BigTV English

Train Viral Video: సెల్ఫీకి ప్రయత్నం.. క్షణాల్లో దొంగల బుట్టలో ఫోన్.. వీడియో వైరల్!

Train Viral Video: సెల్ఫీకి ప్రయత్నం.. క్షణాల్లో దొంగల బుట్టలో ఫోన్.. వీడియో వైరల్!

Train Viral Video: రైలు ప్రయాణం అనగానే మనసుకు ఒక ప్రత్యేకమైన ఆనందం కలుగుతుంది. కిటికీ పక్కన కూర్చుని గాలి తాకిడిని ఆస్వాదిస్తూ ప్రయాణించడం, ఫోన్‌తో సెల్ఫీలు తీసుకోవడం, వీడియోలు షూట్ చేయడం చాలామంది అలవాటు చేసుకున్నారు. అయితే ఈ ఆనందం ఇప్పుడు భయంగా మారింది. ఎందుకంటే ఇటీవల రైళ్లలో కొత్త రకం దొంగతనం పెద్ద ఎత్తున జరుగుతోంది. క్షణాల్లో కర్రతో కొట్టి మొబైల్ ఫోన్లను లాక్కొనే ఈ ఘటనలు ఇప్పుడు రైలు ప్రయాణికులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.


తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రైలు కిటికీ నుండి మొబైల్‌తో సెల్ఫీ తీసుకుంటున్న ప్రయాణికుడి చేతిలోని ఫోన్‌ను పక్కనే పొంచి ఉన్న ఓ వ్యక్తి కర్రతో కొట్టి ఎత్తుకెళ్లాడు. క్షణాల వ్యవధిలో జరిగిన ఈ ఘటన చూసిన వారందరూ షాక్ అయ్యారు. “అంత వేగంగా రైలు వెళ్తుంటే ఇంత సాహసం ఎలా చేస్తారు?” అని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

కొత్త ముఠాల టార్గెట్..
సాధారణంగా ఇలాంటి దొంగతనాలు రద్దీ రైళ్లలో, డోర్ల దగ్గర కూర్చుని లేదా కిటికీ బయటకు మొబైల్ చాచి మాట్లాడుతున్న వారిపైనే జరుగుతున్నాయి. దొంగలు రైలు ట్రాక్ పక్కనే పొంచి ఉంటారు. రైలు సమీపానికి వచ్చేసరికి, క్షణంలోనే కర్రతో కొట్టి ఫోన్లను లాక్కుంటారు. దొంగతనం జరిగిపోయిందని గ్రహించేలోపే రైలు చాలా దూరం వెళ్లిపోతుంది. తిరిగి వెనక్కి వెళ్లి వెతకడం అసాధ్యం అవుతుంది.


రైల్వే పోలీసుల హెచ్చరిక
ఇలాంటి ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో రైల్వే పోలీసులు ఇప్పటికే పలు స్టేషన్లలో అలర్ట్‌ అయ్యారు. “ప్రయాణికులు డోర్ దగ్గర నిలబడి ఫోన్లు వాడకూడదు. కిటికీ బయటకు ఫోన్ పెట్టి మాట్లాడకండి. ఇలాంటి సందర్భాల్లో అప్రమత్తంగా ఉండండి” అని వారు పదేపదే హెచ్చరిస్తున్నారు. అయినా చాలా మంది ప్రయాణికులు ఈ సూచనలను పట్టించుకోవడం లేదు.

చిన్న జాగ్రత్త – పెద్ద రక్షణ
రైలులో కిటికీ దగ్గర మొబైల్ వాడకండి. డోర్ వద్ద నిలబడి సెల్ఫీలు తీయకండి. రైలు ట్రాక్ పక్కన అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే రైల్వే భద్రతా సిబ్బందికి సమాచారం ఇవ్వండి. ఫోన్, పర్సు, విలువైన వస్తువులు ఎప్పుడూ సురక్షితంగా ఉంచుకోండి.

Also Read: Weather News: రాష్ట్రంలో కుండపోత వానలు.. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం.. పిడుగులు పడే ఛాన్స్

సోషల్ మీడియాలో వైరల్
తాజాగా వెలుగుచూసిన ఈ వీడియోపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒక సెల్ఫీ కోసం ఫోన్ బయట పెట్టడం ప్రాణాలకే ముప్పు కలిగించవచ్చు” అని కొందరు హెచ్చరిస్తుంటే, మరికొందరు “ఇది దొంగల కొత్త బిజినెస్ అయిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రయాణికుల అనుభవాలు
చాలామంది ఇప్పటికే ఇలాంటి సంఘటనలకు బలయ్యారని చెబుతున్నారు. ఫోన్ ఒక్కసారిగా లాగేసి పరుగెత్తిపోయారు. రైలు వేగం కారణంగా ఏమీ చేయలేకపోయామని బాధితులు చెబుతున్నారు. మరోవైపు, కొందరు రైలు లోపల కూర్చోవడమే సేఫ్, డోర్ దగ్గర ఫోన్ వాడితే అదే చివరి క్షణం అవుతుందని అంటున్నారు.

భద్రతా నిపుణులు చెబుతున్నదేమిటంటే.. రైలు ప్రయాణం సేఫ్‌గా ఉండాలంటే మొదట ప్రయాణికులే అప్రమత్తంగా ఉండాలి. పోలీసులు, భద్రతా సిబ్బంది ప్రతి మూలలో ఉండడం అసాధ్యం. అందువల్ల ప్రయాణికులు జాగ్రత్తగా ఉండి మొబైల్ వాడకాన్ని పరిమితం చేయాలి. రైలు ప్రయాణం ఒక ఆనందం కానీ నిర్లక్ష్యం చేస్తే అది ప్రమాదంగా మారుతుంది. ఒక క్షణం నిర్లక్ష్యం వల్ల ఫోన్ పోతే తిరిగి దొరకడం దాదాపు అసాధ్యం. కాబట్టి, జాగ్రత్తగా ఉండి సురక్షితంగా ప్రయాణించడం మాత్రమే మన చేతిలో ఉన్న పరిష్కారం.

Related News

Fact Check: క్యాబ్ డ్రైవర్ అమ్మాయిని బలవంతంగా కారులోకి లాక్కెళ్లాడా? ఆ వైరల్ వీడియో వెనుక అసలు నిజం ఇదే!

RGV Tweet: కుక్కతో ఆంటీలు డ్యాన్స్.. ఆర్జీవీ ట్వీట్ చూస్తే నవ్వు ఆగదు!

Street Dogs: ఆ దేశంలో పిల్లలకు బదులు.. వీధి కుక్కలను దత్తత తీసుకుంటారట!

Viral Video: గజరాజుతో సెల్ఫీ.. కిందపడేసి మరీ తొక్కేసింది, ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి!

Poop Suitcase: ట్రంప్‌తో మీటింగ్‌‌కు పుతిన్ తన మలాన్ని ఎందుకు తీసుకెళ్లారు? ఆ సూట్ కేస్ నిండా అదేనా?

Big Stories

×