E-Paper
Advertisement

ఇంట్లోనే ఈజీగా కరకరలాడే..స్ప్రింగ్ రోల్స్ చేసుకోండిలా!

ఇంట్లోనే ఈజీగా కరకరలాడే..స్ప్రింగ్ రోల్స్ చేసుకోండిలా!
Advertisement

Veg Spring Rolls:  సాయంత్రం కాగానే వేడివేడిగా, కరకరలాడే స్నాక్స్ తింటే ఆ కిక్కే వేరు! ముఖ్యంగా.. ఎన్ని తిన్నా బోర్ కొట్టకుండా నోరూరించే స్నాక్స్ జాబితాలో క్రిస్పీ వెజ్ స్ప్రింగ్ రోల్స్ ఎప్పుడూ టాప్‌లోనే ఉంటాయి. బయట రెస్టారెంట్లలో.. లేదా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో కొనుక్కుని తినే ఈ రోల్స్‌ను ఇంట్లోనే చాలా తక్కువ సమయంలో ఎంతో పరిశుభ్రంగా, రుచిగా తయారు చేసుకోవచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతీ ఒక్కరూ ఎంతో ఇష్టంగా.. తినే ఈ క్రంచీ స్ప్రింగ్ రోల్స్ అప్పటికప్పుడు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం!

స్ప్రింగ్ రోల్స్ అనగానే.. బయట వైపు క్రిస్పీగా ఉండే.. పల్చటి పొర, లోపల నోరూరించే.. వెజిటబుల్స్ స్టఫింగ్ గుర్తొస్తాయి. ఆసియన్ క్వైజిన్ నుంచి వచ్చి మన టాలీవుడ్ హోమ్‌లకు పాకిన ఈ స్నాక్, ఇప్పుడు ప్రతి ఇంట్లో.. ఫేవరెట్‌గా మారింది. ముఖ్యంగా.. వర్షం పడుతున్నప్పుడైనా.. లేదా సాయంత్రం వేళల్లో ఆకలి వేసినప్పుడైనా సరే.. చాయ్‌తో .. పాటు ఈ రోల్స్ తింటే అద్భుతంగా ఉంటుంది.

కావలసిన పదార్థాలు:

Advertisement

ఈజీ స్ప్రింగ్ రోల్స్ తయారీకి పెద్దగా ఆడంబరాలు అవసరం లేదు. మన ఇంట్లోని కిచెన్‌లో దొరికే సాధారణ పదార్థాలతోనే .. దీన్ని సిద్ధం చేసుకోవచ్చు.

షీట్స్ కోసం: మైదా పిండి – 1 కప్పు, కార్న్ ఫ్లోర్ – 2 స్పూన్లు, చిటికెడు ఉప్పు, నీళ్లు. (వీలైతే.. మార్కెట్లో దొరికే రెడీమేడ్ స్ప్రింగ్ రోల్ షీట్స్ కూడా వాడుకోవచ్చు).

Advertisement

స్టఫింగ్ కోసం: తరిగిన క్యాబేజీ – 1 కప్పు, క్యారెట్ తురుము – 1/2 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు – 1/2 కప్పు, ఉల్లిపాయ ముక్కలు – 1/2 కప్పు, సన్నగా తరిగిన వెల్లుల్లి , అల్లం – 1 స్పూన్.

సాస్‌లు & మసాలాలు: సోయా సాస్ – 1 స్పూన్, రెడ్ చిల్లీ సాస్ – 1 స్పూన్, వెనిగర్ – 1/2 స్పూన్, మిరియాల పొడి – 1/2 స్పూన్, రుచికి సరిపడా ఉప్పు, వేయించడానికి తగినంత నూనె.

తయారీ విధానం:

1. ముందుగా ప్యాన్ లో కొద్దిగా నూనె వేసి వేడెక్కనివ్వాలి. అందులో సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి ముక్కలు వేసి దోరగా వేయించాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు, క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజీ ముక్కలను వేసి హై ఫ్లేమ్ మీద రెండు నిమిషాలు వేడి చేయాలి. కూరగాయలు పూర్తిగా ఉడకకుండా కాస్త కరకరలాడేలా ఉండటమే దీని అసలు రుచి. ఇప్పుడు అందులో సోయా సాస్, చిల్లీ సాస్, వెనిగర్, మిరియాల పొడి , తగినంత ఉప్పు వేసి బాగా కలిపి స్టవ్ ఆపేయాలి. ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.

2. ఒక గిన్నెలో.. మైదా పిండి, కార్న్ ఫ్లోర్, ఉప్పు వేసి నీళ్లు పోస్తూ దోస పిండి కంటే కాస్త పల్చగా కలుపుకోవాలి. పెనం వేడి చేసి, ఒక గరిటె పిండిని వేసి పల్చగా దోసలా పరచాలి. సెకన్లలోనే రోల్ షీట్ రెడీ అయిపోతుంది. దీనిని రెండు వైపులా ఎక్కువగా కాల్చకుండా తేలికగా వేడి చేసి పక్కన పెట్టుకోవాలి.

3. తయారు చేసుకున్న షీట్‌ను ప్లేట్‌లో పరిచి, దాని మధ్యలో చల్లారిన వెజిటబుల్ స్టఫింగ్ ఉంచాలి. రోల్ ఊడిపోకుండా ..ఉండటానికి కొద్దిగా మైదా పిండి కరిగించిన నీటిని అంచుల వెంట రాసి, రెండు వైపులా మడతపెట్టి రోల్ లాగా చుట్టాలి. ఇప్పుడు కడాయిలో.. నూనె వేసి బాగా వేడెక్కిన తర్వాత, సిద్ధం చేసుకున్న రోల్స్‌ను వేసి దోరగా పసిడి రంగు వచ్చే వరకు డీప్ ఫ్రై చేయాలి.

మీరు క్యాలరీలు తగ్గించుకోవాలి, ఆయిల్ ఫుడ్ వద్దనుకుంటే ఈ స్ప్రింగ్ రోల్స్‌ను డీప్ ఫ్రై చేయడానికి బదులుగా ..ఎయిర్ ఫ్రైయర్ లో కూడా తయారు చేసుకోవచ్చు. కొద్దిగా నూనెను రోల్స్‌పై బ్రష్ చేసి, 180 డిగ్రీల వద్ద 10 నుండి 12 నిమిషాలు బేక్ చేస్తే అంతే క్రిస్పీగా, హెల్తీగా రోల్స్ రెడీ అవుతాయి.

సర్వింగ్ టిప్స్:
వేడి వేడిగా కరకరలాడే.. ఈ వెజ్ స్ప్రింగ్ రోల్స్‌ను టమాటో కేచప్ లేదా గార్లిక్ మేయోనైజ్‌తో నంజుకుని తింటే.. ఆ రుచి మర్చి పోలేరు. సాయంత్రం వేళ ఇంటికి చుట్టాలు వచ్చినా లేదా పిల్లల బర్త్‌డే.. పార్టీలకైనా ఇది అప్పటికప్పుడు చేసుకోగలిగే క్విక్ అండ్ సూపర్ స్నాక్ ఆప్షన్!

చూశారుగా! రెస్టారెంట్ స్టైల్ స్ప్రింగ్ రోల్స్‌ను ఎంత ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చో! తక్కువ ఖర్చుతో పరిశుభ్రంగా చేసుకునే ఈ క్రిస్పీ స్నాక్‌ను ఈరోజే మీ ఇంట్లో ట్రై చేసి వేడివేడిగా తినండి.

Related News

నాన్నమ్మల కాలం నాటి గోంగూర నిల్వ పచ్చడి రెసిపీ..ఎప్పుడు చేసినా కిరాక్ రుచి!

కాకరకాయ కారం పొడి సింపుల్ రెసిపీ..క్షణాల్లోనే రెడీ అవుతుంది!

మైదా, శనగపిండి లేకుండా సూపర్ క్రిస్పీ స్నాక్స్.. మళ్లీ మళ్లీ తినాలనిపించే రుచి

మీ కనుబొమ్మలు పలుచగా ఉన్నాయా? దట్టంగా పెరగాలంటే ఇలా చేయండి

పిల్లలు తప్పు చేసినా సరే.. కోపంలో ఈ మాటలు మాత్రం అనకండి!

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాబ్స్.. ఏఐ, డేటా అనలిటిక్స్ విభాగాల్లో ఖాళీలు

షేవింగ్ చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? ముఖంపై నల్లటి మచ్చలు, దురదకు అవే కారణం

Big Stories

Advertisement
×