Realme P3 5G 2025 Mobile: రియల్‌మి 2025లో తన కొత్త ఫోన్ పి3 5జిని మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ముఖ్యంగా యువతను దృష్టిలో ఉంచుకొని, స్టైలిష్ లుక్, అద్భుతమైన పనితీరు, అలాగే మధ్య తరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని ధరను రూపొందించారు. ఈ ఫోన్ 2025లో కొనాల్సిన మంచి ఎంపికల్లో ఒకటిగా నిలుస్తోంది.
డిజైన్ – బిల్డ్ క్వాలిటీ
రియల్‌మి పి3 5జి డిజైన్ పరంగా మంచి ఆకర్షనీయంగా ఉంది. 6.7 అంగుళాల అమోలేడ్ డిస్‌ప్లే, 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో స్క్రోలింగ్, గేమింగ్, వీడియో చూసే వారికి స్మూత్‌నెస్‌ను అందిస్తుంది. ఫ్రంట్ కెమెరా డిజైన్ ఫుల్ స్క్రీన్ చూసేందుకు యూజర్‌కు మంచి అనుభూతిని కలిగిస్తుంది. ఫోన్ వెనుక భాగంలో ఉన్న మ్యాట్ ఫినిష్ (Matt Finish) డిజైన్ దీనికి ఒక ప్రీమియం లుక్ అండ్ ఫీల్ ను ఇస్తుంది. అంతేకాకుండా, ఇది ఫింగర్ ప్రింట్ పడకుండా కూడా అడ్డుకుంటుంది. ఈ ఫోన్ బరువు స్మూత్‌గా బ్యాలెన్స్ చేయడానికి చేతితో కూడా సులభంగా, సౌకర్యంగా ఉంటుంది.
డిస్‌ప్లే – హెచ్‌డిఆర్10 ప్లస్ సపోర్ట్
పి3 5జిలోని 6.7 అంగుళాల అమోలేడ్ డిస్‌ప్లే. వైబ్రంట్ రంగులు, ప్యూర్ బ్లాక్‌లు, అధిక కాంట్రాస్ట్‌ను అందిస్తుంది. హెచ్‌డిఆర్10 ప్లస్ సపోర్ట్‌తో సినిమాలు, వీడియోలు, గేమ్‌లు క్లారిటీగా కనిపిస్తాయి. 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ వల్ల టచ్ రెస్పాన్స్ వేగంగా ఉంటుంది. గేమింగ్‌లో లాగ్ లేకుండా అత్యంత ఫ్లూయిడ్ అనుభవాన్ని అందిస్తుంది.
పనితీరు – హార్డ్‌వేర్
మీడియాటెక్ డైమెన్సిటీ సిరీస్ చిప్‌సెట్‌తో శక్తినిచ్చే పి3 5జి, 5జి కనెక్టివిటీతో వేగవంతమైన డేటా స్పీడ్‌లను అందిస్తుంది. 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజ్‌తో, మల్టీటాస్కింగ్, పబ్‌జి, కాల్ ఆఫ్ డ్యూటీ వంటివి 4కె వీడియో ఎడిటింగ్ వంటి భారీ టాస్క్‌లను లాగ్ లేకుండా చూడవచ్చు. జిపియూ ఆప్టిమైజేషన్ గేమింగ్‌లో స్థిరమైన ఫ్రేమ్ రేట్‌లను అందిస్తుంది. ఫోన్ హీట్ అవుతుందనే టెన్షన్ లేకుండా వాడవచ్చు.
కెమెరా – 108ఎంపి ప్రధాన సెన్సార్
పి3 5జి ట్రిపుల్ కెమెరా సెటప్‌లో 108ఎంపి ప్రధాన సెన్సార్ ఉంది, ఇది అద్భుతమైన వివరాలతో స్పష్టమైన ఫోటోలను తీస్తుంది. 8ఎంపి అల్ట్రా-వైడ్ లెన్స్ విశాల దృశ్యాలను క్యాప్చర్ చేయడానికి, 2ఎంపి మాక్రో లెన్స్ సన్నిహిత షాట్‌ల కోసం ఉపయోగపడుతుంది. నైట్ మోడ్ తక్కువ కాంతిలో కూడా అద్భుతమైన ఫోటోలను అందిస్తుంది. 32ఎంపి ఫ్రంట్ కెమెరా సెల్ఫీలు, వీడియో కాల్స్‌లో అధిక రిజల్యూషన్‌తో సహజమైన చిత్రాలను అందిస్తుంది. ఏఐ ఆధారిత ఫీచర్లు ఫోటో ఎడిటింగ్‌ను మరింత సులభతరం చేస్తాయి.
6,000mAh బ్యాటరీ
బ్యాటరీ విషయానికి వస్తే, 6,000mAh బ్యాటరీ ఉండటం వలన రెండు రోజుల వరకు చార్జింగ్ అయిపోకుండా ఉంటుంది. భారీ గేమింగ్ లేదా వీడియో స్ట్రీమింగ్‌లో కూడా ఒక రోజు పైగా చార్జింగ్ ఉండేలా చేస్తుంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్ ఫోన్‌ను 0 నుండి 100శాతం వరకు గంటలోపు ఛార్జ్ చేస్తుంది. బ్యాటరీ ఆప్టిమైజేషన్ సాఫ్ట్‌వేర్, శక్తివంతమైన చిప్‌సెట్ కలిసి బ్యాటరీ కాలాన్ని మరింత పెంచుతాయి, దీనివల్ల హై-పర్ఫార్మెన్స్ టాస్క్‌లలో కూడా ఎటువంటి రాజీ లేకుండా ఉంటుంది.
Also Read: JioUtsav Offer: జియో ఉత్సవం బంపర్ ఆఫర్.. షాపింగ్ చేసి కూపన్ వాడితే భారీ తగ్గింపు
సాఫ్ట్‌వేర్ యూజర్ ఎక్స్‌పీరియెన్స్
ఆండ్రాయిడ్ 14 ఆధారంగా రూపొందించిన రియల్‌మి UI 6.0 ఫోన్‌ను మరింత సులభంగా, వేగంగా ఉపయోగించే అనుభూతిని ఇస్తుంది. ఈ యూఐలో అవసరంలేని యాప్‌లు లేకుండా శుభ్రమైన ఇంటర్‌ఫేస్, మృదువైన యానిమేషన్లు ఉంటాయి. థీమ్‌లు, విడ్జెట్‌లు, నోటిఫికేషన్ నియంత్రణ వంటి కస్టమైజేషన్ ఎంపికలతో యూజర్ తన ఇష్టానికి అనుగుణంగా ఫోన్ పనితీరును మార్చుకునే స్వేచ్ఛ ఉంటుంది. ఈ కొత్త యూఐతో రియల్‌మి P3 5G వినియోగం మరింత సులభంగా అనిపిస్తుంది.
కనెక్టివిటీ – అదనపు ఫీచర్లు
రియల్‌మి పి3 5జి ఆధునిక కనెక్టివిటీ ఆప్షన్‌లతో సాంకేతికంగా ముందంజలో ఉంది. ఇది 5జి నెట్‌వర్క్‌లను పూర్తిగా సపోర్ట్ చేస్తూ వేగవంతమైన ఇంటర్నెట్ అనుభవాన్ని ఇస్తుంది. అలాగే వైఫై 6, బ్లూటూత్ 5.3, యూఎస్‌బి టైప్-సి 3.1 వంటి ఫీచర్లతో డేటా ట్రాన్స్ఫర్, నెట్‌వర్క్ కనెక్షన్ మరింత వేగంగా, స్థిరంగా ఉంటుంది. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ వంటి ఫీచర్లు ఫోన్‌ను సురక్షితంగా, అలాగే తక్షణం అన్‌లాక్ చేసేలా రూపొందించారు.
ధర – మార్కెట్ స్థానం
రియల్‌మి P3 5జి ధరను పరిశీలిస్తే, ఇది బడ్జెట్ విభాగంలో వినియోగదారుల అంచనాలకు పూర్తిగా సరిపోతుంది. 6 జీబీ ప్లస్ 128 జీబీ వేరియంట్ ధర 16,999 రూపాయలు, 8 జీబీ ప్లస్ 128 జీబీ 17,999 రూపాయలు, 8 జీబీ ప్లస 256 జీబీ వేరియంట్ ధర 19,999 రూపాయలుగా నిర్ణయించారు. బ్యాంక్ ఆఫర్లు, సీజనల్ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ స్కీమ్‌లతో ధర మరింత తగ్గే అవకాశం ఉంది. అంటే 15,000 నుండి 20,000 రూపాయల మధ్య విలువైన 5జి ఫోన్ కావాలనుకునే వారికి ఇది ఉత్తమ ఎంపికగా నిలుస్తుంది.