SKN: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాత ఎస్కేఎన్ (SKN ) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. నిర్మాతగా సినిమాలు చేస్తూనే.. మరొకవైపు పలు సినిమా ఈవెంట్లలో మాట్లాడుతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. అంతేకాదు అప్పుడప్పుడు ఎస్కేఎన్ చేసే కామెంట్లు విమర్శలకి కూడా తావు ఇస్తున్న విషయం తెలిసిందే. అలాంటి ఈయన తాజాగా ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్(Bandla Ganesh) గురించి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా బండ్లన్న అలా చేస్తే ఇండస్ట్రీకే ప్రమాదం అంటూ చేసిన కామెంట్లు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
నీరజ కోన దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా వ్యవహరించిన చిత్రం తెలుసు కదా.. సిద్ధూ జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) హీరోగా .. శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty), రాశిఖన్నా(Raashii khanna) హీరోయిన్లుగా వచ్చిన చిత్రం ఇది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది కానీ అనుకున్నంత స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేదని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా తాజాగా చిత్ర బృందం ఈ సినిమాకి సక్సెస్ మీట్ నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి నిర్మాత ఎస్కేయన్ తో పాటు బండ్ల గణేష్ (Bandla Ganesh) ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
అందులో భాగంగా బండ్ల గణేష్ ని ఉద్దేశిస్తూ ఎస్ కే ఎన్ ఇలా కామెంట్ చేశారు. ఎస్కేఎన్ మాట్లాడుతూ.. “మీలాంటి ప్రొడ్యూసర్ ఇండస్ట్రీకి దూరంగా ఉండడం సినీ పరిశ్రమకు ప్రమాదకరం. అందుకే మీరు ఎన్నో మంచి సినిమాలు చేయాలి. కాంబినేషన్లు చేయాలి అని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఒక మేధావి మౌనం దేశానికి ఎంత ప్రమాదకరమో బండ్ల గణేష్ లాంటి ప్రొడ్యూసర్ ప్రొడక్షన్ కి దూరంగా ఉంటే ఇండస్ట్రీకి అంత ప్రమాదకరం” అంటూ ఎస్కేఎన్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ALSO READ:Bandla Ganesh: జోష్ మూవీ కోసం సిద్ధూ ఆరాటం.. కట్ చేస్తే నెక్స్ట్ రవితేజ!
బండ్ల గణేష్ కెరియర్ విషయానికి వస్తే.. నటుడిగా, నిర్మాతగా, కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఈయన ఇటీవల హీరోగా కూడా తన కోరికను నెరవేర్చుకున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఏమైందో తెలియదు కానీ గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు బండ్ల గణేష్. దీంతో ఎప్పుడు సినిమాలు చేస్తారు అని అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా.. ఇప్పుడు ఎస్కేఎన్ కూడా నిర్మాతగా సినిమాలు నిర్మించాలని కోరడంతో ఈ విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే బండ్ల గణేష్ సినిమాలు నిర్మించకపోయినా.. పలు సినిమా ఈవెంట్లకు ముఖ్య అతిథిగా హాజరవుతూ.. అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ముఖ్యంగా ఆ ఈవెంట్లలో బండ్ల గణేష్ చేసే కామెంట్లు ఏ రేంజ్ లో వ్యక్తులను టార్గెట్ చేస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరి ఎస్కేఎన్ కోరిక మేరకైనా బండ్ల గణేష్ మళ్లీ సినిమాలు నిర్మిస్తారేమో చూడాలి.