Chromebook Vs Windows Laptop : క్రోమ్ బుక్.. ఇది విండోస్ ల్యాప్‌టాప్ కంటే భిన్నంగా ఉంటుందా.. అసలు ఈ రెండింటి మధ్య తేడా ఏంటి? ఆపరేటింగ్ సిస్టమ్ తో పాటు వీటి పనితీరులో తేడా ఉంటుందా? వీటి ధరలు ఎలా ఉంటాయి.. అనే పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
క్రోమ్ బుక్ అనేది గూగుల్ క్రోమ్ OSలో పనిచేసే ల్యాప్‌టాప్. వెబ్ ఆధారిత పనుల కోసం మాత్రమే రూపొందించిన తేలికపాటి ఆపరేటింగ్ సిస్టమ్. ఇది విండోస్ ల్యాప్‌టాప్స్ లా కాకుండా మైక్రోసాఫ్ట్ విండోస్ OSతో పనిచేస్తుంది. మల్టీపర్పస్ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్ కు సపోర్ట్ చేస్తుంది. అయితే వీటిలో ఏది బెస్ట్.. ఏ ల్యాప్ టాప్ ఏ పనులు చేస్తుంది.. అసలు క్రోమ్ బుక్, విండోస్ ల్యాప్‌టాప్ మధ్య తేడాలు ఏంటంటే..
ఆపరేటింగ్ సిస్టమ్ – క్రోమ్ బుక్స్ క్రోమ్ OSతో పనిచేస్తాయి. దీన్ని వెబ్ అప్లికేషన్ల కోసం ఆప్టిమైజ్ చేశారు. గూగుల్ సేవలతో తేలికగా పనిచేస్తాయి. విండోస్ ల్యాప్టాప్స్, విండోస్Windows OSతో నడుస్తాయి. లెగసీ అప్లికేషన్స్ తో సహా మల్టిపుల్ సాఫ్ట్వేర్లతో సులభతరంగా పనిచేస్తాయి.
సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్ – క్రోమ్ బుక్ Chrome బ్రౌజర్ తో యాక్సెస్ చేయగల వెబ్ ఆధారిత అప్లికేషన్స్ ను ఉపయోగించుకుంటుంది. ఇది Google Play Store ద్వారా Android యాప్స్ కు మద్దతు ఇస్తాయి. Windows ల్యాప్‌టాప్స్ వెబ్ ఆధారిత అప్లికేషన్స్ తో పాటు లోకల్ గా ఇన్‌స్టాల్ చేసే అప్లికేషన్స్ ను సైతం ప్రాసెస్ చేస్తాయి.
పర్ఫామెన్స్, హార్డ్ వేర్ – క్రోమ్ బుక్స్ ను మోడెస్ట్ హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్స్ ఎంతో సమర్ధవంతంగా పనిచేసేలా డిజైన్ చేశారు. బ్యాటరీ లైఫ్ ఎక్కువగా, ఖర్చు తక్కువగా ఉంటుంది. విండోస్ ల్యాప్‌టాప్ హార్డ్‌వేర్ కాన్ఫిగరేషన్‌లలో తరచూ మారుతూ ఉంటుంది. లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకూ విండోస్ ల్యాప్ టాప్స్ గేమింగ్, వీడియో ఎడిటింగ్స్ కు సపోర్ట్ చేస్తాయి.
స్టోరేజ్ – క్రోమ్ బుక్స్ లిమిటెడ్ స్టోరేజ్ తో వస్తాయి. అందుకే వీటిలో క్లౌడ్‌లో ఫైల్స్ ను సేవ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక విండోస్ ల్యాప్‌టాప్స్ పెద్ద ఫైల్స్ తో పాటు అప్లికేషన్స్ కు అనుగుణంగా డిజైన్ చేయబడ్డాయి. అందుకే వీటిలో స్టోరేజ్ ఎక్కువగా ఉంటుంది.
సెక్యూరిటీ – మాల్వేర్ ప్రమాదాన్ని తగ్గించే ఆటోమేటిక్ అప్‌డేట్స్, శాండ్‌బాక్సింగ్‌తో సహా బలమైన భద్రతకు క్రోమ్ బుక్ లో ఉండే క్రోమ్ OS పెట్టింది పేరు. ఇక Windows ల్యాప్‌టాప్స్ ను భద్రంగా ఉంచటానికి లేటెస్ట్ అప్డేట్స్ తో పాటు యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్స్ ఖచ్చితంగా కావల్సిందే.
ఇక Windows ల్యాప్‌టాప్స్ తో పోలిస్తే క్రోమ్ బుక్స్ ఎడ్యుకేషన్ కోసం అత్యద్భుతంగా ఉపయోగపడతాయి. విద్యార్థులతో పాటు అధ్యాపకులకు సైతం ఎంతో ఉపయోగకరం. వీటిలో ఉండే ఈజీ సెటప్ గూగుల్ క్లాస్ రూమ్స్, గూగుల్ వర్క్ స్పేస్ వంటి వాటితో తేలికగా ఏకీకరణ అవుతుంది. అందుకే ఈ ఫిచర్స్ ను విద్యార్ధులు నేర్చుకోవడం చాలా తేలిక. ఇంటర్నెట్‌ని బ్రౌజ్ చేస్తూ వీడియోలను స్ట్రీమ్ చేస్తూ సోషల్ మీడియాలో ఎక్కువగా నిమగ్నమయ్యే వారికి క్రోమ్ బుక్ బెస్ట్ ఛాయిస్.
ALSO READ : టాప్ బ్రాండ్ లాప్టాప్స్ పై అదిరే ఆఫర్స్… HP, Dell, Lenovo రూ. 28,990 నుంచే ప్రారంభం