E-Paper
Advertisement

పండుగ ఆఫర్ల పేరుతో భారీ సైబర్ మోసాలు.. ఆన్‌లైన్ షాపింగ్‌లో సేఫ్‌గా ఉండండిలా!

పండుగ ఆఫర్ల పేరుతో భారీ సైబర్ మోసాలు.. ఆన్‌లైన్ షాపింగ్‌లో సేఫ్‌గా ఉండండిలా!
Advertisement

Diwali Shopping Scam Alert: దీపావళి వచ్చిందంటే కొత్త ఫోన్ కొనాలని, ఇంటికి కావాల్సిన వస్తువులు తీసుకోవాలని చాలామంది ప్లాన్ చేస్తుంటారు. దీనికి తగ్గట్టుగానే ఆన్‌లైన్ షాపింగ్ సైట్లు భారీ డిస్కౌంట్లు, ఆకట్టుకునే ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షిస్తుంటాయి. అయితే ఈ ఆఫర్ల సందడిలోనే సైబర్ నేరగాళ్లు కూడా తమ పని మొదలుపెడుతున్నారు. నమ్మశక్యం కాని డిస్కౌంట్లు, ఫ్రీ గిఫ్ట్‌ల పేరుతో వాట్సప్ మెసేజ్‌లు, నకిలీ వెబ్‌సైట్ లింకులు పంపుతూ.. అమాయకులను టార్గెట్ చేస్తుంటారు. తెలియక ఒక్క లింక్ క్లిక్ చేసినా మీ వ్యక్తిగత వివరాలతో పాటు బ్యాంక్ ఖాతాలోని డబ్బు కూడా ప్రమాదంలో పడవచ్చు. మరి దీపావళి షాపింగ్‌లో ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందామా..

భారీ తగ్గింపు కనిపిస్తే..

మార్కెట్ ధర కంటే చాలా తక్కువకు ఫోన్ లేదా గాడ్జెట్ ఇస్తామంటే వెంటనే నమ్మేయొద్దు. 70 నుంచి 80 శాతం తగ్గింపు అంటూ తెలియని వెబ్‌సైట్లు ప్రకటనలు ఇస్తే.. ఆఫర్ నిజమో కాదో చూడాలి. ధరను కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో లేదా పేరున్న షాపింగ్ యాప్‌లో పోల్చండి. ఇప్పుడే కొనండి, చివరి మూడు వస్తువులే.. అంటూ తొందర పెట్టే సందేశాలను నమ్మకపోవడమే ఉత్తమం.

నకిలీ లింకులు, యాప్‌లకు దూరంగా..

Advertisement

ఉచిత ఫోన్, బంగారు నాణెం, గిఫ్ట్ వోచర్ వచ్చిందంటూ వాట్సప్‌లో మెసేజ్ రావచ్చు. బహుమతి కోసం లింక్ నొక్కాలని, వివరాలు ఇవ్వాలని అడిగితే జాగ్రత్త. వెబ్‌సైట్ అడ్రస్‌లో చిన్న అక్షర తేడా ఉన్నా అది నకిలీది కావచ్చు. కొనేముందు కస్టమర్ కేర్ వివరాలు, రిటర్న్ పాలసీ, సమీక్షలు చూడాలి. తెలియని లింకుల నుంచి APK ఫైళ్లు డౌన్‌లోడ్ చేయకూడదు. యాప్‌లను Google Play Store లేదా Apple App Store నుంచే ఇన్‌స్టాల్ చేయండి.

Also Read: TRAI సూచనలతో జియో సంచలనం.. రూ.147కే అన్‌లిమిటెడ్ కాలింగ్.. రూ.200 లోపు 4 చౌకైన ప్లాన్లు!

డెలివరీ పేరుతో మోసం..

Advertisement

పార్సిల్ ఆగిపోయిందని, అడ్రస్ మార్చాలని లేదా చిన్న మొత్తం చెల్లించాలని వచ్చే మెసేజ్‌లలోని లింకులను నొక్కకండి. డెలివరీ వివరాలను అధికారిక యాప్‌లోనే చూడండి. బ్యాంక్ లేదా షాపింగ్ సంస్థ పేరుతో ఫోన్ చేసే వ్యక్తులకు OTP, UPI PIN, పాస్‌వర్డ్ చెప్పకండి. స్క్రీన్ షేరింగ్ యాప్ ఇన్‌స్టాల్ చేయమన్నా అంగీకరించకండి. ఖాతాలకు వేర్వేరు బలమైన పాస్‌వర్డ్‌లు పెట్టి, టూ-ఫ్యాక్టర్ సెక్యూరిటీ ఆన్ చేయండి.

మోసపోతే వెంటనే ఇలా చేయండి..

డబ్బులు పంపినా, ఖాతాలో అనుమానాస్పద లావాదేవీ కనిపించినా వెంటనే బ్యాంక్‌కు ఫోన్ చేసి చెప్పండి. అవసరమైతే కార్డు లేదా ఖాతాను బ్లాక్ చేయమని అడగండి. సైబర్ మోసంపై 1930 నంబర్‌కు కాల్ చేయండి. cybercrime.gov.inలో ఫిర్యాదు నమోదు చేయండి. ట్రాన్సాక్షన్ వివరాలు, మెసేజ్‌లు, స్క్రీన్‌షాట్లు భద్రపరచండి. అనుమానం ఉంటే పాస్‌వర్డ్‌లు మార్చి, తెలియని యాప్‌లను తొలగించండి. త్వరగా ఫిర్యాదు చేస్తే డబ్బు బదిలీని ఆపే అవకాశం ఉంటుంది.

Also Read: వాట్సప్ యూజర్లకు బిగ్ రిలీఫ్.. చాట్ స్క్రీన్ నుంచే రీసెంట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేయండిలా!

Tags

Related News

ఇంటర్నెట్ అక్కర్లేదు.. భారత్ సొంతంగా తీసుకొచ్చిన స్వదేశీ పవర్‌ఫుల్ ఏఐ మోడల్స్ ఇవే!

జియో అదిరిపోయే దీపావళి ఆఫర్.. 10 నెలల రీఛార్జ్‌తో 15 నెలల జియోహోమ్ సేవలు ఫ్రీ!

స్మార్ట్‌ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. టవర్లు లేకపోయినా ఫుల్ సిగ్నల్.. ‘ట్రాయ్’ సంచలన సిఫార్సులు!

TRAI సూచనలతో జియో సంచలనం.. రూ.147కే అన్‌లిమిటెడ్ కాలింగ్.. రూ.200 లోపు 4 చౌకైన ప్లాన్లు!

వాట్సప్ యూజర్లకు బిగ్ రిలీఫ్.. చాట్ స్క్రీన్ నుంచే రీసెంట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేయండిలా!

హోమ్ థియేటర్ కొనాలనుకుంటున్నారా? దీని కంటే బెస్ట్ ఉండదేమో!

గూగుల్ బాటలో మెటా.. ఉద్యోగులకు వీఈఓ ఆపర్, ప్యాకేజీ కింద బెనిఫిక్స్ చాలానే

Big Stories

Advertisement
×