మనిషికి అందాన్ని ఇవ్వడంలో చెవులు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. అయితే, ప్రమాదవశాత్తు కొంతమంది చెవులు తెగిపోయే అవకాశం ఉంటుంది. మరికొంత మందికి పుట్టుకతో చెవి సరిగా ఉండదు. చిన్నగా, లేదంటే పూర్తిగా ఏర్పడకపోవడం లాంటి సమస్యలు ఎదుర్కొంటారు. అయితే, ఇప్పుడు చెవులు సరిగా లేవని ఇబ్బంది పడాల్సి అవసరం లేదు. చక్కటి చెవులను పొందే అవకాశం ఉంటుంది. చెవులను పొందడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అయితే, ఈ స్టోరీ తెలుసుకోవాల్సిందే..
వైద్య రంగంలో ప్లాస్టిక్ సర్జరీ లేదంటే రీ కన్ స్ట్రక్షన్ పద్దతిలో చెవి బయటి భాగాన్ని సరి చేసే అవకాశం ఉంటుంది. ప్లాస్టిక్ సర్జరీతో ఇబ్బందులు తలెత్తినప్పటికీ, ఇయర్ రీ కన్ స్ట్రక్షన్ పద్దతి శాశ్వత పరిష్కారాన్ని చూపిస్తుంది. పక్కటెముక నుంచి తీసిన మృదులాస్థిని ఉపయోగించి చెవిని తయారు చేసే అవకాశం ఉంటుంది. ఈ పద్దతిని వైద్య పరిభాషలో ఔరిక్యులర్ రీకన్ స్ట్రక్షన్ గా పిలుస్తారు.
⦿ మృదులాస్థి సేకరణ: సాధారణంగా, 6, 7 లేదంటే 8వ పక్కటెముక నుంచి మృదులాస్థిని తీసుకుంటారు. ఈ భాగంలోని మృదులాస్థి చెవి మాదిరి బలాన్ని కలిగి ఉంటుంది. శస్త్రచికిత్స సమయంలో డాక్టర్లు జాగ్రత్తగా మృదులాస్థిని తీస్తారు. ఛాతీ నిర్మాణం, శ్వాసక్రియకు హాని కలగకుండా చూస్తారు.
⦿ చెవి ఆకారం తయారీ: బయటకు తీసిన మృదులాస్థిని చెవి ఆకారంలో తయారు చేస్తారు. సహజమైన చెవి ఆకారం వచ్చేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ చెవి నిర్మాణాన్ని ఆ తర్వాత ముంజేతిపై లేదంటే తొడపై చర్మం లోపల దానిని ఉంచుతారు. ఇది చర్మం లోపల కొత్త రక్తనాళాలను, చర్మాన్ని పోసుకుంటుంది. అది పూర్తిగా డెవలప్ అయిన తర్వాత మళ్లీ ఆ చెవిని చర్మం నుంచి బయటకు తీస్తారు.
Read Also: విషం లేని పాములు కూడా ప్రమాదకరమా? అసలు విషయం తెలిస్తే వణికిపోతారు!
⦿ శస్త్రచికిత్స దశలు: కొత్త చెవి ఏర్పాటు ప్రక్రియకు సంబంధించి ఆపరేషన్లు చాలా దశల్లో జరుగుతాయి. మొదట, మృదులాస్థి ఫ్రేమ్ వర్క్ ను చెవి ప్లేస్ లో అమర్చుతారు. తర్వాత, స్కిన్ గ్రాఫ్టింగ్, షేప్ లో సర్దుబాట్లు చేస్తారు. కొన్ని సందర్భాల్లో, చెవి ఆకారాన్ని మెరుగుపరచడానికి అదనపు శస్త్రచికిత్సలు అవసరం కావచ్చు.
ఇక చర్మం నుంచి బయకు తీసిన కొత్త చెవి భాగాన్ని మీ చెవి రంద్రానికి జోడిస్తారు. చెవి భాగానికి చర్మానికి జాగ్రత్తగా కుట్లు వేస్తారు. ఆ తర్వాత మీకు కొత్త చెవి ఏర్పడుతుంది. పక్కటెముక మృదులాస్థిని ఉపయోగించి చెవిని పునర్నిర్మించడం సహజంగా ఉంటుంది. భవిష్యత్ లో ఎలాంటి ఇబ్బందులు కలిగించదు. ప్లాస్టిక్ సర్జరీలతో అయితే ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది.
Read Also: అక్టోబర్ 29 లోపే సెలవులు తీసుకుని ఎంజాయ్ చేసేయ్యండి.. ఖగోళ శాస్త్రవేత్త హెచ్చరిక!