Jubilee Hills By-Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం వేడెక్కింది. ప్రధాన పార్టీల నేతలు వివిధ ప్రాంతాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. ప్రత్యర్థులపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. లేటెస్టుగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి బిగ్ టీవీతో మాట్లాడుతూ తడబడ్డారు.
వేడెక్కిన జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం
గురువారం జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు మాజీమంత్రి మల్లారెడ్డి. ఈ సందర్భంగా ‘బిగ్ టీవీ’తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రజలు మాకు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. కారుని మళ్ళీ గెలిపిస్తారని మనసులోని మాటను బయట పెట్టారు. కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని జూబ్లీహిల్స్ ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు. ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు.
జూబ్లీహిల్స్‌లో రెండేళ్లుగా అభివృద్ధి లేదన్నారు ఎమ్మెల్యే మల్లారెడ్డి. అన్నివర్గాల ప్రజలకు కాంగ్రెస్ బాకీ ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ మొత్తం పడిపో యిందని, ఒక్కప్లాట్ అమ్మిన సందర్భం లేదని నోరు జారారు. ఎకరం భూమి అమ్మి పెళ్లి చేద్దామంటే కొనుగోలు చేసేందుకు ఎవరూ రాలేదన్నారు.
మేమే గెలుస్తాం-మల్లారెడ్డి
రీసెంట్‌గా గచ్చిబౌలిలో భూముల వేలంలో ఎకరం 177 కోట్లకు వెళ్లిందని ప్రశ్నించారు సదరు జర్నలిస్టు. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు అదంతా మాయ అంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు మాజీ మంత్రి. వరంగల్, మేడ్చల్‌లో ఎకరం కనీసం రెండు కోట్లకు అమ్ముడుపోవట్లేదని నవ్వుతూ తన మాటలను కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు మాజీ మంత్రి. స్టార్ క్యాంపెయినర్ కేసీఆర్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారంలో పాల్గొంటారని అన్నారు. తనకు ఇప్పుడు 72 ఏళ్లు వచ్చాయని, మళ్ళీ మా ప్రభుత్వం వచ్చేసరికి 75 ఏళ్లు వస్తాయన్నారు. తనకు వయసు అయిపోతుందని, మళ్ళీ మంత్రి కావాలనే ఆశ లేదన్నారు.
ALSO READ: తెలంగాణ ప్రజలకు తీపికబురు చెప్పిన ప్రభుత్వం
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణకు ఏమీ చేయలేదన్నారు. దివంగత మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశారని అన్నారు. గోపీనాథ్ ఆత్మకు శాంతి కలగాలంటే మళ్లీ సునీతకు ఓటు వేసి గెలిపించాలన్నారు. మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ ఇంటింటికీ ప్రచారం చేస్తోంది. ఇంకోవైపు బీజేపీ నేతలు ప్రచారంలోకి దిగేశారు. అభివృద్ది కావాలంటే తమ పార్టీకి ఓటు వేయాలని ఓటర్లను కోరారు.
జూబ్లీహిల్స్ లో ఓటు అడిగే హక్కు కేవలం కేసీఆర్ కే ఉంది : మల్లారెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది
అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ బాకీ ఉంది
ఒక్క ప్లాట్ రూ.177 కోట్లు కాదు వరంగల్, మేడ్చల్ లో రూ.2 కోట్లకు కూడా అమ్ముడుపోవట్లేదు
– మాజీ మంత్రి… pic.twitter.com/e5sQiv0bY6
— BIG TV Breaking News (@bigtvtelugu) October 23, 2025