E-Paper
Advertisement

ఏసీ గదిలో మట్టి కుండ.. నిజంగానే అద్భుతం చేస్తుందా? సైన్స్ చెప్పేది ఇదే!

ఏసీ గదిలో మట్టి కుండ.. నిజంగానే అద్భుతం చేస్తుందా? సైన్స్ చెప్పేది ఇదే!
Advertisement

Pot in an AC Room: గత కొన్ని రోజులుగా వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఒక పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. ఏసీ గదిలో ఒక మట్టి కుండ నిండా నీళ్లు పోసి పెడితే.. అది గదిలో పొడిబారిన గాలిని సహజంగా తేమగా మారుస్తుందని.. దీని వల్ల చర్మం, గొంతు సమస్యలు తగ్గుతాయని ఆ పోస్ట్ సారాంశం. వినడానికి ఎంతో సింపుల్‌గా, పర్యావరణహితంగా ఉన్నప్పటికీ ఈ చిట్కా నిజంగానే పనిచేస్తుందా? దీని వెనుక ఉన్న అసలు సైన్స్ ఏంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

సైన్స్ ఏం చెబుతోంది?

సైన్స్ ప్రకారం మట్టికుండకు ఒక సహజమైన గుణం ఒకటి ఉంది. కుండ ఉపరితలంపై ఉండే చిన్న చిన్న రంధ్రాల (Pores) ద్వారా నీరు నిరంతరం బయటకు లీక్ అవుతూ గాలిలో ఆవిరవుతుంది (Evaporation). దీనివల్ల కుండలోని నీరు చల్లబడుతుంది. దీన్నిబట్టి చూస్తే ఏసీ గదిలో నీళ్ల కుండను పెట్టడం వల్ల.. దాని ద్వారా గాల్లోకి తేమ విడుదలవుతుందని అర్థం చేసుకోవచ్చు. టెక్నికల్  చూస్తే హ్యుమిడిఫైయర్ చేసే పనిని కుండ చేస్తుందని స్పష్టమవుతోంది.

ఏసీతో తలపడటం సాధ్యమేనా?

Advertisement

సాధారణంగా ఏసీలు.. గదిని చల్లబరచడమే కాకుండా గదిలోని తేమను పీల్చేస్తాయి. ఫలితంగా రూమ్ అంతా డ్రైగా మారిపోయి.. చర్మ సమస్యలు, కళ్ల మంటలు వంటి ఇబ్బందులు చాలా మందిలో ఎదురవుతుంటాయి. గదిని డ్రైగా మార్చే ప్రక్రియ ఏసీ ఆన్ లో ఉన్నంతవరకూ నిరంతరం జరుగుతూనే ఉంటుంది. అలాంటప్పుడు ఒక చిన్న మట్టికుండ ఏసీని తట్టుకొని.. గదిని తేమగా మారుస్తుందా? అన్నది ప్రశ్నార్థకమే అని నిపుణులు అంటున్నారు.

కుండ మ్యాజిక్ కష్టమే?

ఏసీ గదిలో ఒక చిన్న మట్టికుండను పెట్టినట్లైతే దాని నుండి విడుదలయ్యే తేమ నామమాత్రంగానే ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. కాబట్టి ఏసీ తేమను తొలగించే ప్రక్రియలో.. కుండ నుంచి విడుదలయ్యే నీటి ఆవిరి సైతం అందులో కొట్టుకుపోయే అవకాశముందని పేర్కొంటున్నారు. మట్టి కుండ ఒక చెంచాడు తేమను గాలిలో విడుదల చేసే సమయంలో.. ఏసీ బకెట్ తేమను బయటకు పంపిచేస్తుందని పేర్కొంటున్నారు. కాబట్టి తేమ విషయంలో ఈ రెండింటి మధ్య జరిగే పోరులో కుండదే పైచేయి అని నిపుణులు తేల్చేస్తున్నారు. కుండలోని నీరు గది మొత్తం ఉన్న డ్రై నెస్‌ను మార్చడానికి ఏమాత్రం సరిపోదని స్పష్టం చేస్తున్నారు.

Advertisement

Also Read: సముద్ర తీర జిల్లాల్లో ఏసీ కొంటున్నారా? జాగ్రత్త భయ్యో.. ఈ తప్పులు అస్సలు చేయకండి!

ప్రత్యామ్నాయం ఏంటంటే?

ఏసీ గదిలో మట్టి కుండను పెడితే ఏదో జరిగిపోతుందంటూ నెట్టింట జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని.. నిపుణులు ఇచ్చిన క్లారిటీని బట్టి అర్థమవుతోంది. మట్టి కుండ వల్ల గదిలో 1 లేదా 2 శాతం తేమ పెరగొచ్చు కానీ.. అది మీ చర్మం పొడిబారకుండా ఆపడానికి లేదా ఏసీ వల్ల వచ్చే డ్రై నెస్‌ను పూర్తిగా తగ్గించడానికి సరిపోదని స్పష్టమవుతోంది. దీనికోసం మీరు రూమ్‌లో ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ హ్యుమిడిఫైయర్‌ను వాడటం లేదా కొన్ని ఇండోర్ ప్లాంట్స్ (మొక్కలు) పెట్టుకోవడం మాత్రమే సరైన పరిష్కారమని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాని మట్టి కుండలతో ఏసీ గదిని హ్యుమిడిఫై చేయడం సాధ్యం కాదని తేల్చేస్తున్నారు.

Also Read: Flight Mode: ‘ఫ్లైట్ మోడ్‌’తో ఇన్ని లాభాలా? ఇన్నాళ్లు తెలియలేదే.. ఎంత డబ్బు వృథా చేశారో..!

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×