E-Paper
Advertisement

Chicken Feather: కోడి ఈకల నుంచి కరెంట్.. ఉత్పత్తి ఇలా..!

Chicken Feather: కోడి ఈకల నుంచి కరెంట్.. ఉత్పత్తి ఇలా..!
Advertisement

Chicken Feather: కోడి ఈకే కదా అని హీనంగా చూడొద్దు. ఎందుకూ పనికి రానివని మనం భావించే ఆ ఈకల నుంచి కాలుష్య రహిత విద్యుత్తును తయారు చేయొచ్చు. జ్యూరిచ్‌లోని ఈటీహెచ్, సింగపూర్‌లోని నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ(ఎన్‌టీయూ) పరిశోధకులు ఈకలనూ లాభసాటిగా మార్చి విద్యుత్తు తయారు చేసే కొత్త ప్రక్రియను ఆవిష్కరించారు.

పౌల్ట్రీ సహా ఆహార రంగం మొత్తం భారీ మొత్తంలో వ్యర్థాలు, ఉప ఉత్పత్తులకు కారణమవుతోంది. కోళ్ల పరిశ్రమ వల్ల ఏటా ఉత్పత్తయ్యే ఈకలు 40 మిలియన్ టన్నులని అంచనా. వీటిని కాల్చి పడేస్తుండటంతో బూడిద వ్యర్థంగా మారుతోంది. ఫలితంగా కార్బన్-డై-ఆక్సైడ్‌తో పాటు విషపు వాయువైన సల్ఫర్-డై-ఆక్సైడ్ భారీ మొత్తంలో విడుదలవుతోంది.

Advertisement

ఎందుకూ పనికి రాని ఆ ఈకలకే ఈటీహెచ్, ఎన్‌టీయూ పరిశోధకులు అదనపు విలువను జోడిస్తున్నారు. సులువైన, పర్యావరణహిత విధానంలో వాటిని వినియోగించుకునే ప్రక్రియను కనుగొన్నారు. ఇందులో భాగంగా కోడి ఈకల నుంచి కెరటిన్ అనే ప్రొటీన్‌ను వెలికితీశారు. దానిని అమలాయిడ్ ఫైబ్రిల్స్ అనే అతి శ్రేష్ఠమైన ఫైబర్‌గా మార్చారు. ఆ కెరటిన్ ఫైబ్రిల్స్‌నే ఫ్యూయల్ సెల్ మెంబ్రేన్‌గా వినియోగించి విద్యుత్తును తయారు చేయొచ్చనేది ఈటీహెచ్-ఎన్‌టీయూ పరిశోధన సారాంశం.

హైడ్రోజెన్, ఆక్సిజెన్‌ను వినియోగించుకుని ఫ్యూయల్ సెల్స్ కాలుష్యరహిత విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. ఉష్ణంతో పాటు నీరు మాత్రమే విడుదలవుతాయి. భవిష్యత్తులో సుస్థిర ఇంధనోత్పత్తిలో ఈ పరిశోధన కీలకమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఫ్యూయల్ సెల్‌కు సెమీపర్మియబుల్ మెంబ్రేన్ అనేది గుండెకాయలాంటిది. ఈ పొర ఎలక్ట్రాన్లను అడ్డుకుని ప్రోటాన్లు మాత్రమే ప్రవహించేలా చేస్తుంది. వెలుపల ఉన్న సర్క్యూట్‌లో రుణాత్మకంగా చార్జ్ అయిన యానోడ్ నుంచి ధనాత్మక కాథోడ్‌కు ప్రసరించేలా చేస్తుంది. దాంతో కరెంట్ ఉత్పత్తి అవుతుంది.

Advertisement

సంప్రదాయ ఫ్యూయల్ సెల్స్‌లో ఈ మెంబ్రేన్లు అత్యంత విషపూరితమైన రసాయనాలతో తయారవుతాయి. ఇందుకు అయ్యే ఖర్చు కూడా ఎక్కువే. పైపెచ్చు.. ఆ రసాయనాలను విచ్ఛిన్నం చేయడం కూడా కష్టమే. ఈటీహెచ్-ఎన్‌టీయూ రిసెర్చర్లు అభివృద్ధి చేసిన మెంబ్రేన్‌లో జీవసంబంధ కెరటిన్ మాత్రమే ఉంటుంది.

అందుకే ఇది పర్యావరణహితమే కాకుండా పెద్ద పెద్ద మొత్తాల్లో లభ్యమవుతుంది. కోళ్ల ఈకల్లో 90% కెరటిన్ ప్రొటీనే ఉంటుంది. దీని ద్వారా లాబొరేటరీల్లో తయారు చేసే మెంబ్రేన్ చాలా చౌక అనే చెప్పొచ్చు. సంప్రదాయ మెంబ్రేన్లకయ్యే వ్యయంలో మూడోవంతుకే బయోలాజికల్ మెంబ్రేన్లు లభ్యం కాగలవు.

Related News

10000mAh బ్యాటరీ, 4K కెమెరాతో POCO X8 Series.. రూ.3,000 డిస్కౌంట్ ఆఫర్!

6000mAh బ్యాటరీ, IP68 రేటింగ్.. ఈ ప్రైజ్ రేంజ్‌లో ఇలాంటి ఫోన్ రావడం ఇదే తొలిసారి!

గూగుల్ పిక్సెల్ ఫ్యాన్స్‌కి పండగే.. ఆ ఫోన్ ధర రూ.13,300 తగ్గింది, ఈ డీల్ మిస్ అవ్వొద్దు!

హెల్దీగా తినాలని ఉందా? బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్స్ ఇవే!

4K డిస్‌ప్లే, 12700mAh బ్యాటరీతో Lenovo Yoga Tab Gen 2.. ధరెంతో తెలుసా?

హైదరాబాద్‌లో TCS భారీ ఏఐ ప్రాజెక్ట్.. రూ.57,600 కోట్లతో HyperVault డేటా సెంటర్!

బడ్జెట్‌లో బెస్ట్ క్యాసియో అనలాగ్ వాచ్.. ఇలాంటి వాచ్ ఒక్కటైనా ఉండాలి

గూస్‌బంప్స్ తెప్పిస్తున్న యాపిల్ ఈవెంట్.. iPhone 18 Proతో పాటు వచ్చే కొత్త డివైజ్‌లు ఇవే!

Big Stories

Advertisement
×