OTT Movie : దయ్యాలు, ఆత్మలు ఉన్నాయో లేవో తెలియదు గాని, వీటికి భయపడే మనుషులు మాత్రం ఉన్నారు. దయ్యాలు, ఆత్మలు ఈ రెండు పదాల మధ్య తేడా ఏమిటో తెలియక ఇప్పటికీ సతమతమవుతున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో 2500 సంవత్సరాల క్రితం ఒక సైతాన్ ను బుద్ధుడి శిష్యులు బంధిస్తారు. అది మళ్ళీ రాకుండా, దాని రెండు కళ్ళు పీకి వేరు చేస్తారు. ఈ డిఫరెంట్ స్టోరీతో వచ్చిన ఒక కొరియన్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఆ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
నెట్ఫ్లిక్స్ (Netflix) లో
ఈ కొరియన్ హర్రర్ థ్రిల్లర్ మూవీ పేరు (The 8th night). 2021లో విడుదలైన ఈ కొరియన్ హర్రర్ థ్రిల్లర్ మూవీకి కిమ్ టే-హ్యోంగ్ దర్శకత్వం వహించారు. ఇందులో లీ సంగ్-మిన్, పార్క్ హే-జూన్, కిమ్ యో-జంగ్, నామ్ డా-రీమ్ నటించారు. ఈ మూవీ 2500 సంవత్సరాలకు పూర్వం మానవులను హింసించిన ఒక సైతాన్ ని, ఆపడానికి భూతవైద్యుడు చేసే పొరటంతో మూవీ స్టోరీ నడుస్తుంది. ఈ కొరియన్ హర్రర్ థ్రిల్లర్ మూవీ ఓ టిటి ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
కిమ్ పురాతనమైన వస్తువులపై పరిశోధన చేస్తూ ఉంటాడు. అయితే ఇతను 2500 ల సంవత్సరాల క్రితం జరిగిన ఒక సైతాన్ స్టోరీ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ పరిశోధనలో భాగంగా ఆ సైతాన్ రెండు కళ్ళు వేరువేరు ప్రాంతాల్లో ఉన్నాయని తెలుసుకొని, వాటిని కనిపెట్టే ప్రయత్నం చేస్తాడు. ఒకవేళ ఆ రెండు కళ్ళు కలిస్తే సైతాన్ మళ్ళీ పుడుతుంది. ఇంతలో ఒక రెడ్ ఐ ఇతనికి దొరుకుతుంది. వాటిలో ఒకదానిని కనిపెట్టానని గవర్నమెంట్ కి కూడా సమాచారం ఇస్తాడు. అదంతా ఫేక్ అని గవర్నమెంట్ కూడా అతని మాటలు పట్టించుకోదు. అయితే అతడు కూడా సైతాన్ కు ఉన్న రెండు కన్నుల్లో రెడ్ ఐ ఫేక్ అనుకుని సూసైడ్ చేసుకోవాలనుకుంటాడు. అప్పటికే ఆ రెడ్ ఐ కిమ్ ను తన వశం చేసుకుంటుంది. నిజానికి ఈ సైతాన్ కళ్ళు కలవకుండా ఉండాలంటే ఒక మంత్రగత్తేని చంపాల్సి ఉంటుంది.
మరోవైపు మిన్ కి ఈ విషయం తెలిసి, చియాగో అనే శిష్యుడు ద్వారా, ఒక మంత్రగత్తేని చంపాలనుకుంటాడు. సైతాన్ ని మళ్ళీ రాకుండా చేయాలంటే ముందు ఒక మంత్రగత్తెను చంపాల్సిఉంటుంది. చియాగో మంత్రగత్తె ను చంపే ప్రయత్నంలో ఉంటాడు. చివరికి ఆ సైతాన్ రెడ్ ఐ, బ్లాక్ ఐ కలుస్తాయా? సైతాన్ వస్తే ప్రపంచం అంతమైపోతుందా? సైతాన్ని ఎవరు ఎదుర్కొంటారు? ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే, నెట్ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతున్న The 8th night అనే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి. ఒక మంచి మూవీని చూసి ఎంటర్టైన్ అవ్వాలనుకుంటే ఈ హర్రర్ థ్రిల్లర్ మూవీ బెస్ట్ సజెషన్.