BigTV English

Bigg Boss Hariteja : బిగ్ బాస్ 8 నుంచి హరితేజ అవుట్.. రెమ్యూనరేషన్ ఎన్ని లక్షలంటే..?

Bigg Boss Hariteja : బిగ్ బాస్ 8 నుంచి హరితేజ అవుట్.. రెమ్యూనరేషన్ ఎన్ని లక్షలంటే..?

Bigg Boss8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 పదోవారం ముగింపుకు చేరుకుంది. ఈ రోజు సండే ఫండే.. ఇవాళ నాగార్జున చేసే సందడితో పాటుగా ఒకరు ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ వారం నామినేషన్స్ గట్టిగానే ఉన్నాయి. ఏడుగురు నామినేషన్స్ లోకి వచ్చారు.. అయితే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో మరి కొద్ది గంటల్లో తెలియనుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో హరితేజ ఎలిమినేట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ సీజన్ 1 లో టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరిగా వచ్చిన హరితేజ గురించి అందరికి తెలిసే ఉంటుంది. ఆ సీజన్ లో టాస్కులు ఆడడంలో కానీ, ఎంటర్టైన్మెంట్ పంచడంలో కానీ, ప్రవర్తనలో కానీ తోపు అనిపించింది.. సీజన్ 8 మాత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయింది.. గత వారంలో తప్పించుకున్న ఈ అమ్మడు ఈ వారం ఇంటికి వెళ్ళబోతుంది. అయితే ఈ ఈమె ఆరు వారాలకు గాను ఎన్ని లక్షల రెమ్యూనరేషన్ ను అందుకుందో ఇప్పుడు తెలుసుకుందాం..


బిగ్ బాస్ సీజన్ 8 నుంచి తొమ్మిదో వారం నయని పావని ఎలిమినేట్ అయ్యింది.. ఇక అప్పుడే పదో వారం వచ్చేసింది. ఈ వారం డేంజర్ జోన్లో హరితేజ, యష్మీ ఉండగా, యష్మీ, నిఖిల్ మధ్య లవ్ ట్రాక్ నడుస్తుంది. దాంతో నామినేషన్ లోకి వచ్చిన ప్రతిసారి బిగ్ బాస్ తప్పిస్తూ వస్తున్నాడు. ఆటతీరు ఎలా ఉన్నా కూడా యష్మీ నిఖిల్ మధ్య లవ్ ట్రాక్ వల్లే ఆమెను సేవ్ చేస్తూ వస్తున్నాడు. అయితే ఈ వారం హౌస్ నుంచి హరితేజ ఎలిమినేషన్ కన్ఫార్మ్ అయ్యినట్లే.. బిగ్ బాస్ షోలో టాప్ 3 వరకు వచ్చి అశేష ప్రేక్షకాభిమానంని పొందింది. ఆ ఫేమ్ తోనే ఈమె సినిమాల్లో అవకాశాలను కూడా సంపాదించింది. సినిమాల్లో ఎదో ఒకటి రెండు అవకాశాలు కాదు, టాప్ క్యారక్టర్ ఆర్టిస్ట్స్ లో ఒకరిగా అని చెప్పొచ్చు. రీసెంట్ గా వచ్చిన సూపర్ హిట్ ‘దేవర’ లో కూడా ఈమె నటించింది..

ఈ సీజన్ కు వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈమె ఆరు వారాలు పాటుగా బాగానే కొనసాగింది. అయితే నిన్ననే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ ని పూర్తి చేసారు. మనకి టెలికాస్ట్ అయ్యేది మాత్రం ఈరోజే. ఇదంతా పక్కన పెడితే అసలు హరితేజ ఎలిమినేట్ అవ్వడానికి కారణాలేంటో చూద్దాం. ఈమెకు టాస్కులు ఆడే అవకాశం వచ్చినప్పుడు బాగానే ఆడింది. ఆట పరంగా ఓకే.. మనసులో కుళ్ళు, అసూయ వంటి లక్షణాలను జనాలు నచ్చలేదు. హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుండి ఈమె పక్క కంటెస్టెంట్స్ గురించి ఎవరో ఒకరి దగ్గర చెడుగా మాట్లాడడం ఈమెకు బాగా నెగటివ్ అయ్యింది.. దాంతో ఈ వారం ఎలిమినేట్ అయ్యింది. ఇక ఈమె ఆరు వారాల పాటు హౌస్ లో కొనసాగింది. ఎన్ని లక్షల రెమ్యూనరేషన్ తీసుకుందంటే.. 24 లక్షలు రెమ్యూనరేషన్ ఇచ్చారట. ఈ సీజన్ లో ప్రస్తుతం టాప్ ఓటింగ్ తో కొనసాగుతున్న నిఖిల్ కి 12 వారాలతో సమానమైన రెమ్యూనరేషన్ అది. అంటే ఆయనకీ వారానికి కేవలం 2 లక్షలు మాత్రమే. హరి తేజ కి మాత్రం నిఖిల్ కి డబుల్ రెమ్యూనరేషన్. ఇదే ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది..


Tags

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×