AC electricity usage| ఏప్రిల్ నెల ప్రారంభం కావడంతో ఎండలు మండిపోతున్నాయి. భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో ముఖ్యంగ ఉత్తర భారతదేశంలో అప్పుడే వేడి గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. వేసవిలో వేడిని తట్టుకోవడానికి అందరూ ఇళ్లలో, ఆఫీసుల్లో ఏసీలు, కూలర్లును ఆశ్రయిస్తారు. ముఖ్యంగా ఏప్రిల్ నెలలో ఈ కూలింగ్ యంత్రాలను ప్రజలు ఉపయోగించడం ప్రారంభిస్తారు. అయితే ఆ తరువాత మే, జూన్, జూలై నెలల్లో వీటి వాడకం తీవ్రమవుతుంది.
అందుకే వేసవి రాగానే ఎలెక్ట్రానిక్స్ షో రూమ్ లో ఏసీ, కూలర్ల కొనుగోలు కోసం జనం బారులు తీరుతారు. దీంతో వీటికి డిమాండ్ బాగా పెరిగిపోతుంది. ముఖ్యంగా మే, జూన్ నెలల్లో వీటి అమ్మకాలు ఆకాశానంటుతాయి. అయితే వేడి నుంచి ఉపశమనం అందించే ఈ ఎయిర్ కండీషనర్లు, కూలర్లు కొనుగోలు చేశాక కరెంటు బిల్లు వాచిపోతుంది. ముఖ్యంగా ఏసీలతో ఒక సామాన్యుడికి కరెంట్ బిల్లు చూస్తే తలతిరిగిపోతుంది. వీటికి ప్రత్యేమ్నంగా కూలర్లు కొనుగోలు చేద్దామనుకుంటే వాటి మన్నిక చాలా తక్కువ. అందుకే ఒకప్పుడు ధనవంతులు మాత్రమే ఏసీ కొనుగోలు చేసేవారు.. కానీ ఇప్పుడు మధ్య తరగతి ప్రజలు కూడా ఏసీల వైపు మొగ్గు చూపుతున్నారు.
అయితే కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుందని భయపడేవారు వాటి వినియోగాన్ని తగ్గించుకుంటున్నారు. ఒక రోజు కొన్ని గంటలు మాత్రమే ఏసీలను వినియోగిస్తున్నారు. అందుకే ఒక ఏసీ వినియోగిస్తే.. గంటలకు ఎంత కరెంట్ ఖర్చు అవుతుందో తెలుసుకుందాం. దాన్నిబట్టి ఒక రోజుకు 8 నుంచి 10 గంటలు కంటిన్యూగా ఏసీ ఆన్ చేసి ఉంచితే ఎంత ఖర్చుఅవుతుందో లెక్కించవచ్చు.
10 గంటలు ఏసీ వినియోగిస్తే కరెంట్ బిల్లు ఎంత అవుతుంది?
ఉదాహరణకు మీ ఇంట్లో 1.5 టన్నుల ఏసీ యూనిట్ ఉందనుకుందాం. ఈ ఏసి ఆన్‌లో ఉంటే సగటున ఒక గంటకు 2.25 యూనిట్ల విద్యుత్ తీసుకుంటుంది. ఆ లెక్కన పది గంటలు ఒక రోజుకు వినియోగిస్తే 22.5 యూనిట్లు ఖర్చు అవుతుంది. ఈ క్రమంలో 30 రోజులు అంటే నెల రోజులకు లెక్కిస్తే కేవలం ఏసీ వల్ల 675 యూనిట్ల కరెంటు ఖర్చు అవుతుంది.
ఇక కరెంటు బిల్లు విషయానికి వస్తే.. సాధారణంగా ఒక యూనిట్ కు రూ.7 వరకు ఛార్జ్ చేస్తున్నారు. దీని ప్రకారం… నెలకు 675 యూనిట్లు అంటే ఒక నెలకు ఏసీ కరెంట్ బిల్లు మాత్రమే రూ.4,725 అవుతుంది. దీనికి తోడు మీ ఇంట్లో ఫ్రిజ్, కూలర్, వాషింగ్ మెషీన్, మిక్సీ లాంటివి వినియోగిస్తే కరెంట్ బిల్లు వెరసి రూ.6000 నుంచి రూ.2,000 అవుతుంది.
Also Read: ఏసీతో కరెంటు బిల్లు వాచిపోతోందా.. ఈ టిప్స్‌తో సమస్యకు చెక్!
ఒకసారి ఏసీ వినియోగం, కరెంట్ బిల్లు లెక్కల చూడండి.
రోజుకు 6 గంటలు మాత్రమే ఏసీ వినియోగిస్తే. . నెలకు 405 యూనిట్ల ఖర్చు అవుతుంది. అంటే ఏసీ వల్ల కరెంట్ బిల్లు నెలకు రూ.2,835 వస్తుంది.
అదే ఒక రోజు 8 గంటలు ఏసి వినియోగించేవారికి.. నెలకు 540 యూనిట్ల కరెంట్ ఖర్చు అవుతుంది. అంటే నెలకు ఏసీ వల్ల మాత్రమే కరెంట్ బిల్లు రూ.3,780 వరకు వెళుతుంది.
ఇక గరిష్టంగా 12 గంటల పాటు ఏసి వినియోగించేవారికి.. నెలకు 810 యూనిట్ల కరెంట్ ఖర్చు అవుతుంది. నెలకు ఏసీ కరెంట్ బిల్లు రూ.5,670 దాకా వస్తుంది. ఇదంతా యూనిట్ రూ.7 లెక్కన వేసిన మొత్తం. మీ ప్రాంతంలో ఒక యూనిట్ కరెంటు దీని కంటే ఎక్కువ, లేదా తక్కువ ఉండవచ్చు. ఇక్కడ ఇచ్చిన గంటకు 2.25 యూనిట్ల లెక్కన మీరు అంచనా వేయగలరు.
కరెంట్ బిల్లు ఆదా చేసుకోవడమిలా..
కొత్త ఏసీ కొనుగోలు చేసేవారు అందులో ఇన్వర్టర్ ఉండేది తీసుకోండి. క్రమం తప్పకుండా ఏడాదికి ఒకసారి లేదా రెండు సార్లు ఏసీ సర్వీస్ చేయించండి. అందులో ఉన్న ఫిల్టర్లు క్లీన్ చేసుకుంటే కూలింగ్ త్వరగా అవుతుంది. తక్కువ వినియోగమవుతుంది. ఏసీ టెంపరేచర్ 23 నుంచి 26 డిగ్రీలు పెట్టంది. ఇంకా కూలింగ్ కావాలంటే కాసేపు 20 వరకు పెట్టుకోండి.
ఏసీ ఉన్న గదిలో హీటర్, ఐరన్, ఫ్రిజ్ లాంటి వస్తువులు వినియోగించవద్దు.