E-Paper
Advertisement

Congress : ఆరు గ్యారెంటీలు.. నూరు సీట్లు గ్యారెంటీ.. లండన్ లో ఎన్నారైలు ప్రచారం..

Congress :  ఆరు గ్యారెంటీలు.. నూరు సీట్లు గ్యారెంటీ..  లండన్ లో ఎన్నారైలు ప్రచారం..
Advertisement

Congress : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో తనదైన శైలిలో దూకుడు పెంచింది హస్తం పార్టీ. ఆరు గ్యారెంటీ పథకాలతో తెలంగాణలో ప్రచారాన్ని ముమ్మరం చేసింది. మరోవైపు NRI సెల్‌ యూకే ఆధ్వర్యంలో లండన్‌లో ప్రచారం ప్రారంభించారు. ఆరు గ్యారెంటీ పథకాలు, నూరు సీట్లు గ్యారంటీ అంటూ లండన్‌లో ఆరు-నూరు కార్యక్రమం చేపట్టింది టీపీసీసీ NRI సెల్‌ యూకే. ఈ కార్యక్రమంలో మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్‌ శ్రీధర్‌బాబు వర్చువల్‌గా పాల్గొన్నారు.

యువత, మహిళలు, రైతులకు ఇవ్వబోయే వివిధ సంక్షేమ పథకాల గురించి వివరించారు శ్రీధర్‌బాబు. విద్యార్థుల కోసం 5 లక్షల ఏటీఎం కార్డు.. 10 లక్షల రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. అధికారంలోకి రాగానే మెగా DSC ప్రకటించి ఏక కాలంలో భారీ సంఖ్యలో ఉద్యోగ భర్తీ చేపడుతామన్నారు. గల్ఫ్‌ సంక్షేమ బోర్డు, NRI సెల్‌ ఏర్పాటుపై మేనిఫెస్టోలో పొందుపర్చే అంశాన్ని పరిశీలిస్తామన్నారు శ్రీధర్‌బాబు.

Advertisement

వచ్చే ఎన్నికల్లో ఆరు గ్యారెంటీ పథకాలతో ప్రజల్లోకి వెళ్లి వంద సీట్లలో గెలుపే లక్ష్యంతో ముందుకెళ్తామన్నారు టీపీసీసీ NRI సెల్‌ యూకే కన్వీనర్‌ వేణుగోపాల్‌. ఇలా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×