
Cyber Security:- సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది పెరిగిన తర్వాత సైబర్ సెక్యూరిటీ అనేది కూడా మనిషి జీవితంలో ఒక భాగమయిపోయింది. సైబర్ సెక్యూరిటీ సెల్ అనేది ఎంత మెరుగ్గా పనిచేసినా కూడా అందులో మెలకువలో తెలిసిన వారు సైబర్ క్రైమ్స్ చేయడంలో తమ సామర్థ్యాన్ని అంతా ఉపయోగిస్తున్నారు. అందులో సైబర్ సెక్యూరిటీ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే సైబర్ సెక్యూరిటీపై ఆసక్తి ఉన్నవారి కోసం ప్రభుత్వం ఒక విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
విద్యార్థి స్టేజ్ నుండే సైబర్ సెక్యూరిటీపై అవగాహన ఉండాలని నిపుణులు చెప్తున్నారు. అలా అయితేనే వారు సమయం గడిచేకొద్దీ సైబర్ సెక్యూరిటీ విభాగంలో మెరుగ్గా పనిచేయగలరని అంటున్నారు. అందుకే కొయంబత్తూరు సిటీ పోలీసులను పలువురు విద్యార్థులను సెలక్ట్ చేసి వారికి సైబర్ సెక్యూరిటీపై అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటివరకు దాదాపు 30 మంది సైన్స్‌తో పాటు ఆర్ట్స్ స్టూడెంట్స్ కూడా సైబర్ సెక్యూరిలో ఇంటర్న్‌షిప్‌ను పూర్తిచేశారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం 15 మంది స్టూడెంట్లు ఇంటర్న్‌షిప్‌లో పాల్గొంటున్నారని తెలుస్తోంది.
కొయంబత్తూరు పోలీసులు ప్రారంభించిన ఈ ప్రోగ్రాంలో కర్ణాటకలోని మైసూరు విద్యార్థులను కూడా భాగస్వాములను చేసుకోవాలని ఆ రాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు కోరారు. అయితే త్వరలోనే ఈ విధానాన్ని అన్ని రాష్ట్రాల్లో ప్రవేశపెట్టాలని సైబర్ టీమ్ అనుకుంటోంది. ఈ ప్రోగ్రాంలో సైబర్ స్పేస్‌ను క్రిమినల్స్ ఎలా ఉపయోగించుకుంటారు, నేరాలకు ఎలా పాల్పడతారు అనే విషయాలపై విద్యార్థులకు అవగాహన రానుంది. అంతే కాకుండా పోలీసులు కావాలనే లక్ష్యం ఉన్నవారికి ఈ ప్రోగ్రాం ఎన్నో కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఉపయోగపడుతుందని సైబర్ పోలీసులు చెప్తున్నారు.
ఈ ఏడాది జనవరిలో సైబర్ సెక్యూరిటీ ఇంటర్న్‌షిప్‌ను ప్రారంభించినట్టుగా పోలీసులు తెలిపారు. ఈ ఇంటర్న్‌షిప్ 14 రోజులు, ఒక నెల, రెండు నెలలుగా కేటాగిరీల వారీగా విభజించి ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం ఇతర రాష్ట్ర విద్యార్థులకు కూడా ఈ ఇంటర్న్‌షిప్‌లో పాల్గొనాలని ఉన్నా కూడా సరిపడా సౌకర్యాలు లేకపోవడం వల్ల వారు ముందడుగు వేయలేకపోతున్నామని కోయంబత్తూరు పోలీసులు వాపోతున్నారు. ప్రస్తుతం కోయంబత్తూరులో కోర్సుతో సంబంధం లేకుండా ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఈ ఇంటర్న్‌షిప్ అందుబాటులో ఉంటుందన్నారు.