EPAPER

Devara Collections : మాస్ జాతర కాదు… మసి పూస్తున్నారు..

Devara Collections : మాస్ జాతర కాదు… మసి పూస్తున్నారు..

Devara Collections : దేవర.. ఓ మాస్ జాతర. మొదటి మూడు రోజుల్లోనే రికార్డ్ స్థాయి కలెక్షన్స్‌ వచ్చాయి. ఫ్యాన్స్‌ పూనకాలతో థియేటర్స్ అన్నీ కళకళలాడాయి. సెంటర్ ఏదైనా రికార్డ్ మాదే అన్నట్టుగా దూసుకుపోయింది దేవర. బట్.. ఈ లెక్కల్లో నిజమెంత? అసలు సినిమా టాక్ ఏంటి? మాస్ జాతరలు, పూనకాల్లో వాస్తవమెంత?


ముందుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ఓ చిన్న నోట్.. ఇది నెగటివ్ పబ్లిసటీ కాదు.. ఫాల్స్ ప్రాపగండా అసలే కాదు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం అంతే. ఇప్పుడు విషయానికి వద్దాం..

దేవరకు మంచి ఓపెనింగ్స్ ఉన్నాయి. తొలి మూడు రోజుల్లో కలెక్షన్స్ దుమ్ముదులిపాయి. జస్ట్ త్రీడేస్‌లోనే 140 నుంచి 145 కోట్ల కలెక్షన్స్ సాధించింది దేవరా. ఈ లెక్కలు చూసుకుంటే 70 శాతం రికవరీ అయ్యింది. ఇంకా జస్ట్‌ 30 శాతం రికవరీ అయితే చాలు.. దేవరా గట్టెక్కినట్టే.. ఆ తర్వాత వచ్చేటివన్ని లాభాలే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. నిజానికి భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చింది ఎన్టీఆర్‌ దేవర. యాక్చువల్‌గా రిలీజ్‌కు ముందు రోజే 29 థియేటర్లలో ప్రీమియర్‌ షోలు వేశారు.


ఈ ప్రిమియర్‌ షోలో ప్రతి టికెట్‌ 1500 చొప్పున అమ్మేశారు. మరోవైపు రెండు తెలుగు స్టేట్స్‌లో టికెట్ ధరలను పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఒక్కో టికెట్‌పై భారీగా ధరను పెంచేశారు. అయినా కానీ మూవీ, ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఎక్కడా తగ్గలేదు. మూవీ చూసేందుకు ఎగబడ్డారు. దీంతో మొదటి మూడు రోజుల పాటు అదరిపోయాయి కలెక్షన్స్.

మండేని వదిలేద్దాం.. ఫస్ట్ త్రీ డేస్ లెక్కేద్దాం. నైజాం ఏరియాలో 30 నుంచి 33 కోట్లు.. వైజాగ్‌.. 9 కోట్లు.. ఈస్ట్‌లో 6 కోట్లు. వెస్ట్‌లో 5 కోట్లు.. కృష్ణాలో 5 కోట్లు.. గుంటూరు ఏరియాలో 8 కోట్లు.. నెల్లూరు 3 కోట్లు.. ఇలా సీడెడ్‌లో 17 నుంచి 18 కోట్లు రాబట్టింది.. నైజాం ప్లస్ ఏపీ కలిపి 85 కోట్లు.. కర్ణాటకలో 10.5 కోట్లు.. తమిళనాడు 2.10 కోట్లు.. కేరళలో అరకోటి, నార్త్‌లో 14 కోట్లు.. యూఎస్‌లో 19 కోట్లు.. మిగిలిన నాన్ ఓవర్సీస్‌ మొత్తం 7 నుంచి 8 కోట్లు..
ఇలా ఉన్నాయి దేవరా కలెక్షన్స్‌. అయితే తమిళనాడులో 8 కోట్లకు, కేరళలో 2 కోట్లకు కొనుగోలు చేశారు. అక్కడ మాత్రం డిస్ట్రిబ్యూటర్స్ ఇంకా బయటపడనట్టే.

అయితే మండే నుంచి దేవర కలెక్షన్స్‌ పడిపోయాయి. టికెట్లు తెగడం లేదు.. బట్.. ముందున్న హాలీడేస్‌ పైనే దేవర ఆధారపడి ఉంది. సెలవుల్లో జనాలు థియేటర్లకు క్యూ కడితే దేవరకు తిరుగు లేదు. బట్.. ఇప్పటికే దేవరపై మిక్స్‌డ్ టాక్ ఉంది. కొందరు మూవీ అదుర్స్ అంటున్నారు. కొందరు నెగటివ్‌గా చెబుతున్నారు. అయితే ఈ మిక్స్‌డ్ రివ్యూస్ బుకింగ్స్‌పై ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. అయితే ఇవీ యాంటీ ఫ్యాన్స్‌ చేస్తున్నారా? లేక కొన్ని పార్టీలు పనిగట్టుకొని ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయా? అనే డౌట్స్ మాత్రం ఇప్పటికీ అలాగే ఉన్నాయి..

అయితే ఇదంతా నాణానికి మరోవైపు. కలెక్షన్స్‌ గురించి ప్రస్తుతం ఫిలీం సర్కిల్స్‌లో ఓ టాక్ నడుస్తోంది. కలెక్షన్స్‌ విషయంలో దేవర టీమ్ ఇస్తున్నంత హైప్ లేదన్నది దాని సారాంశం. వచ్చిన లెక్కలను మరింత పెంచి చూపిస్తున్నారట. వచ్చిన కలెక్షన్స్‌కు 30 పర్సెంట్‌ యాడ్ చేసి చూపిస్తున్నారని తెలుస్తోంది. నిజంగా మూవీకి అంత మంచి టాక్ ఉంటే.. మండే వచ్చే సరికి కలెక్షన్స్‌ ఏకంగా 20 నుంచి 30 శాతం ఎందుకు పడిపోయాయి? థియెటర్ల నుంచి ఎప్పటికప్పుడు లెక్కలు తెప్పిస్తున్నారు. సోషల్ మీడియా నుంచి మాత్రం ఆ లెక్కలను బయటికి రిలీజ్ చేయడం లేదు. ప్రతి రోజు తమకు కావాల్సిన నెంబర్స్‌ను జనాల్లోకి పంపుతున్నారు. ప్రస్తుతం అవే మనం చూస్తున్నామన్న ప్రచారం జరుగుతోంది.
ఇవే ఇప్పుడు సినిమాపై అనేక డౌట్స్ రెయిజ్ అయ్యేలా చేస్తోంది..

ఓ మూవీ హిట్టా..? ఫట్టా..? అనేది ఈ కాలంలో ఎలా చూస్తున్నారనేది మనకు తెలిసిందే. సినిమా టాక్ ఎలా ఉన్నా.. తాము పెట్టిన పెట్టుబడిని వెనక్కి తీసుకొచ్చుకునేందుకు అనేక జిమ్మిక్కులు చేస్తున్నారు. భారీగా స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నారు. టికెట్ రేట్లు పెంచేస్తున్నారు. అయితే స్టోరి బాగున్నా.. లేకున్నా.. భారీ సినిమాలకు పెట్టిన పెట్టుబడి మాత్రం వచ్చేస్తుంది.

అయితే అది నిజమైన హిట్టా? ఫట్టా? అనేది తొలి నాలుగు రోజుల తర్వాత థియేటర్లు ఏ మాత్రం నిండుతున్నాయన్న దాన్ని బట్టి ఉంటుంది..
ఇప్పుడు దేవర విషయంలో నాలుగు రోజులు అయిపోయింది.. మరి ఓసారి బుక్‌ మై షో ఓపెన్ చేసి.. మూవీ పరిస్థితి ఎలా ఉందో చూడండి. మీకే అర్థమవుతుంది.

Related News

Naga Chaitanya: నాగచైతన్య ట్విటర్ అకౌంట్ హ్యాక్.. అదేంటి అలా పోస్ట్ చేశాడు?

Prabhash : రాజేంద్ర ప్రసాద్‌ను పరామర్శించిన ప్రభాస్..!

Unstoppable with NBK: సీజన్ 4 మొదటి గెస్ట్ గా అల్లు అర్జున్.. నంద్యాల టాపికే హైలైట్.. ?

Vettaiyan: ‘వేట్టయాన్’పై తెలుగు ప్రేక్షకుల ఆగ్రహం.. ఇదేనా మీరు ఇచ్చే గౌరవం?

Shobitha Dulipala : అప్పుడు గుండెలు పగిలేలా ఏడ్చాను… అక్కినేని కోడలు బయటపెట్టిన నిజం..

Tripti dimri: యానిమల్ విజయం నరకాన్ని మిగిల్చింది.. బ్యూటీ షాకింగ్ కామెంట్స్..!

Maa Nanna Super Hero : సుధీర్ బాబు డేరింగ్ స్టెప్ … రెండ్రోజుల ముందే మూవీ రిలీజ్

×