Gestation Robot: పిల్లల కోసం దంపతులు.. రోజులు.. వారాల తరబడి ఆ పని చేయక్కర్లేదు. జస్ట్ తండ్రి స్పెర్మ్, తల్లి అండం ఉంటే చాలు.. చిటికెలో ఫలదీకరణ చేసి.. బిడ్డను తయారు చేసే ప్రోసెస్ చేసే రోబోలు వచ్చేస్తున్నాయి. చైనా పరిశోధకులు ఆ దిశగా కీలక పరిశోధనలు కొనసాగిస్తున్నారు. ప్రెగ్నెన్సీ హ్యూమనాయిడ్ రోబోలను డెవలప్ చేస్తున్నారు. గర్భం ధరించడంతో పాటు కృత్రిమ గర్భంలో శిశువును నవమాసాలు మోసి, సురక్షితంగా జన్మనివ్వబోతున్నాయి.
రోబో గర్భంలో శిశువు పెరుగుదల
సింగపూర్ లోని నన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ సైంటిస్ట్ డాక్టర్ జాంగ్ కిఫెంగ్ నేతృత్వంలోని గ్వాంగ్‌జౌకు చెందిన కైవా టెక్నాలజీ ఈ రోబోను అభివృద్ధి చేస్తోంది. నెలలు నిండకుండా జన్మించే శిశువుల సంరక్షణ కోసం ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఇంక్యుబేటర్ల కంటే ఈ రోబో చాలా డిఫరెంట్ గా ఉండబోతోంది. గర్భాన్ని ధరించడం మొదలుకొని శిశువు జననం వరకు మొత్తం గర్భధారణ ప్రక్రియను ఈ రోబో ఫాలో అవుతుంది. గర్భధారణ నుంచి ప్రసవం వరకు శిశువు పూర్తిగా హ్యూమనాయిడ్ రోబోలోని గర్భంలో పెరుగుతుంది. ఇందులో ఆర్టిఫీషియల్ ఊంబ్ టెక్నాలజీ రోబో బొడ్డులో అమ్నియోటిక్ ద్రవంతో నింపిన కృత్రిక గర్భం మానవ గర్భాన్ని అనుకరిస్తూ శిశువు పెరుగుదలకు అనువైన పరిస్థితిని కల్పిస్తుంది. ఈ పరిశోధన విజయవంతమైతే, సంతానోత్పత్తి లేని జంటలు ఈ విధానం ద్వారా బిడ్డలను కనే అవకాశం ఉంటుంది.
గొట్టాల ద్వారా పోషకాల సరఫరా
పిండం కృత్రిమ గర్భం లోపల పెరుగుతుందని పరిశోధకులు వెల్లడించారు. గొట్టం ద్వారా పోషకాలను పంపించనున్నట్లు వెల్లడించారు. అయితే, అండం, స్పెర్మ్ ఎలా ఫలదీకరణం చేయబడుతుందనే దానిపై శాస్త్రవేత్తలు పూర్తి వివరాలను వెల్లడించలేదు.
ప్రెగ్నెన్సీ హ్యూమనాయిడ్ రోబోలపై ఆందోళనలు
మరోవైపు ఈ ప్రెగ్నెన్సీ హ్యూమనాయిడ్ రోబోపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. శిశువు- తల్లి బంధం గురించి చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అండాలు, స్పెర్మ్ ను సేకరించడం పిల్లలపై మానసిక ప్రభావం ఉంటుందని అనుమానిస్తున్నారు. అయితే, ఈ టెక్నాలజీ పునరుత్పత్తి శాస్త్రంలో విప్లవాత్మక మార్పులకు కారణం అవుతుందని భావిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 15 శాతం జంటలను ప్రభావితం చేసే వంధ్యత్వ సవాళ్లను ఎదుర్కొనే వారికి ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు. నిజానికి ఇదేమీ పూర్తిగా కొత్త పరిశోధన కాదని, ఇప్పటికే కొంత మంది పరిశోధకులు బయోబ్యాగ్ లో గొర్రెపిల్లను విజయవంతంగా పెంచారని వెల్లడించారు. ఆర్టిఫిషియల్ ఊంబ్ ఆలోచనకు అప్పుడే బీజం పడిందన్నారు.
Read Also: ఆ దేశంలో పిల్లలకు బదులు.. వీధి కుక్కలను దత్తత తీసుకుంటారట!
2026లో రోబో మోడల్ ప్రారంభం
ఈ ప్రెగ్నెన్సీ హ్యూమనాయిడ్ రోబోలకు సంబంధించిన నమూనాను 2026లో ప్రారంభించాలని పరిశోధకులు భావిస్తున్నారు. దీని అంచనా వ్యయం దాదాపు లక్ష చైనీస్ యువాన్లు ఉంటుంది. భారత కరెన్సీలో ఈ ధర సుమారు రూ. 13 లక్షలు ఉంటుందన్నారు. మరికొద్ది సంవత్సరాల్లోనే ఈ రోబోకు సంబంధించిన పరిశోధన ఫలితాలు వెల్లడి అవుతుందంటున్నారు.
Read Also: కుక్కతో ఆంటీలు డ్యాన్స్.. ఆర్జీవీ ట్వీట్ చూస్తే నవ్వు ఆగదు!