ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ కామన్ అయ్యింది. చాలా మంది తమ పనులను ఫోన్ తోనే చక్కదిద్దుకుంటున్నారు. అయితే, కొన్నిసార్లు స్మార్ట్ ఫోన్లు ఆన్ కావు. అలాంటి సమయంలో చాలా మంది టెన్షన్ పడుతుంటారు. అయితే, టెన్షన్ పడకుండా కొన్ని టిప్స్ పాటిస్తే ఫోన్ మళ్లీ పని చేసే అవకాశం ఉంటుంది. ఇంతకీ సెల్ ఫోన్ ఆన్ కాకపోతే ఏం చేయాలంటే…
⦿ఫిజికల్ డ్యామేజ్ జరిగిందేమో చూడండి
మీ స్మార్ట్ ఫోన్ ఆన్ కాకపోతే.. ముందుగా ఏమైనా డ్యామేజ్ జరిగిందేమో పరిశీలించాలి. స్క్రీన్ డ్యామేజ్ కలిగిందేమో చూడాలి. బ్యాటరీని పరిశీలించాలి. ఒకవేళ ఉబ్బినట్లు అయితే మార్పించాలి. నీళ్లలో పడిందేమో ఫోన్ ఓపెన్ చేసి చెక్ చేయాలి. మీ ఫోన్ లో ఏదైనా ఫిజికల్ డ్యామేజీ ఉంటే సర్వీస్ సెంటర్ కు తీసుకెళ్లాలి.
⦿మీ ఫోన్ ఆన్ చేయడానికి ప్రయత్నించండి
మీ స్మార్ట్ ఫోన్ కు ఎలాంటి ఫిజికల్ డ్యామేజీ కలగకపోతే, మళ్లీ ఆన్ చేసేందుకు ప్రయత్నించాలి. పవర్ బటన్ నొక్కి పట్టుకుంటే మీకు ఏమైనా వైబ్రేషన్ అనిపిస్తుందేమో చూడాలి. వాయిస్ అసిస్టెంట్‌ని ఉపయోగిస్తే, Siri, Google Assistant, Bixby ద్వారా ఆన్ చేసే అవకాశం ఉంటుంది. మీకు వైబ్రేషన్ అనిపించినా, లేదంటే ఏమైనా సౌంట్స్ వినిపించినా స్క్రీన్ ప్లాబ్లమ్ ఉన్నట్లు గుర్తించాలి.
⦿బ్యాటరీ ఛార్జ్ చేయండి
మీ ఫోన్ లో ఎలాంటి సమస్య లేకుండా బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయిందేమో గమనించాలి. మీ ఫోన్ ఛార్జ్ చేయడానికి ప్రయత్నించండి. కొద్ది సేపు ఛార్జింగ్ పెట్టిన తర్వాత మళ్లీ ఆన్ చేయడానికి ప్రయత్నించండి. మీ ఫోన్ ఫ్లగ్ ఇన్ చేసినప్పుడు వైబ్రేట్ అయితే, బ్యాటరీ బాగానే ఉన్నట్లు అర్థం. ఒకవేళ మీ ఛార్జర్ సమస్య ఉందేమో పరిశీలించాయి. మరో ఛార్జింగ్ కేబుల్ తో ఛార్జింగ్ చేసేందుకు ప్రయత్నించాలి. ఫోన్ ఛార్జింగ్ పోర్ట్ ను కూడా చెక్ చేయాలి. అక్కడ డస్ట్ పేరుకు పోయినా ఛార్జింగ్ ఎక్కదు. ఛార్జ్ పోర్ట్ ను క్లీన్ చేసి మళ్లీ ఛార్జ్ చేయడానికి ప్రయత్నించాలి.
⦿ఫోర్స్ రీస్టార్ట్ చేయండి
ఒక్కోసారి సాఫ్ట్ వేర్ లో సమస్యల కారణంగా స్క్రీన్ బ్లాక్ గా మారుతుంది. కానీ, ఫోన్ ఆన్ లోనే ఉంటుంది. ఆలాంటి సమయంలో ఫోర్స్ రిస్టార్ట్ చేయడం వల్ల ఫోన్ ఆన్ అయ్యే అవకాశం ఉంటుంది.
⦿మీ ఫోన్ ఫ్యాక్టరీ సెట్టింగ్ చేయండి
కొన్నిసార్లు మీ ఫోన్ తరచుగా ఆన్, ఆఫ్ అవుతుంది. సాఫ్ట్ వేర్ లో సమస్య కారణంగా ఇలా జరుగుతుంది. ఈ నేపథ్యంలో మీ ఫోన్ ను ఫ్యాక్టరీ రీస్టార్ట్ చేయడం వల్ల ఫోన్ లో సమస్య పరిష్కారం అవుతుంది. అయితే, ఫోన్ లోని ఫోటోలు, వీడియోలు, కాంటాక్ట్స్ అన్నీ డిలీట్ అవుతాయి. ముందుగానే డేటా అంతా మరో చోట సేవ్ చేసుకోవడం మంచిది.
⦿ ఫర్మ్ వేర్‌ను రీ ఫ్లాష్ చేయండి
కొన్నిసార్లు మీ ఫోన్ రికవరీ మోడ్ పని చేయకుంటే, ఫర్మ్ వేర్ ను ఫ్లాష్ చేయాలి. అలా చేయండం వల్ల స్మార్ట్ ఫోన్ మళ్లీ యథావిధిగా నడిచే అవకాశం ఉంటుంది. అయితే ఫర్మ్ వేర్ రీ ఫ్లాష్ అనేది కాస్త కష్టమైన ప్రాసెస్ కావడంతో, సర్వీస్ సెంటర్ కు తీసుకెళ్లడం ఉత్తమం.
⦿సర్వీస్ సెంటర్ లో రిపేర్ చేయించండి
మీ స్మార్ట్ ఫోన్ అన్ని ప్రయత్నాలు చేసినా ఆన్ కాకపోతే సర్వీస్ సెంటర్ కు తీసుకెళ్లడం మంచిది. అక్కడ మీ స్మార్ట్ ఫోన్ కు ఎలాంటి సమస్య ఉన్నా రిపేర్ చేసే అవకాశం ఉంటుంది. అయితే, మీ ఫోన్లను సంబంధింత కంపెనీ సర్వీస్ సెంటర్ లోనే రిపేర్ చేయడం ఉత్తమం.
Read Also: రెడ్‌మీ నుంచి అదిరిపోయే 5G స్మార్ట్ ఫోన్, ధర మరీ ఇంత తక్కువా?