్ ను విడుదల చేస్తుందని గుర్తించారు. ఇది గతంలో ప్యాక్టరీల నుంచి ఏర్పడిన రసాయనా కారణంగా ఏర్పడేది. టెలిస్కోప్ డేటా ఈ రసాయనిక పదార్థం ప్రతి సెకనుకు నాలుగు గ్రాముల నికెల్ ను విడుదల చేస్తుందని వెల్లడించింది. ఇంతకు ముందు ఏ తోకచుక్క, గ్రహశకలంలోనూ రికార్డు కాని కలయిగా పరిశోధకులు భావిస్తున్నారు.
అసాధారణ ఆలోచనలతో వార్తల్లో నిలిచిన హార్వర్డ్ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త డాక్టర్ అవీ లోబ్.. ఈ వస్తువు మానవ నిర్మితమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. “అది ఉనికిలో ఉన్న ఒకే ఒక ప్రదేశం ఉంది. పారిశ్రామికంగా ఉత్పత్తి చేయబడిన నికెల్ మిశ్రమాలలో ఉంది. ఇది మరే ఇతర వస్తువులో ఎప్పుడూ గమనించలేదు” అన్నారు. 3I/ATLAS సాధారణ తోకచుక్కల కంటే భిన్నంగా ఉందన్నారు లోబ్. సూర్యుడి నుంచి వాయువును విడుదల చేయడానికి బదులుగా, దాని జెట్ నేరుగా సూర్యుడి వైపు చూపుతుంన్నారు. దాని వే, రసాయన కూర్పు సహజ శక్తుల కంటే ఉద్దేశపూర్వక రూపకల్పనను సూచిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. నాసా తీరుపై లోబ్ సందేహాన్ని కూడా వ్యక్తం చేశారు. అమెరికా స్పేస్ ఏజెన్సీ ఈ వస్తువు గురించి కొంత సమాచారంతో పాటు ఫోటోలను బయటకు రాకుండా చేస్తుందన్నారు. అయితే, ఈ వస్తువు భూమికి ఎటువంటి ప్రమాదం కలిగించదని, అంతర్గత సౌర వ్యవస్థ గుండా సురక్షితంగా వెళుతుందని NASA వెల్లడించింది.
ఈ వస్తువు గురించి లోబ్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. “ఇది మేధస్సు ద్వారా రూపొందించబడితే, అది ఏమి చేస్తుందో కచ్చితంగా అంచనా వేయలేరు. వీలుంటే నెల చివరిలోగా సెలవులు ఎంజాయ్ చేయాలి” అని ప్రజలకు ఆయన సూచించారు. ఈ నెల చివర్లో ఆశించిన కొత్త డేటాతో ఆ వస్తువు వాస్తవ స్వభావంపై మరింత సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉందన్నారు.
🚨 HARVARD PROFESSOR WARNS OF INTERSTELLAR OBJECT HEADED TOWARD EARTH: “TAKE YOUR VACATION BEFORE OCTOBER 29TH, 2025”
Professor Avi Loeb says 3I/ATLAS, an interstellar object from beyond our solar system, is closing in fast.
“I don’t know if there will be meaning to money if… pic.twitter.com/8zzK0ly7An
— HustleBitch (@HustleBitch_) October 20, 2025
Read Also: భూమి ఎప్పుడు అంతరిస్తుందో చెప్పేసిన.. సూపర్ కంప్యూటర్, సముద్రం ఖాళీ!