OTT Movie : హాలీవుడ్ ఫాంటసీ సినిమాలు మూవీ లవర్స్ ని ఎక్కువగా ఆకట్టుకుంటాయి. ఊహకు అందని అడ్వెంచర్లతో ఈ సినిమాలు పిచ్చెక్కిస్తూ ఉంటాయి. చిన్నపిల్లలతో కలసి ఈ సినిమాలు చూస్తే బాగా ఎంటర్టైన్ అవుతారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో ఒక కుక్క పెద్ద ఆకారంలో సంచలనాలు సృష్టిస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ హాలీవుడ్ ఫాంటసీ మూవీ పేరు ‘క్లిఫార్డ్ ది బిగ్ రెడ్ డాగ్’ (Clifford the big red dog). 2021 లో రిలీజ్ అయిన ఈ మూవీకి వాల్ట్ బెకర్ దర్శకత్వం వహించారు. ఇది జస్టిన్ మాలెన్, ఎల్లెన్ రాపోపోర్ట్ రాసిన కథ ఆధారంగా రూపొందించబడింది. ఈ మూవీలో జాక్ వైట్‌హాల్, డార్బీ క్యాంప్, టోనీ హేల్, సియెన్నా గిల్లరీ, డేవిడ్ అలాన్ గ్రియర్, రస్సెల్ వాంగ్, ఇజాక్ వాంగ్, కెనన్ థాంప్సన్, జాన్ క్లీస్ నటించారు. సెప్టెంబరు 2021లో జరిగిన టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ మూవీ ప్రీమియర్‌గా వచ్చింది. ఆ తర్వాత పారామౌంట్ పిక్చర్స్ COVID-19 మహమ్మారి కారణంగా ఆలస్యం అయిన తర్వాత నవంబర్ 10, 2021న యునైటెడ్ స్టేట్స్‌లో థియేట్రికల్ రిలీజ్ అయింది. ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
ఏమిలి ఒక స్కూల్లో చదువుతూ ఉంటుంది. ఏమిలిని స్కూల్లో అందరూ ఏడిపిస్తూ ఉంటారు. స్కూల్ నచ్చలేదని తల్లి మ్యాగీ కి చెప్తుంది ఏమిలి. అన్ని సర్దుకుంటాయని ఏమిలికి చెప్తుంది మ్యాగీ. ఆ తర్వాత ఏమిలి తల్లి జాబ్ చేయడానికి వేరే ప్రాంతానికి వెళ్లాల్సి వస్తుంది. కూతుర్ని తన తమ్ముడి దగ్గర వదిలి వెళ్తుంది. అయితే ఏమిలికి తన మామయ్య దగ్గర ఉండడం అంతగా ఇష్టం ఉండదు. ఎందుకంటే అతను ఒక ట్రక్ లో నివసిస్తూ ఉంటాడు. అయినా ఏమిలిని అక్కడికి పంపిస్తుంది మ్యాగీ. అయితే ఒకసారి ఏమిలితో ఆమె మామయ్య ఒక చోటికి వెళ్తాడు. అక్కడ జంతువులతో ఎంటర్టైన్ చేస్తుంటారు నిర్వాహకులు. అక్కడ ఒక గేమ్ ఆడి క్లిఫార్డ్ అనే ఒక డాగ్ ను గెలుచుకుంటుంది ఎమిలి.
అయితే అది రెడ్ కలర్ లో ఉంటుంది. దానిని చూసిన ఎమిలి మామయ్య ఒకరోజు ఉంచుకోవడానికి పర్మిషన్ ఇస్తాడు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అది ఊహించని దానికంటే చాలా పెద్దదిగా అవుతుంది. ఆ కుక్క పిల్ల చేసే పనులకి వీళ్ళందరికీ పిచ్చెక్కిపోతుంది. చివరికి ఆ కుక్కపిల్ల ఎందుకు అలా తయారైంది? దానివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘క్లిఫార్డ్ ది బిగ్ రెడ్ డాగ్’ (Clifford the big red dog) అనే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.