Vinod Kambli: ఈయన ఒకప్పుడు టీమిండియా స్టార్ క్రికెటర్. 30 ఏళ్ల కిందట ప్రపంచ క్రికెట్ లో పెను తుఫాన్. సచిన్ టెండూల్కర్ తో కలిసి ఒకప్పుడు రికార్డు భాగస్వామ్యం నెలకొల్పాడు. కట్ చేస్తే ఇప్పుడు బీసీసీఐ ఇచ్చే పెన్షన్ డబ్బులతో బతుకీడుస్తున్నాడు. గతంలో మాజీ క్రికెటర్లకు బీసీసీఐ రూ. 15 వేల నుంచి రూ. 50 వేల వరకు పెన్షన్ చెల్లించింది. రిటైర్మెంట్ కి ముందు సదరు క్రికెటర్ పొందిన కాంట్రాక్ట్, పొందిన వేతనం మీద ఆధారపడి వారికి చెల్లించే పెన్షన్ ఆధారపడి ఉండేది.
Read also: Mohammed Shami – Rohit Sharma: టీమిండియాలో అంతర్గత గొడవలు..రోహిత్ శర్మ వర్సెస్ షమీ ?
దీనిని 2022 జూన్ నెలలో 100% పెంచుతూ భారత క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. అంటే ఇంతకుముందు 15 వేలు తీసుకునే మాజీ క్రికెటర్లు 2022 నుండి నెలకు 30 వేలు అందుకుంటున్నారు. ప్రస్తుతం ఆ 30 వేల పైనే ఆధారపడి బ్రతుకుతున్నానని, తాను తీవ్ర ఆర్థిక ఇబ్బందులలో ఉన్నానని చెబుతున్నాడు ఈ మాజీ క్రికెటర్. ఇదంతా ఎవరి గురించో కాదు.. టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ {Vinod Kambli} గురించే. తాను ప్రస్తుతం బీసీసీఐ ఇచ్చే పెన్షన్ డబ్బులపైనే బ్రతుకుతున్నానని, తనకి క్రికెట్ కి సంబంధించిన ఏదైనా పని కావాలని కోరుతున్నాడు. ఒకప్పుడు వినోద్ కాంబ్లీని అందరూ సచిన్ టెండుల్కర్ తో సమానంగా చూసేవారు.
అంతేకాదు సచిన్ తరువాత నెక్స్ట్ స్టార్ బ్యాట్స్మెన్ గా ఆయనను ఊహించుకునేవారు. కానీ ఆయన చెడు అలవాట్లకు బానిసై, క్రికెట్ ని నిర్లక్ష్యం చేయడంతో.. ఆకాశంలో ఉండాల్సిన ఆయన కెరీర్ పాతాళానికి పడిపోయింది. 1990వ దశకంలో టీం ఇండియా స్టార్ ఆటగాడు అయిన వినోద్ కాంబ్లీ {Vinod Kambli}.. 1991 సంవత్సరంలో జాతీయ క్రికెట్ లో అడుగు పెట్టాడు. తన ఆటతీరుతో ఆయన ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అంతేకాదు తక్కువ కాలంలోనే కోట్లలో సంపాదించాడు. జాతీయ మీడియా కధనాల ప్రకారం.. కాంబ్లీ {Vinod Kambli} కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు ఆయన వద్ద 1.5 మిలియన్ డాలర్ల ఆస్తి ఉండేది.
అదే 2022 వరకు ఆయన బ్యాంక్ అకౌంట్ లోకి కేవలం రూ. 4 లక్షలు మాత్రమే ఉన్నాయని సమాచారం. ఇక 2022 తో పోలిస్తే వినోద్ కాంబ్లీ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. ప్రస్తుతం ఆయనకి పెన్షన్ తప్ప మరే ఇతర ఆదాయం లేదు. కొన్ని నెలల క్రితం ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు ప్రతినెలా రూ. 30 వేలు పెన్షన్ రూపంలో అందుతుందని.. ఆ డబ్బుతోనే తన ఇల్లు గడుస్తుందని చెప్పారు.
Also Read: మూడో టెస్ట్ కు ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు దూరం.. టీమిండియా ఫైనల్ స్క్వాడ్ ఇదే!
ఇక ఆయన స్నేహితుడు సచిన్ టెండుల్కర్ ప్రతినెలా బీసీసీఐ నుంచి పొందుతున్న పెన్షన్ మొత్తం రూ. 50 వేల రూపాయలు. ఇక వినోద్ కాంబ్లీ తొలిసారిగా 1991లో షార్జాలో జరిగిన వన్డే మ్యాచ్ తో భారత జట్టులోకి అరంగేట్రం చేశాడు. 1991 – 2010 అంతర్జాతీయ క్రికెట్ లో 17 టెస్టులు, 104 వన్డేలు ఆడాడు. 17 టెస్టుల్లో 54 సగటుతో 1084 పరుగులు చేశాడు. 14 వన్డేల్లో రెండు సెంచరీలతో పాటు.. 14 ఆఫ్ సెంచరీలు చేశాడు.