BigTV English

Types Of Hackers : బాబోయ్.. హ్యాకర్స్ లో ఎన్ని రంగులో.. ఒకరు చేసిన పని మరొకరు చేయరా.. దిమ్మతిరిగే నిజాలివే!

Types Of Hackers : బాబోయ్.. హ్యాకర్స్ లో ఎన్ని రంగులో.. ఒకరు చేసిన పని మరొకరు చేయరా.. దిమ్మతిరిగే నిజాలివే!

Types Of Hackers : హ్యాకర్స్.. ఈ పేరు వింటేనే ఎవరైనా హడలిపోతారు. టెక్నాలజీని ఉపయోగించుకొని స్మార్ట్ ఫోన్స్, లాప్టాప్స్, డివైజెస్ ను హ్యాక్ చేసి అందులో చోరీలకు పాల్పడుతూ ఉంటారు. డబ్బులు తీసుకోవడం, ఫోటోలు, వీడియోలతో బెదిరంచటం వంటివి చేస్తూ ఉంటారు. అయితే నిజానికి హ్యాకర్స్ అందరు దొంగలే కాదు. హ్యాకర్స్ లో చాలా రకాలు ఉన్నారు. వీరిలో కొందరు ప్రభుత్వం కోసం పని చేసేవారు ఉన్నారు.. మరి కొందరు మంచి పనుల కోసం పనిచేసే వారు ఉన్నారు. అయితే హ్యాకర్స్ ఎన్ని రకాలు, వీరి ఏ ఏ పనులు చేస్తారో నిజంగా ఆశ్చర్యపోకతప్పదు.


నిజానికి హ్యాకర్స్ లో వైట్ హాకర్స్, బ్లాక్ హ్యాకర్స్, గ్రే హ్యాట్ హ్యాకర్స్, స్క్రిప్ట్ కిడ్డీస్, గ్రీన్ హ్యాట్ హ్యాకర్స్, బ్లూ హ్యాట్ హకర్స్, రెడ్ హ్యాట్ హ్యాకర్స్ అంటూ చాలా రకాలు ఉన్నారు. వీరితో పాటు జాతీయంగా,  అంతర్జాతీయంగా పని చేసేందుకు మరికొంతమంది హ్యాకర్స్ ఉన్నారు. ఇక వీరు చేసే పనులపై మీరు ఓ లుక్కేయండి.

వైట్ హాకర్స్ – నిజానికి వైట్ హ్యాకర్స్ ప్రభుత్వం కోసం పనిచేస్తారు. సైబర్ నేరాలను పసిగట్టేందుకు నేరగాళ్లు ఏ దారులను ఉపయోగించి హ్యాక్ చేస్తారనే విషయాలను కనిపెట్టేందుకు పని చేస్తారు. వీరినే నైతిక హ్యాకర్స్ లేదా సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ అని పిలుస్తూ ఉంటారు.


బ్లాక్ హ్యాకర్స్ – సిస్టమ్స్ నుంచి దొంగతనంగా సమాచారాన్ని సేకరించి డబ్బులు పరంగా వేధించే హకర్స్ వేరే. వీరందరినీ క్రిమినల్ జాబితాలో చేరుస్తారు. ఈ హ్యాకర్స్ చాలా ప్రమాదకరం.

గ్రే హ్యాట్ హ్యాకర్స్ – ఈ హ్యకర్స్ కేవలం ప్రభుత్వం కోసం పనిచేయరు. మంచి చెడూ రెండు విధాల పని చేస్తూ ఖాళీగా ఉంటే డబ్బులు సంపాదించేందుకు హ్యాకింగ్ మీద ఆధారపడుతూ ఉంటారు.

స్క్రిప్ట్ కిడ్డీస్ – అత్యంత ప్రమాదకరం స్క్రిప్ట్ కిడ్డీస్. వీరు ఇతర హ్యాకర్స్ ల డౌన్లోడ్, హ్యాకింగ్ స్కిల్స్ ని ఉపయోగించకుండా నేరుగా నెట్వర్క్, వెబ్సైట్స్ ను హ్యాక్ చేస్తారు. అత్యంత ప్రమాదకరంగా సమాచారం దొంగలిస్తూ హ్యాకింగ్ కు పాల్పడతారు.

గ్రీన్ హ్యాట్ హ్యాకర్స్ – హ్యాకర్స్ అందరి కంటే విభిన్నంగా ఉంటూ హ్యాకర్స్ నుంచే నైపుణ్యాలు నేర్చుకుంటారు. హ్యాకింగ్ విధానాలని నేర్చుకొని, వారిపై ప్రశ్నలు సంధించి మరిన్ని హ్యాకింగ్స్ కు ప్రయత్నిస్తారు.

బ్లూ హ్యాట్ హ్యాకర్స్ – నిజానికి వీరు కూడా వైట్ హాకర్స్ లాంటివాళ్లే. కంపెనీల సెక్యూరిటీ కోసం పనిచేస్తారు. కొత్త సాఫ్ట్ వేర్ ను లాంఛ్ చేసే ముందు దాన్ని ఇంకెవరూ హ్యాక్ చేయకుండా ఉండేలా తగిన చర్యలు తీసుకుంటారు.

రెడ్ హ్యాట్ హ్యాకర్స్ – ఈ హ్యకర్స్ బ్లాక్ హ్యకర్స్ ను, సైబర్ దొంగలను ఛేదించేందుకు పనిచేస్తారు. మంచి కోసమే పని చేసినప్పటికీ వీరిని నిఘా హ్యాకర్స్ అంటారు. దొంగల్ని పట్టుకోవడంలో కఠిన నిర్ణయాలు అమలు చేయడంలో ముందుంటారు.

జాతీయ, అంతర్జాతీయ హ్యాకర్స్ – పూర్తిగా ప్రభుత్వానికి కింద పనిచేసే ఈ హ్యాకర్స్ ఇతర దేశాల నుంచి రహస్య నివేదికలను చేరవేసేందుకు పనిచేస్తారు. దేశానికి ఎటువంటి ముప్పు రాకుండా నిరంతరం శ్రమిస్తారు.

ALSO READ : మెుబైల్స్ జాతర.. మరికొద్ది రోజులే.. ఆఫర్స్ వదిలారో మరి దొరకవ్

Related News

Galaxy S24 vs iPhone 16 Pro: గెలాక్సీ S24 అల్ట్రా vs ఐఫోన్ 16 ప్రో.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లతో ఏది బెస్ట్?

iPhone 17 Series 5G: ఐఫోన్ 17 సిరీస్ 5జి.. కొత్త ఫీచర్లతో టెక్ లవర్స్‌కి పెద్ద గిఫ్ట్

Apple Foldable iPhone: ఆపిల్ ఫోల్డెబుల్ ఫోన్ డిజైన్ లీక్.. అత్యంత ఖరీదైన ఐఫోన్ ఇధే

Samsung Galaxy S25 5G: వామ్మో.. ఏకంగా 200MP కెమేరానా.. మార్కెట్లోకి వచ్చేసిన సామ్‌సంగ్ గెలెక్సీ ఎస్25 5G

PS5 Big Discount: ప్లే స్టేషన్ 5పై భారీ తగ్గింపు.. ఇండియాలో మాత్రమే

Amazon Flipkart Iphones: అమెజాన్ ఫ్లిప్‌కార్ట్‌ ఫెస్టివల్ సేల్.. ఐఫోన్ 15, 16పై బెస్ట్ డీల్స్ ఇవే

Realme 15T 5G: రియల్‌మీ 15టి 5జి స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. పవర్ యూజర్స్ కోసం స్పెషల్ మొబైల్..

WhatsApp Secert Chat: వాట్సాప్ లో సీక్రెట్ చాటింగ్ ఫీచర్..  ఎలా చేయాలంటే..

Big Stories

×