E-Paper
Advertisement

ఇంటర్నెట్ అక్కర్లేదు.. భారత్ సొంతంగా తీసుకొచ్చిన స్వదేశీ పవర్‌ఫుల్ ఏఐ మోడల్స్ ఇవే!

ఇంటర్నెట్ అక్కర్లేదు.. భారత్ సొంతంగా తీసుకొచ్చిన స్వదేశీ పవర్‌ఫుల్ ఏఐ మోడల్స్ ఇవే!
Advertisement

Made In India AI Models: ఇప్పటివరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సేవలను ఉపయోగించుకోవాలంటే ఇంటర్నెట్ తప్పనిసరి. కానీ ఇకపై ఆ అవసరం లేకుండానే కొన్ని ఏఐ సేవలను నేరుగా మన ఫోన్‌లోనే ఉపయోగించుకునే అవకాశం రాబోతోంది. భారత్ ఈ దిశగా కీలక అడుగు వేసింది. కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ, IndiaAI Mission మద్దతుతో EKA-1, Dhir 2B, Dhir 5B పేర్లతో మూడు స్వదేశీ ఏఐ మోడల్స్‌ను పరిచయం చేశారు.

వీటిలో Dhir 2B, Dhir 5B మోడల్స్‌ను స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లలో ఇంటర్నెట్ లేకుండానే ఉపయోగించుకోవచ్చు. దీంతో ప్రతిసారీ ఆన్‌లైన్ సర్వర్లపై ఆధారపడాల్సిన అవసరం తగ్గడమే కాకుండా.. వ్యక్తిగత సమాచారం భద్రతకు కూడా ప్రాధాన్యం ఇవ్వవచ్చు. అసలు ఈ మూడు AI మోడల్స్ ప్రత్యేకతలు ఏంటి? వీటితో ఎలాంటి పనులు చేయవచ్చు? తెలుసుకుందాం.

EKA-1.. శక్తివంతమైన AI మోడల్:

Advertisement

బెంగళూరుకు చెందిన Soket Labs సంస్థ EKA-1 మోడల్‌ను రూపొందించింది. ఈ మోడల్‌లో 26.3 బిలియన్ పారామీటర్లు ఉన్నాయి. సుమారు 7.5 ట్రిలియన్ టోకెన్ల డేటాతో దీనికి శిక్షణ ఇచ్చారు. గణితం, కోడింగ్, లాజిక్, క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం వంటి పనులను చేయగలదు. ముఖ్యంగా భారతదేశంలోని 22 అధికారిక భాషలతో పాటు ఇంగ్లీష్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. బ్యాంకింగ్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాల్లో దీన్ని ఉపయోగించే అవకాశం ఉంది.

Also Read: పండుగ ఆఫర్ల పేరుతో భారీ సైబర్ మోసాలు.. ఆన్‌లైన్ షాపింగ్‌లో సేఫ్‌గా ఉండండిలా!

Dhir 2B, Dhir 5B ప్రత్యేకత ఇదే:

Advertisement

ZenteiQ AiTech Innovations సంస్థ ఈ రెండు మోడల్స్‌ను అభివృద్ధి చేసింది. ఇవి రోజువారీ పనులకు ఉపయోగపడేలా రూపొందించారు. డాక్యుమెంట్లలో ముఖ్యమైన విషయాలను గుర్తించడం, పెద్ద ఫైళ్లను చిన్నగా వివరించడం, అవసరమైన సమాచారాన్ని వెతకడం వంటి పనులు చేయగలవు. మొత్తం 10 భారతీయ భాషలకు మద్దతు ఇస్తాయి. ముఖ్యంగా వీటిని ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌లో డౌన్‌లోడ్ చేసుకుంటే ఇంటర్నెట్ లేకుండానే ఉపయోగించుకోవచ్చు.

వ్యక్తిగత సమాచారానికి మరింత భద్రత:

సాధారణంగా ఆన్‌లైన్ ఏఐ టూల్స్‌లో మనం ఇచ్చే సమాచారం బయటి సర్వర్లకు వెళ్తుంది. కానీ ఆఫ్‌లైన్ ఏఐలో డేటా ప్రాసెసింగ్ డివైజ్‌లోనే జరుగుతుంది. దీంతో వ్యక్తిగత డాక్యుమెంట్లు, ముఖ్యమైన వివరాలను బయటకు పంపాల్సిన అవసరం తగ్గుతుంది. అయితే ఆఫ్‌లైన్‌లో పనిచేస్తుందని మాత్రమే పూర్తి భద్రత ఉందని భావించకూడదు. ఫోన్, ల్యాప్‌టాప్ భద్రత కూడా ముఖ్యం.

భారత AI రంగానికి కొత్త ఊపు:

IndiaAI Mission ద్వారా దేశీయ సంస్థలకు కంప్యూటింగ్ వనరులు, పరిశోధనకు ప్రభుత్వం మద్దతు ఇస్తోంది. ఈ మూడు మోడల్స్ కూడా అదే ప్రయత్నంలో భాగం. భవిష్యత్తులో విద్య, వ్యాపారం, ప్రభుత్వ సేవల్లో వీటి వినియోగం పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇంగ్లీష్‌పై ఎక్కువగా ఆధారపడకుండా భారతీయ భాషల్లో ఏఐ సేవలు అందితే సామాన్యులకు కూడా టెక్నాలజీ మరింత చేరువ అవుతుంది.

Also Read: TRAI సూచనలతో జియో సంచలనం.. రూ.147కే అన్‌లిమిటెడ్ కాలింగ్.. రూ.200 లోపు 4 చౌకైన ప్లాన్లు!

Tags

Related News

రూ.2,599కే అదిరిపోయే..స్మార్ట్‌వాచ్!బోట్ నుంచి కొత్త గాడ్జెట్

పండుగ ఆఫర్ల పేరుతో భారీ సైబర్ మోసాలు.. ఆన్‌లైన్ షాపింగ్‌లో సేఫ్‌గా ఉండండిలా!

జియో అదిరిపోయే దీపావళి ఆఫర్.. 10 నెలల రీఛార్జ్‌తో 15 నెలల జియోహోమ్ సేవలు ఫ్రీ!

స్మార్ట్‌ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. టవర్లు లేకపోయినా ఫుల్ సిగ్నల్.. ‘ట్రాయ్’ సంచలన సిఫార్సులు!

TRAI సూచనలతో జియో సంచలనం.. రూ.147కే అన్‌లిమిటెడ్ కాలింగ్.. రూ.200 లోపు 4 చౌకైన ప్లాన్లు!

వాట్సప్ యూజర్లకు బిగ్ రిలీఫ్.. చాట్ స్క్రీన్ నుంచే రీసెంట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేయండిలా!

హోమ్ థియేటర్ కొనాలనుకుంటున్నారా? దీని కంటే బెస్ట్ ఉండదేమో!

Big Stories

Advertisement
×