Meta layoffs: ప్రపంచవ్యాప్తంగా టెక్ ఇండస్ట్రీలో వస్తున్న మార్పుల నేపథ్యంలో మార్పులు చేర్పులు చేస్తున్నాయి వివిధ కంపెనీలు. ఈ క్రమంలో ఉద్యోగులకు తొలగించుకునే పనిలో పడ్డాయి. మైక్రోసాఫ్ట్, గూగుల్‌తో సహా ప్రధాన టెక్నాలజీ కంపెనీలు ఉద్యోగాలను కుదిస్తున్నాయి. వాటి దారిలో మెటా కూడా నడుస్తోంది. ఫ్రాన్స్‌లోని తమ కంపెనీ ఉద్యోగుల్లో దాదాపు మూడింట ఒక వంతు మందికి స్వచ్ఛంద ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని రెడీ చేసింది.
ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలు తమ కార్యకలాపాలను పునర్ వ్యవస్థీకరిస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు మళ్లిస్తున్న తరుణంలో ఉద్యోగాల కోతలు మొదలయ్యాయి. నెలకు ప్రధాన టెక్ కంపెనీల నుంచి ఉద్యోగాల తొలగింపు ప్రకటనలు వస్తున్నాయి. ఒకప్పుడు టెక్ కంపెనీలో పింక్ స్లిప్పులు ఇచ్చి ఉద్యోగులను ఇంటికి పంపే పద్దతి ఉండేది. మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా టెక్ కంపెనీలు జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాయి.
ఏప్రిల్‌లో మెటా తన కార్యకలాపాలను పునర్వ్యవస్థీకరించు కోవడానికి, AI పై తన దృష్టిని బలోపేతం చేసుకోవడానికి చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా తమ కంపెనీ ఉద్యోగుల్లో సుమారు 10 శాతం ఉద్యోగులను తొలగించే ప్రణాళికలను ప్రకటించింది. ఈ క్రమంలో ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తోంది. ప్రస్తుతం యూరప్‌లోని ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాల్లో యువత నిరసనలు తీవ్రతరం చేస్తోంది. కంపెనీ ఉద్యోగుల నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫ్ట్‌గా తొలగించే ప్రణాళికకు శ్రీకారం చుట్టింది మెటా సంస్థ.
ఫ్రెంచ్ పత్రిక లా లెట్రే నివేదిక ప్రకారం.. ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా సంస్థ ఫ్రెంచ్ విభాగం నుంచి దాదాపు 100 మంది ఉద్యోగులను తొలగించాలని డిసైడ్ అయ్యింది. ప్రస్తుతం అక్కడ సుమారు 300 మంది ఉద్యోగులు ఉన్నారు. తొలగించే ఉద్యోగులకు ఎగ్జిట్ ఆఫర్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. గురువారం అంటే నవంబర్ 5 ఆయా ఉద్యోగులకు చివరి రోజు అయ్యింది. ఉద్యోగులు ఒకొక్కరుగా తొలగించే నిర్ణయం కాకుండా అక్కడ ట్రేడ్ యూనియన్లతో ఒప్పందం కుదుర్చుకుని ఉద్యోగుల సంఖ్యను తగ్గించు కోవాలన్నది మెటా ప్లాన్.
ఈ వ్యవహారంలో జులై నుంచి చర్చలు జరుగుతున్నాయి. ఈ ఆఫర్ అప్లై చేసుకునేందుకు చివరి రోడు నవంబర్ 5 అని తెలిపింది. ఇంతకీ తొలగించే ఉద్యోగులకు ఇచ్చే పరిహారం ఏంటి అన్నది అసలు పాయింట్. ఆ కంపెనీలో పని చేసే ఉద్యోగులకు ఏడాదికి రూ. 2.15 జీతం ఇచ్చేది. 10 నెలల అదనపు బెనిఫిట్స్ తోపాటు ఉద్యోగం వదిలేందుకు అంగీకరిస్తే భారీ ప్యాకేజీ ఇవ్వనుంది. పని చేసిన ప్రతీ ఏడాదికి రూ.2.15 చొప్పున నెలల జీతం పరిహారంగా ఇవ్వనుంది. మరో 10 నెలలపాటు జీతంలో 80 శాతం ఇవ్వనుంది.
ALSO READ: ఇలాంటి ఉద్యోగం కూడా ఉంటుందా? ఇన్‌స్టా రీల్స్ స్క్రోల్ చేస్తే చాలు.. నెలాఖరుకు జీతం!
అలాగే కంపెనీ ఉద్యోగుల మాదిరిగానే లీవ్ ఇవ్వనుంది. అంతేకాదు కొత్త స్కిల్స్ చేర్చుకోవడానికి సొంతంగా బిజినెస్ పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వనుంది. ఇప్పటికే గూగుల్ ఐదు దేశాల్లో తమ కంపెనీ ఉద్యోగులకు వీఈఓ ఆఫర్ ఇచ్చింది. మైక్రోసాఫ్ట్ కంపెనీది అదే పరిస్థితి. ఈ కంపెనీ దాదాపు 60 వేల మంది ఉద్యోగులను బై ఔట్ ప్రొగ్రామ్ ప్రకటించిన విషయం తెల్సిందే.