Highway Sign board pull ups| సోషల్ మీడియాలో వెంటనే పాపులర్ అయిపోయేందుకు ఈ రోజుల్లో యువత యమ క్రేజీ పనులు చేస్తోంది. ఎంతో ప్రమాదకరమైన స్టంట్స్ చేసేందుకు కూడా యువత వెనుకాడడం లేదు. సోషల్ మీడియాలో త్వరగా ఇన్‌ఫ్లుయెన్సర్ గా పేరు తెచ్చుకోవాలనే ప్రయత్నంలో ప్రాణాలను సైతం లెక్కచేయడంలేదు. ప్రమాదకర స్టంట్స్ చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ప్రయత్నమే ఇద్దరు యువకులు చేశారు.
వివరాల్లోకి వెళితే.. సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్ రీల్ చేయడం కోసం ఉత్తర్ ప్రదేశ్ లోని అమేఠీ ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు ప్రమాదకర స్టంట్స్ చేశారు. రీల్స్ వెంటనే వైరల్ అవ్వడానికి నేషనల్ హైవే సైన్ బోర్డుకు వేలాడుతూ పుల్ అప్స్ చేశారు. ఈ వీడియోని ఉత్తర్ ప్రదేశ్ లోని నేషనల్ హైవే 931 పై చిత్రీకరించారు. వీడియోలో వీరిద్దరూ చొక్కా లేకుండా కేవలం ప్యాంటు ధరించి రోడ్డుకు 10 మీటర్ల ఎత్తులో ఉన్న హైవే సైన్ బోర్డుకు వేలాడుతూ పుల్ అప్స్ చేస్తున్నారు.
अमेठी की सड़कों पर खतरों के खिलाड़ी pic.twitter.com/K7vpYSEgEh
— Priya singh (@priyarajputlive) September 29, 2024
ఒక యువకుడు పుల్ అప్స్ చేస్తే మరో యువకుడు సైన్ బోర్డు చివరన నిలబడి ఎదురు చూస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో దివంగత పంజాబీ సింగర్ సిద్ధు మూసేవాలా పాటలు వినిపిస్తున్నాయి. ఆ వీడియో చూస్తే.. ఆ యువకులు జారీ పడితే వారి చేతులు కాళ్లు విరగడమో లేదా తలకు గాయాలైతే ఏకంగా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం జరిగే అవకాశముంది. ఒకవేళ కిందపడే సమయంలో రోడ్డుపై వేగంగా వచ్చే వాహనాలు ఢీ కొడితే ఇక అంతే సంగతులు.
ఈ వీడియో వైరల్ కావడంతో అమేఠీ పోలీసులు స్పందించారు. వీడియోలో కనిపిస్తున్న యువకులను అరెస్టు చేస్తామని.. విచారణ ప్రారంభించామని తెలిపారు. ఇలాంటి ప్రమాదకర విన్యాసాలు మరెవరూ చేయకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.
Also Read: పండుగ రోజు విషాదం.. ఇడ్లీ తిని వ్యక్తి మృతి.. అత్యాశకు పోయి
ఇలాంటి విన్యాసమే మరో యువకుడు బిహార్ లో చేశాడు. అతని పేరు నీరజ్ యాదవ్. బిహార్ లోని సమస్తిపూర్ కు చెందిన నీరజ్ కు ఇన్‌స్టాగ్రామ్ లో 2 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అతని అకౌంట్ లో 600 కు పైగా వీడియోస్ ఉన్నాయి. తాజాగా నీరజ్ ఒక బైక్ స్టంట్ చేసిన వీడియో బాగా వైరల్ అవుతోంది.
यह लड़का लोगों के जान के लिए खतरा बन गया है, इसको बचाने में लगी है समस्तीपुर पुलिस। रोज ऐसे कारनामे सड़क पर करके वीडियो डालता हैं।
Bike Number: BR33AT5170 pic.twitter.com/3U3knqR21X
— छपरा जिला 🇮🇳 (@ChapraZila) September 23, 2024
ఈ వీడియోలో నీరజ్ ఒక బైక్ నడుపుతూ దానిపై పుష్ అప్స్ చేస్తూ కనిపించాడు. పైగా ఈ వీడియోకు నమస్తే ఇండియా అని టైటిల్ కూడా పెట్టాడు. నీరజ్ యాదవ్ మరోవీడియోలో అతను బైక్ పై నిలబడి చేతులు వదిలేసి దాన్ని వేగంగా నడుపుతున్నాడు. ఈ వీడియోని షేర్ చేసిన ఒక యూజర్. ”ఈ కుర్రాడిపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. ప్రజలకు ఏమైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు. వీడియోలో బైక్ నెంబర్ స్పష్టంగా కనిపిస్తోంది.” అని కామెంట్ చేశాడు.