Big Tv Live Original: కుక్కలు, కోతుల మాదిరిగా మానవులకు తోకలు ఉండవు. కానీ, ఒకప్పుడు మనుషులకు తోకలు ఉండేవంటున్నారు శాస్త్రవేత్తలు. మానవ పరిణామ క్రమంలో తోకలు మాయం అయినట్లువెల్లడిస్తున్నారు. ఇంతకీ తోకల విషయంలో ఏం జరిగింది? ఎందుకు తోకలు మాయం కావాల్సి వచ్చింది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
⦿ తోకల పరిణామ క్రమం
వేల సంవత్సరాల క్రితం మన పూర్వీకులకు తోకలు ఉండేవట. నేటి జంతువుల మాదిరిగానే మనుషులకూ ఉండేవి. ఈ తోకలు అప్పట్లో మనుషులకు ఎంతగానో ఉపయోగపడేవి. చెట్లు ఎక్కినప్పుడు, పరిగెత్తినప్పుడు బ్యాలెన్స్ చేసుకోవడానికి తోకలు ఉపయోగపడేవి. ఇతరులతో సంభాషించడానికి, కీటకాలను దూరంగా ఉంచడానికి కూడా ఆది మానవులు తోకలను ఉపయోగించేవారు. ఎప్పుడైతు మానవులు లేచి నిలబడి రెండు కాళ్లపై నడవడం ప్రారంభించారో.. అప్పుడే తోకలు ప్రాముఖ్యతను కోల్పోయాయి. కాలక్రమేణా తోకలు చిన్నవిగా మారాయి. చివరికి అదృశ్యమయ్యాయి.
⦿ కో కిక్స్-తోక ఎముక
మనుషులకు కనిపించేలా తోక లేకపోయినా, మన శరీరంలో తోకలో ఒక చిన్న భాగం మిగిలి ఉందంటున్నారు పరిశోధకులు. ఈ భాగాన్ని కోకిక్స్ అని పిలుస్తారు. దీనిని టెయిల్ బోన్ అని కూడా అంటారు. కోకిక్స్ వెన్నెముక దిగువన ఉంటుంది. అక్కడి నుంచే మనుషులకు అప్పట్లో తోక ఉండేదని పరిశోధకులు చెప్తుంటారు. ప్రసుతం మనం కూర్చున్నప్పుడు శరీరానికి సపోర్టు ఇవ్వడానికి కోకిక్స్ సహాయపడుతుంది. ఇది ఆ ప్రాంతం చుట్టూ ఉన్న కండరాలకు బలాన్ని ఇస్తుంది.
⦿ మనుషులు ఎందుకు తోకలను కోల్పోయారు?
మానవులు తోకలు కోల్పోవడానికి చాలా కారణాలున్నాయి. పూర్వీకులు పరిణామం చెంది రెండు కాళ్ళపై నడవడం ప్రారంభించినప్పుడు, తోకలు తక్కువ ఉపయోగకరంగా మారాయి. ఆ తర్వాత తరాల్లో తోక నెమ్మదిగా మాయం అయిపోయింది. తోక ప్రధాన్యత తగ్గడం మూలంగా నెమ్మదిగా మాయం అవుతూ వచ్చింది. చివరకు కోకిక్స్ మాత్రమే మిగిలిపోయింది.
⦿ అరుదైన సందర్భాల్లో పిల్లల్లో తోకలు
అరుదైన సందర్భాల్లో కొంతమంది పిల్లలు తోకలతో పుడతారు. ఈ తోక చాలా చిన్నదిగా ఉంటుంది. నిజమైన తోకలా కనిపిస్తుంది. కానీ, జంతువులకు ఉన్నట్లు కనిపించదు. నిజమైన తోకకు కండరాలు ఉంటాయి. కదుతుంది కూడా. కానీ, ఇది అత్యంత అరుదు. శిశువు జన్మించిన వెంటనే తోక ఉంటే, వైద్యులు వెంటనే దాన్ని తొలగిస్తాయి. ఈ నిజమైన తోకలు కోకిక్స్ తో పోల్చితే చాలా డిఫరెంట్ గా ఉంటాయి.
Read Also: మీ జేబులో ఫోన్‌ను ఎంత సేపు పెట్టుకుంటున్నారు? సంతానంపై ఆశలు వదిలేసుకోండి!
ప్రస్తుతం మనుషులలో ఉన్న కోకిక్స్.. పూర్వం మనుషులలో తోక ఉండేదని చెప్పడానికి కారణం అంటున్నారు పరిశోధకులు. మానవ జీవనపరిణామ క్రమంలో తోక మాయం అయినట్లు వెల్లడిస్తున్నారు. మిలియన్ల సంవత్సరాల క్రితం, పూర్వీకులకు తోకలు ఉండేవని, అవి అనేక రకాలుగా సాయపడేవని చెప్తున్నారు. మనుషులు ఎప్పుడైతే నిలబడటం మొదలుపెట్టారో, అప్పటి నుంచే తోకలు అనసరమైన అవయవాలుగా మారిపోయాయంటున్నారు. ఆ తర్వాత నెమ్మదిగా తోకలు మాయమై, ప్రస్తుతం కోకిక్స్ మాత్రమే మిగిలిందంటున్నారు. ఒకప్పుడు ఉన్న తోకలోని భాగమే ఈ కోకిక్స్ అంటున్నారు.
Read Also: స్వచ్ఛమైన ‘ప్రేమ’ ఇక చరిత్రేనా.. నేటితరం ‘సింగిల్’గా మిగిలిపోవడానికి కారణాలు ఇవేనట!