Apple : యాపిల్.. మార్కెట్లో డామినేషన్ కొనసాగించేందుకు ఎప్పటికప్పుడు తమ సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేస్తూ, సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తుంటుంది. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కొత్త ఫీచర్స్‌ను పరిచయం చేయడంలో ముందుంటుంది.
అయితే తాజాగా తమ ప్రొడక్ట్స్ పనితీరును మరింత సమర్థవంతంగా పనిచేసేలా, తమ ప్రొడక్ట్స్‌లో వాడే చిప్ దిగుమతి కోసం సరఫరాదారులపై ఆధారపడటాన్ని తగ్గించే దిశగా కొత్త నిర్ణయం తీసుకుంది యాపిల్. ఇకపై తన గ్యాడ్జెట్స్‌లో వినియోగించే చిప్స్‌ను సొంతంగా తయారీ చేయాలని నిర్ణయించుకుంది.
టెక్ దిగ్గజం యాపిల్ సాధారణంగా తను తయారు చేసే గ్యాడ్జెట్స్‌లో బ్రాడ్‌కామ్, క్వాల్‌కామ్‌కు చెందిన కంపోనెంట్స్కు (చిప్స్ సహా ఇతర విడిభాగాలు) ఉపయోగిస్తోంది. ఇప్పుడు వాటికి బదులుగా సొంతంగా తన తయారీ కంపోనెంట్స్నే వాడేందుకు సిద్ధమైంది. ముఖ్యంగా తమ గ్యాడ్జెట్స్‌లో వాడే చిప్స్‌ను సొంతంగా తయారు చేసేలా సంసిద్ధమైంది. ఈ కస్టమ్ డిజైన్డ్ చిప్స్‌ను భవిష్యత్‌లో తయారు చేయబోయే ఐఫోన్స్‌తో పాటు ఇతర స్మార్ట్ హోమ్ డివైసెస్‌లో వినియోగించనుంది. అలానే సొంతంగా ఇన్ హౌస్ బ్లూటూత్, వైఫై చిప్స్, కోడ్ – నేమ్డ్ ప్రాక్సిమా చిప్‌ను తయారు చేసి, వాటిని తమ గ్యాడ్జెట్స్‌లో ఉపయోగించనుంది. ఈ సొంత తయారీ నిర్ణయంతో, ఇకపై తమ గూటికి చెందిన భాగస్వామ్యమైన తైవాన్ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ (టీఎస్ఎమ్సీ) సంస్థ, యాపిల్ కోసం ఈ కస్టమ్ డిజైన్డ్ చిప్స్‌ను తయారు బాధ్యతను తీసుకోనుంది.
అలానే ఎప్పటి నుంచో విడుదల చేయాలని అనుకుంటున్న తన సెల్యూలర్ మోడెమ్ చిప్స్‌లను 2024లో రిలీజ్ చేసేలా ప్రణాళికలను సిద్ధం చేస్తోంది యాపిల్. దీంతో క్వాల్‌కామ్‌పై ఆధారపడడాన్ని దశలవారీగా తగ్గించినట్టువుతంది.
బ్లూటూత్, వైఫై, మోడెమ్ చిప్స్ తయారీని సెపరేట్ ప్రాజెక్ట్స్‌గా డెవలెప్ చేస్తున్నప్పటికీ, వీటన్నింటిని కలిపి ఒకేసారి తమ ప్రొడక్ట్స్‌లో వినియోగించేలా యాపిల్ భావిస్తోంది. ఈ ఇంటిగ్రేటెడ్ విధానం వల్ల డివైస్ కనెక్టివిటీపై యాపిల్ ఎక్కువ నియంత్రణను పొందటంతో పాటు మెరుగైన పనితీరు, శక్తి సామార్థ్యాన్ని పొందుతుంది.
మొత్తంగా యాపిల్, సరఫరాదారులపై ఆధారపడటాన్ని తగ్గించి, తమ ప్రొడక్ట్స్‌లో వాడే చిప్‌లు సహా ఇతర కనెక్టివిటీ ఫీచర్స్ విషయమై సొంత ఉత్పత్తి ద్వారా గణనీయమైన పురోగతిని సాధించాలని చూస్తోంది. దీని ద్వారా కంపెనీ పనితీరును మెరుగుపరచాలని, అలానే ఖర్చులను తగ్గించాలని భావిస్తోంది. మంచి కనెక్టివిటీ సహా అత్యాధునిక ఫీచర్స్‌ను అందించే సంస్థగా తమ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు సిద్ధమైంది.
ఇక.. యాపిల్ తీసుకునే ఈ నిర్ణయం ఎప్పటి నుంచి అమలులోకి వస్తుంది అనే విషయంపై క్లారిటీ లేనప్పటికీ వచ్చే ఏడాది ఈ కంపెనీ నుంచి లేటెస్ట్ గాడ్జెట్స్ ఎన్నో రాబోతున్నాయి. ఐఫోన్ ఎస్ ఈ 4 మెుబైల్, మ్యాక్ బుక్స్ రాబోతున్నాయి. ఇక 2025 అక్టోబర్లో ఆపిల్ ఈవెంట్ లో భాగంగా ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ కాబోతుంది. ఈ సిరీస్ తో రాబోతున్న మొబైల్స్ లో మరి ఆపిల్ తన సొంత చిప్ సెట్ ను ఉపయోగిస్తుందా? లేదా క్వాల్కమ్ చిప్ సెట్ ను ఉపయోగిస్తుందనే విషయం తెలియాల్సి ఉంది.
ALSO READ : ఒంటరి వ్యక్తులే వాళ్ల టార్గెట్.. నమ్మారో ఇంక అంతే సంగతులు! తస్మాత్ జాగ్రత్త!