E-Paper
Advertisement

TRAI సూచనలతో జియో సంచలనం.. రూ.147కే అన్‌లిమిటెడ్ కాలింగ్.. రూ.200 లోపు 4 చౌకైన ప్లాన్లు!

TRAI సూచనలతో జియో సంచలనం.. రూ.147కే అన్‌లిమిటెడ్ కాలింగ్.. రూ.200 లోపు 4 చౌకైన ప్లాన్లు!
Advertisement

Jio Recharge Plans: ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాకు పోటీగా జియో అదిరిపోయే ఆఫర్‌తో మన ముందుకొచ్చింది. కేవలం కాలింగ్ కోసమే మొబైల్ వాడేవారికి తక్కువ ధరలో 4 వాయిస్ ఓన్లీ రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో రూ.147కే అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయం ఉండటం విశేషం. అంతేకాదు.. ఉచిత నేషనల్ రోమింగ్, 300 ఎస్ఎంఎస్‌ల ప్రయోజనాలు కూడా లభిస్తాయి. తక్కువ ఖర్చుతో సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచుకోవాలనుకునే వారికి ఈ ప్లాన్లు మంచి ఆప్షన్‌గా చెప్పొచ్చు. రూ.147 నుంచి రూ.197 వరకు అందుబాటులో ఉన్న ఈ నాలుగు ప్లాన్లలో దేనికి ఎన్ని రోజుల వ్యాలిడిటీ ఉంది? ఏ ప్లాన్ తీసుకుంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుందో తెలుసుకుందాం.

TRAI సూచనలతో కొత్త ప్లాన్లు:

టెలికాం వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ట్రాయ్ వాయిస్ కాల్స్ మాత్రమే అవసరమైన వారికి ప్రత్యేకమైన చౌకైన ప్లాన్లు తీసుకురావాలని టెలికాం కంపెనీలకు సూచించింది. దీనికి అనుగుణంగా జియో నాలుగు ప్లాన్లను తీసుకొచ్చింది. ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా కూడా ఇలాంటి ప్లాన్లను అందిస్తున్నాయి. అయితే ధర, వ్యాలిడిటీ విషయంలో జియో ప్లాన్లు వినియోగదారులకు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి.

Advertisement

Also Read: వాట్సప్ యూజర్లకు బిగ్ రిలీఫ్.. చాట్ స్క్రీన్ నుంచే రీసెంట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేయండిలా!

రూ.147, రూ.177 ప్లాన్ల వివరాలు:

జియో తీసుకొచ్చిన నాలుగు ప్లాన్లలో రూ.147 ప్లాన్ అతి తక్కువ ధరలో లభిస్తుంది. ఇందులో 22 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. అదే సమయంలో అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, దేశవ్యాప్తంగా ఉచిత నేషనల్ రోమింగ్ సదుపాయం అందుతుంది. అలాగే 300 ఉచిత ఎస్ఎంఎస్‌లు కూడా వాడుకోవచ్చు. ఇక రూ.177 ప్లాన్ విషయానికి వస్తే.. ఇందులో 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. కాలింగ్, రోమింగ్, ఎస్ఎంఎస్ ప్రయోజనాలు రూ.147 ప్లాన్‌లో ఉన్నట్లుగానే ఉంటాయి. ఎక్కువ రోజులు సిమ్ వాడాలనుకునేవారికి ఇది ఉపయోగపడుతుంది.

రూ.196, రూ.197 ప్లాన్ల ప్రత్యేకత:

Advertisement

రూ.196 ప్లాన్‌లో 30 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాలింగ్, ఉచిత నేషనల్ రోమింగ్‌తో పాటు 300 ఎస్ఎంఎస్‌లు వస్తాయి. ఇక రూ.197 ప్లాన్‌లో ఒక క్యాలెండర్ నెల వ్యాలిడిటీ ఉంటుంది. అంటే.. రీఛార్జ్ చేసిన తేదీ నుంచి నెల రోజుల పాటు ఈ ప్లాన్ వర్తిస్తుంది. ఇందులోనూ మిగతా ప్లాన్ల తరహాలోనే కాలింగ్, రోమింగ్, ఎస్ఎంఎస్ ప్రయోజనాలు ఉంటాయి.

ఎయిర్‌టెల్, వీఐతో పోలిస్తే:

ప్రస్తుతం ఎయిర్‌టెల్ వాయిస్ ఓన్లీ ప్లాన్ ధర రూ.185గా ఉంది. వొడాఫోన్ ఐడియా ప్లాన్ రూ.179తో అందుబాటులో ఉంది. అయితే వీఐ ప్లాన్‌లో 25 రోజుల వ్యాలిడిటీ మాత్రమే లభిస్తుంది. ఈ నేపథ్యంలో జియో రూ.147, రూ.177, రూ.196, రూ.197 ప్లాన్లు ధర, వ్యాలిడిటీ పరంగా పోటీగా ఉన్నాయి. రీఛార్జ్ చేసుకునే ముందు మీ అవసరానికి సరిపోయే ప్లాన్‌ను ఎంచుకోవడం మంచిది.

Also Read: ఒకటి కొంటే ఇంకోటి ఉచితం.. రియల్‌మీ దీపావళి సేల్‌లో మతిపోయే ఆఫర్లు భయ్యా!

Tags

Related News

స్మార్ట్‌ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. టవర్లు లేకపోయినా ఫుల్ సిగ్నల్.. ‘ట్రాయ్’ సంచలన సిఫార్సులు!

వాట్సప్ యూజర్లకు బిగ్ రిలీఫ్.. చాట్ స్క్రీన్ నుంచే రీసెంట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేయండిలా!

హోమ్ థియేటర్ కొనాలనుకుంటున్నారా? దీని కంటే బెస్ట్ ఉండదేమో!

గూగుల్ బాటలో మెటా.. ఉద్యోగులకు వీఈఓ ఆపర్, ప్యాకేజీ కింద బెనిఫిక్స్ చాలానే

ఇలాంటి ఉద్యోగం కూడా ఉంటుందా? ఇన్‌స్టా రీల్స్ స్క్రోల్ చేస్తే చాలు.. నెలాఖరుకు జీతం!

“మా ఆఫీస్‌లో ఇలాంటి బాస్ ఉంటే బాగుండు!” సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వైరల్ వీడియో!

రూ.15వేలకే 40 ఇంచుల స్మార్ట్ హెచ్‌డీ టీవీ..ఫీచర్స్ ఇవే!

Big Stories

Advertisement
×