Big Tv Live Original: ఈ రోజుల్లో సెల్ ఫోన్ వినియోగం గురించి ఎంత చెప్పినా తక్కువే. సెల్ ఫోన్ లేనిదే ఏ పని సాగడం లేదు. సెల్ ఫోన్ తో లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు. మీ మొబైల్ ఫోన్ ను తక్కువ సేపు జేబులో పెట్టుకోవడం ప్రమాదకరం కాదు. కానీ, ఎక్కువ అలాగే ఉంచి ఇబ్బందులు తప్పవంటున్నారు. సెల్ ఫోన్ తో కలిగే ఇబ్బందులు ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
⦿ రేడియేషన్
మొబైల్స్ రేడియోఫ్రీక్వెన్సీ (RF) రేడియేషన్‌ను విడుదల చేస్తాయి. ఈ రేడియేషన్ దీర్ఘకాలిక ఆరోగ్య ప్రమాదాలకు కారణం అవుతుంది. ఫోన్ ను ఎక్కువ సేపు జేబులో ఉంచుకోవడం వల్ల ఎక్స్ పోజర్ పెరుగుతుంది. ముఖ్యంగా శరీరంలోని సున్నితమైన భాగాల మీద ప్రభావం చూపిస్తుంది. అయితే, ఫోన్ ద్వారా విడుదలయ్యే RF రేడియేషన్ స్థాయిలు ఉన్న నేపథ్యంలో హనికరం కాదనేది నిపుణుల అభిప్రాయం.
⦿ హీట్ జనరేషన్
మీరు యాప్ లను ఇన్ స్టాల్ చేస్తున్న సమయంలో లేదంటే వీడియోను చూస్తున్న సమయంలో ఫోన్ నుంచి వేడి విడుదల అవుతుంది. కొన్నిసార్లు జేబులో ఉంచుకున్నప్పుడు వేడిగా అయితే, అసౌకర్యంగా అనిపిస్తుంది. సున్నిత ప్రాంతాల్లో వేడి పెరిగే అవకాశం ఉంటుంది. చెమట పట్టి ఇబ్బందికరంగా మారుతుంది.
⦿ ఫోన్ కు పగుళ్లు
మీ జేబు చిన్నగా టైట్ గా ఉంటే ఫోన్ ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది. బిగుతుగా ఉండటం వల్ల స్క్రీన్ మీద పగళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఫోన్ అంతర్గత సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.
⦿ స్కిన్ ప్రాబ్లమ్స్
ఫోన్లు తరచుగా జేబులో ఉంచడం వల్ల చర్మాన్ని తాకుతూ ఉంటాయి. వేడి పెరిగి చర్మం మీద దద్దుర్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఫోన్ నుంచి వచ్చే ఒత్తిడి అసౌకర్యానికి కారణం అవుతుంది.
⦿ ఫోన్ పడిపోయే అవకాశం
మీ ఫోన్‌ను ఎక్కువ సేపు జేబులో ఉంచుకోవడం వల్ల మీరు దాని గురించి మరచిపోయి తొందరలో బయటకు తీసే అవకాశం ఉంటుంది. దీని వల్ల ఫోన్ జారిపడిపోయే అవకాశం ఉంటుంది.
⦿ పురుషుల సంతానోత్పత్తిపై ప్రభావం
జేబులో ముఖ్యంగా ప్యాంట్ జేబులోఎక్కువ సేపు సెల్ ఫోన్ ను ఉంచడం వల్ల స్పెర్మ్ నాణ్యత మీద ప్రభావం పడుతుంది. ఫలితంగా పురుషుల సంతానోత్పత్తి తగ్గుతుంది. ఫోన్ ను సున్నితమైన ప్రాంతాలకు దూరంగా ఉంచడం మంచిదనే అభిప్రాయం కలుగుతున్నది.
Read Also: వాట్సాప్‌లో ఇలాంటి పనులు అస్సలు చేయొద్దు.. జైలుకెళ్తారు!
ఈ ఇబ్బందుల నుంచి ఎలా బయటపడాలి?
⦿ సెల్ ఫోన్ కోసం ప్రత్యేకంగా ఓ కేసును ఉపయోగించండి.
⦿ మీ ఫోన్ ను బ్యాగ్ లో పెట్టుకోవడం ఉత్తమం.
⦿ రేడియేషన్ గురించి ఆందోళన ఉంటే ఫోన్ ను మీ శరీరానికి దూరంగా ఉండేలా చూసుకోండి.
⦿ బిగుతుగా ఉండే పాకెట్ లో సెల్ ఫోన్ ను ఉంచకండి.
Read Also: స్వచ్ఛమైన ‘ప్రేమ’ ఇక చరిత్రేనా.. నేటితరం ‘సింగిల్’గా మిగిలిపోవడానికి కారణాలు ఇవేనట!