ఢిల్లీలో వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయారు. కొంత మంది తీర్పుకు మద్దతు పలుకుతుంటే, మరికొంత మంది తీర్పును వ్యతిరేకిస్తూ ఆందోళన బాటపట్టారు. ముఖ్యంగా పెటా సభ్యులు, జంతు ప్రేమికులు వీధి కుక్కలకు పట్ల సానుభూతి వ్యక్తం చేస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిరసనలో భాగంగా తాజాగా కొంత మంది ఆంటీలు కుక్కను ఎత్తుకుని డ్యాన్స్ చేశారు. దానిని ముద్దు చేస్తూ సరదాగా గడిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోను ఆర్జీవీ తన ట్విట్టర్ లో షేర్ చేశారు.ఈ పోస్టు కింద ఉన్న కామెంట్స్ చూడండి అంటూ ట్వీట్ చేశారు.
ఆర్జీవీ తన కామెంట్స్ లో వీధి కుక్కల కోసం పోరాటం చేస్తున్న వారిపై సటైర్లు వేశారు. “ధనవంతులైన స్త్రీలు తమ విలువైన కుక్కలను భుజాలపై మోస్తారు. అయితే, వారి సొంత పిల్లలు తమ పని మనిషి భుజాలపై ఉంటారు. బహుశ వీధి కుక్కల ప్రేమికులు గత జన్మలు వీధి కుక్కలు కావచ్చు” విమర్శించారు.
అటు “ఒక కుక్క విశ్వాసంగా ఉంటుంది. ఎందుకంటే దానికి నమ్మకద్రోహం ఎలా చేయాలో తెలియదు. నేను ఈ వీడియోలో ఉన్న అందరు రాడికల్ కుక్క ప్రేమికులకు చెప్తున్నాను. “కుక్కలు మనుషుల కంటే మంచివి” అని మీరు అంటున్నారు. అది మీ చుట్టూ ఉన్న నిర్దిష్ట మనుషుల గురించి చేసే కామెంట్స్. నిజంగా మీకు కుక్కలపై ఉన్న ప్రేమ కాదు” అంటూ సటైర్లు వేశారు.
“ఇక దేవుడు సృష్టించిన ఏ జీవిని అయినా ఎవరైనా ప్రేమించవచ్చు. అది మనిషి అయినా, కుక్క అయినా, పిల్లి అయినా, దోమ అయినా, ఎలుక అయినా, కరోనా వైరస్ అయినా, వారు తమ ఇంట్లో ఉన్నంత వరకు. కానీ, ఇక్కడ మనం వీధి కుక్కలు వీధుల్లో పిల్లలను చంపడం గురించి మాట్లాడుతున్నాము. దాన్ని పట్టించుకోకుండా కేవలం కుక్కలు బాధపడుతాయని ప్రేమ ఒలకబోయడం విచిత్రంగా ఉంది” అని రాసుకొచ్చారు.
మరోవైపు “డాగ్ లవర్స్ ప్రభుత్వ నిర్వాహకులను నిందిస్తుంటే, వారు వెళ్లి అధికారులను, రాజకీయ నాయకులను వారి కాళ్ళపై, వారి శరీరంలోని వివిధ భాగాలను కూడా కొరికి పరిష్కారాలను వేగవంతం చేయాలి. కానీ, ఈలోగా వీధి కుక్కలచే క్రూరంగా చంపబడుతున్న పేద పిల్లల గురించి ఆలోచించాలి” అని కామెంట్ చేశారు.
Check the comments under this https://t.co/vxqNDJv3C5
— Ram Gopal Varma (@RGVzoomin) August 18, 2025
ఇక ఆర్టీవీ తనదైన స్టైల్ లో ఓ కవిత కూడా చెప్పేశారు. ఈ గొప్ప కవితను అందరికీ పాఠశాలల్లో నేర్పించారంటూ రాసుకొచ్చారు. “అన్నిటినీ ప్రకాశవంతంగా, అందంగా,
అన్ని జీవులను గొప్పవి, చిన్నవిగా,
అన్నిటినీ జ్ఞానవంతంగా, అద్భుతంగా,
ప్రభువైన దేవుడు సృష్టించాడు” కలుషితం చేసే బొద్దింకలు, ప్లేగును వ్యాప్తి చేసే ఎలుకలు, విషాన్ని ఇంజెక్ట్ చేసే పాములు, వ్యాధులను సృష్టించే దోమలు, పిల్లలను చంపే వీధి కుక్కలను పరిగణనలోకి తీసుకోకండని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Read Also: ఆ దేశంలో పిల్లలకు బదులు.. వీధి కుక్కలను దత్తత తీసుకుంటారట!