JioHome Offer: ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తమ వినియోగదారులకు పండుగ వేళ అదిరిపోయే శుభవార్త చెప్పింది. దీపావళి పురస్కరించుకుని ‘జియోహోమ్’ (JioHome) సేవలకు సంబంధించి ప్రత్యేక ఫ్రీడమ్ ఆఫర్ ప్రకటించింది. లైవ్ టీవీ, అపరిమిత వైఫై (Wi-Fi), పలు ఓటీటీ యాప్ సబ్‌స్క్రిప్షన్లతో కూడిన ‘జియోహోమ్’ ప్యాకేజీని పండుగ వేళ మరింత అందుబాటులోకి తీసుకొచ్చింది. 10 నెలల రీఛార్జ్ తో 15 నెలల జియో హోమ్ సేవలను పొందే భారీ ఆఫర్ ను కస్టమర్ల ముందు ఉంచింది.
ఈ ప్రత్యేక పండుగ ఆఫర్ కింద యూజర్లు 10 నెలల రీఛార్జ్ ప్లాన్ ధర చెల్లిస్తే.. ఏకంగా 15 నెలల పాటు సేవలను పొందవచ్చని జియో ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించింది. అంటే వినియోగదారులకు 5 నెలల సేవలు ఉచితంగా లభించనున్నాయి. నెలకు రూ.666 చొప్పున 10 నెలలకు రీఛార్జ్ చేసుకుంటే ఎలాంటి అదనపు రుసుము లేకుండా మొత్తం 15 నెలల పాటు అపరిమిత వినోదాన్ని ఆస్వాదించవచ్చని జియో స్పష్టం చేసింది. అయితే ఈ ఆఫర్ ప్రస్తుతం ఉన్న జియోహోమ్ యూజర్లకు మాత్రమే వర్తిస్తుందని క్లారిటీ ఇచ్చింది.
Your festival just got an upgrade, and so did your entertainment. 😉
Claim FREE 5 months JioHome this festive season!
Give a missed call on 📞 82195 82195
#JioHome #JethalalMeme #HappyDiwali #OTT #FreedomOffer #TMKOC https://t.co/mk6KaGOOj4
— Reliance Jio (@reliancejio) November 4, 2026
అర్హత గల యూజర్లు ‘82195 82195’ నంబర్‌కు మిస్డ్‌కాల్ ఇచ్చి ఈ ప్రయోజనాన్ని పొందవచ్చని జియో స్పష్టం చేసింది. మరోవైపు కొత్తగా చేరే వినియోగదారుల కోసం కూడా జియో ఆకర్షణీయ ఆఫర్ అందించింది. కొత్త యూజర్లు 2 నెలల జియోహోమ్ ప్లాన్ తీసుకుంటే.. వారికి మరో 1 నెల ఉచిత సేవలను అందిస్తున్నారు.
జియోహోమ్ సర్వీస్ తీసుకున్న వారికి 15 భాషల్లో 1,000కి పైగా టీవీ ఛానెళ్లు ఉచితంగా లభించనున్నాయి. అలాగే టాప్ ఓటీటీ యాప్స్, అపరిమిత వైఫై డేటా కూడా పొందొచ్చు. కొత్తగా జియో హోమ్ ప్లాన్ తీసుకునేవారికి ఫ్రీ ఇన్‌స్టాలేషన్, వైఫై రూటర్, 4K టీవీ సెట్-టాప్ బాక్స్ ఉచితంగా ఇస్తున్నారు. అంతేకాకుండా JioTV+ యాప్ సాయంతో ఒకే సెట్-టాప్ బాక్స్ సాయంతో రెండు స్మార్ట్ టీవీలలో లైవ్ ఛానెళ్లు వీక్షించే వెసులుబాటును జియో కల్పిస్తోంది.
Also Read: స్మార్ట్‌ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. టవర్లు లేకపోయినా ఫుల్ సిగ్నల్.. ‘ట్రాయ్’ సంచలన సిఫార్సులు!
మరోవైపు జియో తన వార్షికోత్సవ ఆఫర్లలో భాగంగా ‘జియోభారత్’ (JioBharat) కీప్యాడ్ ఫోన్లపై కూడా ఆఫర్ ప్రకటించింది. రూ. 1,499 ధరకే జియోభారత్ (A1, B1, B2, B3 సిరీస్) హ్యాండ్‌సెట్‌తో పాటు 6 నెలల ఉచిత రీఛార్జ్ ప్లాన్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్‌లో భాగంగా నెలకు 14 జీబీ డేటా (రోజుకు 0.5 GB), ఫ్రీ హెచ్‌డీ కాలింగ్ సౌకర్యం యూజర్లకు లభిస్తుంది. అంతేకాకుండా జియోపే (JioPay), జియోసావన్ (JioSaavn), జియోహాట్‌స్టార్ (JioHotstar) కు ఫ్రీ యాక్సెస్ లభించనుంది. 23 ప్రాంతీయ భాషల్లో ఈ మెుబైల్ ను వినియోగించుకోవచ్చని జియో వర్గాలు పేర్కొన్నాయి.
Also Read: దీపావళి గిఫ్ట్ అంటే ఇదీ.. ఏకంగా ‘ఐఫోన్ 16’లతో ఉద్యోగులకు సర్ ప్రైజ్.. వీడియో వైరల్!