E-Paper
Advertisement

స్మార్ట్‌ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. టవర్లు లేకపోయినా ఫుల్ సిగ్నల్.. ‘ట్రాయ్’ సంచలన సిఫార్సులు!

స్మార్ట్‌ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. టవర్లు లేకపోయినా ఫుల్ సిగ్నల్.. ‘ట్రాయ్’ సంచలన సిఫార్సులు!
Advertisement

Satellite Connectivity: మారుమూల ప్రాంతాల్లో మొబైల్ సిగ్నల్స్ లేక చాలా మంది ఏదోక సందర్భంలో ఇబ్బంది పడే ఉంటారు. సమీపంలో మొబైల్ టవర్లు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. అయితే రాబోయే రోజుల్లో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్ సాధారణ మొబైల్ టవర్లపై మాత్రమే ఆధారపడకుండా నేరుగా అంతరిక్షంలోని శాటిలైట్లతో (ఉపగ్రహాలతో) కనెక్ట్ అయ్యే సాంకేతికత అందుబాటులోకి రాబోతోంది.

ట్రాయ్ కీలక సిఫార్సులు

దేశంలో ఉపగ్రహ సమాచార సేవలను (శాటిలైట్ కమ్యూనికేషన్స్) విస్తరించేందుకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) కీలక సిఫార్సులు చేసింది. ఇందులో భాగంగా డైరెక్ట్-టు-డివైస్ (D2D) ఉపగ్రహ కనెక్టివిటీకి అనుమతి ఇవ్వాలని ట్రాయ్ ప్రతిపాదించింది. కేంద్ర ప్రభుత్వం ఈ సిఫార్సులను ఆమోదించి నిబంధనలను ఖరారు చేసిన తర్వాత ఈ సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి టెలికాం వర్గాలు పేర్కొంటున్నాయి.

అసలేంటీ డైరెక్ట్-టు-డివైస్ టెక్నాలజీ?

Advertisement

ప్రస్తుతం మనం వాడుతున్న మొబైల్ ఫోన్లు.. కాల్స్ మాట్లాడటానికి, మెసేజులు పంపడానికి, ఇంటర్నెట్ వాడటానికి దగ్గర్లోని మొబైల్ టవర్లపైనే ఆధారపడుతున్నాయి. కానీ D2D సాంకేతికత అందుబాటులోకి వస్తే మొబైల్ టవర్లతో పనిలేకుండా నేరుగా ఉపగ్రహాల నుంచే నెట్‌వర్క్ సిగ్నల్ అందుతుంది. ముఖ్యంగా నెట్‌వర్క్ కవరేజ్ లేని కొండ ప్రాంతాలు, అడవులు, సముద్ర తీరప్రాంతాల్లో ఇది ఎంతో ఉపయోగకరంగా మారనుంది.

రెండు రకాల కనెక్టివిటీలకు సిఫార్సు

దేశంలో ప్రధానంగా రెండు పద్ధతుల్లో ఈ D2D సేవలను అనుమతించాలని ట్రాయ్.. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. అందులో ఒకటి ఎమ్‌ఎస్ఎస్ ఆధారిత D2D కనెక్టివిటీ. ఈ విధానంలో ఎల్-బ్యాండ్ (L-band), ఎస్-బ్యాండ్ (S-band) వంటి ప్రత్యేక ఉపగ్రహ ఫ్రీక్వెన్సీ బ్యాండ్లను ఉపయోగించి ఫోన్లు నేరుగా శాటిలైట్‌కు కనెక్ట్ అవుతాయి. భవిష్యత్తులో దేశంలో విక్రయించే ప్రతి స్మార్ట్‌ఫోన్‌లో ఈ ఫ్రీక్వెన్సీలకు సపోర్ట్ చేసే హార్డ్‌వేర్ మాడ్యూళ్లను చేర్చేలా తయారీదారులను ప్రోత్సహించాలని ట్రాయ్ సూచించింది.

ఐఎమ్‌టీ ఆధారిత D2D కనెక్టివిటీ

Advertisement

ట్రాయ్ సూచించిన రెండో పద్దతి ఇది (IMT-based D2D): ఐఎమ్‌టీ అంటే ఇంటర్నేషనల్ మొబైల్ టెలికమ్యూనికేషన్స్. ప్రస్తుతం మన సాధారణ మొబైల్ నెట్‌వర్క్‌లు వాడుతున్న స్పెక్ట్రమ్ బ్యాండ్లనే (600MHz, 700MHz, 800MHz, 900MHz, 1800MHz, 2100MHz) ఉపయోగించి ఉపగ్రహాలు నేరుగా ఫోన్లకు కనెక్టివిటీ ఇస్తాయి. అయితే దీనివల్ల ప్రస్తుతం ఉన్న సాధారణ మొబైల్ నెట్‌వర్క్ సేవలకు ఎలాంటి అంతరాయం కలగకూడదని (Non-interference basis) ట్రాయ్ స్పష్టం చేసింది.

Also Read: దీపావళి గిఫ్ట్ అంటే ఇదీ.. ఏకంగా ‘ఐఫోన్ 16’లతో ఉద్యోగులకు సర్ ప్రైజ్.. వీడియో వైరల్!

ఈ సేవలు వెంటనే వస్తాయా?

పేన పేర్కొన్న రెండు రకాల సేవలు వెంటనే ఫోన్లలో అందుబాటులోకి వచ్చే పరిస్థితి లేదని టెలికాం వర్గాలు పేర్కొంటున్నాయి. దీనికి ప్రత్యేకమైన హార్డ్‌వేర్, ఫ్రీక్వెన్సీ బ్యాండ్ల సపోర్ట్ అవసరం అవుతుందని స్పష్టం చేస్తున్నాయి. అందుకే కొత్తగా వచ్చే స్మార్ట్‌ఫోన్లలో ఈ ఫీచర్లు ఉండేలా కంపెనీలను ప్రోత్సహించాలని ట్రాయ్ కోరినట్లు తెలియజేస్తున్నారు. అయితే ప్రభుత్వం నిర్ణయించే తుది విధానాలు, నెట్‌వర్క్ మౌలిక వసతులు, టెలికాం కంపెనీలతో శాటిలైట్ నెట్‌వర్క్ నిర్వాహకులు చేసుకునే ఒప్పందాలపై ఈ సేవల లభ్యత ఆధారపడి ఉండనుంది.

Also Read: కరువు నేపథ్యంలో సర్కార్ పై బీఆర్‌ఎస్‌ పంజా! మరింత ఇరకాటంలో పెట్టేలా వ్యూహాలు! రైతు భరోసాతో రాజకీయం!

 

Tags

Related News

TRAI సూచనలతో జియో సంచలనం.. రూ.147కే అన్‌లిమిటెడ్ కాలింగ్.. రూ.200 లోపు 4 చౌకైన ప్లాన్లు!

వాట్సప్ యూజర్లకు బిగ్ రిలీఫ్.. చాట్ స్క్రీన్ నుంచే రీసెంట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేయండిలా!

హోమ్ థియేటర్ కొనాలనుకుంటున్నారా? దీని కంటే బెస్ట్ ఉండదేమో!

గూగుల్ బాటలో మెటా.. ఉద్యోగులకు వీఈఓ ఆపర్, ప్యాకేజీ కింద బెనిఫిక్స్ చాలానే

ఇలాంటి ఉద్యోగం కూడా ఉంటుందా? ఇన్‌స్టా రీల్స్ స్క్రోల్ చేస్తే చాలు.. నెలాఖరుకు జీతం!

“మా ఆఫీస్‌లో ఇలాంటి బాస్ ఉంటే బాగుండు!” సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వైరల్ వీడియో!

రూ.15వేలకే 40 ఇంచుల స్మార్ట్ హెచ్‌డీ టీవీ..ఫీచర్స్ ఇవే!

Big Stories

Advertisement
×