Spyware : సైబర్ సెక్యూరిటీ పరిశోధకులు EagleMsgSpy అనే శక్తివంతమైన స్పైవేర్‌ను ఇండియన్ మెుబైల్స్ లో కనుగొన్నారు. ఈ స్పై వేర్ ను చైనా నుంచి ఆపరేట్ చేస్తున్నారని.. మొబైల్ పరికరాలను పర్యవేక్షించడానికి ఉపయోగిస్తున్నారని కనుగొన్నారు. సైబర్ సెక్యూరిటీ సంస్థ లుక్ అవుట్ నివేదిక ప్రకారం, ఈ స్పైవేర్ 2017 నుండి యాక్టివ్‌గా ఉందని.. దీనిని వుహాన్ చైనాసాఫ్ట్ టోకెన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అభివృద్ధి చేసిందని తెలిపి టెక్ వర్గాలకు సైతం షాక్ ఇచ్చింది.
చైనా నుంచి ఆపరేట్ చేస్తున్న ఈ స్పైవేర్ ను మెుబైల్స్ హ్యాక్ చేయటానికి ఉపయోగిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ స్పై వేర్ గ్యాడ్జెట్స్ నుండి విస్తారమైన వ్యక్తిగత సమాచారాన్ని సేకరించేందుకు రూపొందించబడింది. ఇది థర్డ్ పార్టీ చాట్ మెసేజ్‌లు, రికార్డ్ స్క్రీన్‌లు, ఆడియోను యాక్సెస్ చేయగలదు. ఇంకా స్క్రీన్‌షాట్‌లను తీయగలదు. మ్యాప్స్ ను సైతం ట్రాక్ చేయగలదు. కాల్ లాగ్‌లు, SMS సందేశాలను కూడా పర్యవేక్షించగలదు. ఇది గ్యాడ్జెట్ లో ఉండే పరిచయాలు, బ్రౌజర్ బుక్ మార్క్‌లు, ఇన్‌స్టాల్ చేయబడిన యాప్‌లు, డేటా ఫైల్స్ ను సైతం సేకరించగలదు. వాటిని యాక్సిస్ చేయగలదు. ఇంతలా టెక్ రంగాన్ని భయపెడుతున్న ఆ స్పై వేర్ పేరే EagleMsgSpy.
EagleMsgSpy ఎలా పనిచేస్తుంది –
Bleeping Computer నివేదిక ప్రకారం, Lookout పరిశోధన కమాండ్ అండ్ కంట్రోల్ (C2) సర్వర్‌ల IP చిరునామాలు, డొమైన్ రికార్డ్‌లు, డాక్యుమెంటేషన్‌లో ఇంటర్నల్ డేటా, పబ్లిక్ కాంట్రాక్ట్‌లు వంటి వాటి ద్వారా స్పైవేర్‌ను దాని డెవలపర్‌లు, ఆపరేటర్‌లకు లింక్ చేసింది.
స్పైవేర్ Google Play లేదా థర్డ్ పార్టీ యాప్ స్టోర్‌లలో అందుబాటులో లేదు. ఇది మాన్యువల్‌గా పనిచేస్తుందని తెలిపింది. లుకౌట్ ప్రకారం.. అరెస్టులు లేదా జప్తు చేసిన ఫోన్స్ అన్ లాక్ చేసి ఉన్నప్పుడు ఈ పరికరాలలో స్పైవేర్‌ను ఇన్‌స్టాల్ చేసే అవకాశం ఉంటుంది.
స్పైవేర్ ఆపరేషన్‌లో ముఖ్యమైన విషయం.. సున్నితమైన డేటాను నిశ్శబ్దంగా సేకరించేయటం. సేకరించిన ఈ సమాచారం గ్యాడ్జెట్ లో దాచిన ఫోల్డర్‌లో స్టోరేజ్ చేయబడుతుంది. ఇక ఇలా స్టోరేజ్ చేసిన డేటా తర్వాత C2 సర్వర్‌కు పంపించబడుతుంది. అనంతరం కంప్రెస్ చేసి పాస్వర్డ్ అవసరం లేకుండా పనిచేస్తుంది
సాధ్యమైన iOS వెర్షన్ – లుక్ అవుట్ తెలిపిన ఈ వివరాలు ఆండ్రాయిడ్‌పై దృష్టి సారిస్తుండగా, EagleMsgSpy iOS వెర్షన్ లో ఈ ప్రమాదం ఉండే అవకాశం ఉందని చెబుతున్నాయి. అయితే ఈ విషయాన్ని ధృవీకరించడానికి ఎలాంటి ఆధారాలు లేవని చెబుతున్నాయి.
EagleMsgSpy ఏ డేటాను సేకరిస్తుందంటే –
⦿ QQ, టెలిగ్రామ్, WhatsApp, Viber, WeChat వంటి యాప్‌ల నుండి సందేశాలు
⦿ మీడియా ప్రొజెక్షన్ సేవను ఉపయోగించి స్క్రీన్ రికార్డింగ్‌లు, స్క్రీన్‌షాట్‌లు
⦿ ఫోన్ సంభాషణలు, పరిసర శబ్దాల ఆడియో రికార్డింగ్‌లు
⦿ వివరణాత్మక కాల్ లాగ్‌లు, పరిచయాలు, SMS సందేశాలు, GPS కోఆర్డినేట్‌లు, నెట్‌వర్క్ డేటా
⦿ స్టోరేజ్ లో ఇన్‌స్టాల్ చేసిన యాప్స్, ఫైల్‌ల జాబితా
⦿ బ్రౌజర్ బుక్‌మార్క్‌లతో పాటు Wi-Fi కనెక్షన్ వివరాలు
ALSO READ : మెుబైల్ మార్కెట్లో సరికొత్త సంచలనం.. సొంత చిప్ సెట్ తో వచ్చేస్తున్న టెక్ దిగ్గజం