iPhone: దీపావళి సీజన్ ముగిసింది కానీ ఐఫోన్ కొనాలని కలలుకంటున్నవాళ్లకు ఇప్పుడు ఒక్కటే ప్రశ్న ఫ్లిప్ కార్ట్, అమోజాన్ లాంటి సైట్లలో వచ్చిన ఆఫర్లు ఇంకా ఉన్నాయా? లేక ఇప్పటికే ముగిసిపోయాయా? అంటే క్లియర్‌గా చెప్పాలంటే దివాళి ఆఫర్లు దాదాపుగా అయిపోయాయనే చెప్పాలి. కానీ అంత త్వరగా అయిపోయాయా అంటే, ఎందుకు అయిపోయాయి? ఇంకా ఎవరికైనా అవకాశముందా? ఐఫోన్ ధరలు ఎంతవరకూ తగ్గాయి? అనే విషయాలు తెలుసుకుందాం.
ఫిప్‌కార్ట్ – అమెజాన్ ఐఫోన్ ఆఫర్లు
ఈ సీజన్‌లో వచ్చిన ఆఫర్లు ఎప్పుడూ లేనంతగా పాప్యులర్ అయ్యాయి. ఐఫోన్ 16, ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లు చాలా తక్కువ ధరల్లో లభించాయి. ఫ్లిప్ కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ పేరుతో జరిగిన సేల్‌లో ఐఫోన్ 16 ధర రూ. 51,999 వరకు పడిపోయింది. అదే అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సమయంలో ఐఫోన్ 15 సిరీస్ రూ. 43,749 వరకు తగ్గింది. ఆఫర్లు చూసి చాలా మంది కొనుగోలు చేశారు, సోషల్ మీడియాలో తమ ఆర్డర్లు చూపిస్తూ సంబరపడ్డారు. కానీ ఈ ఆఫర్లు ఎక్కువ కాలం కొనసాగలేదు.
ఆఫర్లు ఎప్పటి వరకు కొనసాగింది
దీపావళి ఆఫర్లు సాధారణంగా సెప్టెంబర్ చివరి వారం నుంచి అక్టోబర్ చివరి వరకు మాత్రమే ఉంటాయి. ఫ్లిప్‌కార్ట్ సేల్ సెప్టెంబర్ 23న ప్రారంభమై అక్టోబర్ 24తో ముగియనున్నాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ కూడా దాదాపు అక్టోబర్ 25వరకే కొనసాగుతాయి. తర్వాత వచ్చిన దీపావళి స్పెషల్ సేల్ మాత్రం అక్టోబర్ 30న పూర్తిగా ముగిసిపోతాయి. దీపావళి తర్వాత ఆఫర్ల బ్యానర్లు సైట్ల నుంచి తొలగించబడ్డాయి. అంటే ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లలో దీపావళి ఆఫర్లు అందుబాటులో లేవు. ఇప్పుడు చూపిస్తున్న చిన్న డిస్కౌంట్లు లేదా బ్యాంక్ ఆఫర్లు, దీపావళి సమయంలో ఉన్నంత పెద్దవి కావని యూజర్లు గమనించాలి.
యూజర్లు ఆవేదన
ఆఫర్లు ఎందుకు అంత త్వరగా ముగిశాయి అంటే, దానికి ప్రధాన కారణం డిమాండ్. ఆపిల్ ఫోన్లకు ఎప్పుడూ ఎక్కువ డిమాండ్ ఉంటుంది. దివాళి సేల్ ప్రారంభమైన గంటలకే చాలా మోడల్స్ స్టాక్ లేదు (Out of Stock) అయ్యాయి. కొంతమంది యూజర్లు కార్ట్‌లో జోడించు (Add to Cart) చేసిన వెంటనే ధర పెరిగిపోయిందని, మరికొందరు ఆర్డర్ ఇచ్చాక రద్దు అయ్యిందని సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. అంటే కంపెనీలు ఆఫర్లు ఇచ్చినా స్టాక్ పరిమితంగానే ఉన్నందున, ఫోన్లు వేగంగా సేల్ అయిపోయాయి.
Also Read: Sunflower Seeds: రోజూ ఇవి తింటే గుండెజబ్బులు మాయం… క్యాన్సర్ దూరం
పెరిగిన ఐఫోన్ ధరలు
ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దీపావళి ఆఫర్లు అయిపోయిన తర్వాత ఐఫోన్ ధరలు మళ్లీ సాధారణ స్థాయికి వచ్చాయి. ఉదాహరణకు, దివాళి సమయంలో రూ.51,999కే లభించిన ఐఫోన్ 16 ఇప్పుడు రూ. 74,999కు పైగా చూపిస్తోంది. ఐఫోన్ 15 కూడా దివాళి సేల్‌లో రూ.43,749 ఉండగా, ఇప్పుడు రూ.58,999కు చేరింది. అంటే సేల్ ముగిసిన తర్వాత ధరలు మళ్లీ పెరిగిపోయాయి.
మళ్లీ ఆఫర్లు ఎప్పుడు?
ఇకముందు ఇలాంటి భారీ ఆఫర్లు ఎప్పుడు వస్తాయంటే, సాధారణంగా “ఇయర్ ఎండ్ సేల్” లేదా “క్రిస్మస్–న్యూ ఇయర్ సేల్” సమయంలో కొంత తగ్గింపు ఉంటుంది. అయితే ఆ సమయంలో వచ్చే డిస్కౌంట్లు కూడా దివాళి సేల్‌లో వచ్చినంత పెద్దవి కావు. ఎందుకంటే ఆపిల్ ఉత్పత్తుల ధరలను ఎక్కువగా తగ్గించడమే కంపెనీ విధానం కాదు.
బ్యాంక్ ఆఫర్లు
అయితే చిన్న బ్యాంక్ ఆఫర్లు మాత్రం ఇంకా అందుబాటులో ఉన్నాయి. హెచ్‌డిఎఫ్‌సి, ఎస్‌బిఐ వంటి క్రెడిట్ కార్డులు ఉపయోగిస్తే రూ.4,000 నుంచి రూ. 6,000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభించవచ్చు. అదేవిధంగా ఎక్స్‌చేంజ్ ఆఫర్ల ద్వారా పాత ఫోన్ విలువను బట్టి రూ.5,000 నుంచి రూ.15,000 వరకు తగ్గింపు పొందవచ్చు. కానీ ఇవన్నీ సాధారణ ఆఫర్లు మాత్రమే.
టెక్ ప్రపంచంలో డైలీ డీల్స్
దివాళి ఆఫర్లను మిస్ అయ్యి నిరాశ చెందకండి ఎందుకంటే టెక్ ప్రపంచంలో డీల్స్ ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. తదుపరి సేల్ సీజన్ వస్తే, ముందుగానే కార్ట్ రెడీ చేసుకోండి, బ్యాంక్ కార్డ్ సిద్ధంగా పెట్టుకోండి, ఎందుకంటే ఐఫోన్‌ల వంటి ఫోన్లు సెకన్లలో సేల్ అయిపోతాయి.