Block Spam Calls| భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు స్పామ్, టెలిమార్కెటింగ్ కాల్స్‌తో విసిగిపోయారు. ఈ కాల్స్ రోజువారీ సమస్యగా మారాయి. ‘అన్‌నోన్’ నంబర్‌ల నుండి వచ్చే ఈ కాల్స్ చేసేవారు తరుచూ నంబర్‌లను మారుస్తూ గుర్తించబడకుండా తప్పించకుంటున్నారు.
ఇందులో మంచి విషయం ఏమిటంటే, ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో స్పామ్ కాల్స్‌ను బ్లాక్ చేయడానికి లేదా ఫిల్టర్ చేయడానికి ఇన్ బిల్ట్ ఫీచర్‌లు అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ బ్రాండ్‌ల ఫోన్‌లలో స్పామ్ కాల్స్‌ను ఎలా బ్లాక్ చేయాలో వివరంగా తెలుసుకుందాం.
సామ్‌సంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లు
- సామ్‌సంగ్ ఫోన్‌లలో స్పామ్ కాల్స్‌ను బ్లాక్ చేయడానికి ఇన్ బిల్ట్ ఫీచర్ ఉంది:
- ఫోన్ యాప్‌ను ఓపెన్ చేయండి.
- టాప్ రైట్ కార్నర్‌లో ఉన్న మూడు డాట్‌లపై ట్యాప్ చేయండి.
- “బ్లాక్ నంబర్స్” ఎంపికను ఎంచుకోండి.
- “అన్‌నోన్ నంబర్స్ నుండి కాల్స్‌ను బ్లాక్ చేయి” ఆప్షన్‌ను ఆన్ చేయండి.
- అలాగే, “బ్లాక్ స్పామ్ అండ్ స్కామ్ కాల్స్” ఎంపికను ఎంచుకొని టోగుల్‌ను ఆన్ చేయవచ్చు.
- మీరు కావాలనుకుంటే నిర్దిష్ట నంబర్‌లను మాన్యువల్‌గా కూడా బ్లాక్ చేయవచ్చు.
వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లు
- వన్‌ప్లస్ ఫోన్‌లు చాలావరకు గూగుల్ ఫోన్ (డయలర్) యాప్‌ను ఉపయోగిస్తాయి. స్పామ్ కాల్స్‌ను బ్లాక్ చేయడానికి:
- ఫోన్ యాప్‌ను ఓపెన్ చేయండి.
- మూడు డాట్‌లపై ట్యాప్ చేసి “సెట్టింగ్స్”కు వెళ్లండి.
- “కాలర్ ఐడీ & స్పామ్” ఎంపికను ఎంచుకోండి.
- “ఫిల్టర్ స్పామ్ కాల్స్” ఆప్షన్‌ను ఆన్ చేయండి.
ఒప్పో, వివో, ఐక్యూ, రియల్‌మీ స్మార్ట్‌ఫోన్‌లు
ఈ బ్రాండ్‌లు కూడా చాలా మోడల్‌లలో గూగుల్ డయలర్‌ను ఉపయోగిస్తాయి. పైన చెప్పిన వన్‌ప్లస్ ఫోన్‌ల మాదిరిగానే ఈ దశలను అనుసరించండి:
ఫోన్ యాప్ > సెట్టింగ్స్ > కాలర్ ఐడీ & స్పామ్‌కు వెళ్లండి.
“ఫిల్టర్ స్పామ్ కాల్స్” ఆప్షన్‌ను ఆన్ చేయండి.
షవోమి, పోకో స్మార్ట్‌ఫోన్‌లు
హైపర్‌ఓఎస్ లేదా MIUI ఆపరేటింగ్ సిస్టమ్‌లలో రన్ అయ్యే షవోమి , పోకో ఫోన్‌లు స్పామ్ కాల్ ఫిల్టర్‌ను అందిస్తాయి:
- ఫోన్ యాప్‌ను ఓపెన్ చేయండి.
- మూడు డాట్‌లపై ట్యాప్ చేసి “సెట్టింగ్స్”కు వెళ్లండి.
- “కాలర్ ఐడీ & స్పామ్” ఎంపికను ఎంచుకోండి.
- “ఫిల్టర్ స్పామ్ కాల్స్” ఆప్షన్‌ను ఆన్ చేయండి.
ఇవే కాకుండా DND, TRAI యాప్ లు కూడా ఉన్నాయి.
పై ఫీచర్‌లు ఉపయోగించినా స్పామ్ కాల్స్ వస్తూనే ఉంటే.. ఈ పరిష్కారాలను ప్రయత్నించండి:
- DND (డో నాట్ డిస్టర్బ్) యాక్టివేట్ చేయండి:
- 1909కు “START 0” అనే మెసేజ్‌ను SMS ద్వారా పంపండి.
- TRAI DND యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి:
- గూగుల్ ప్లే స్టోర్‌లో TRAI DND యాప్ అందుబాటులో ఉంది.
- మీ మొబైల్ నంబర్‌తో యాప్‌ను సెటప్ చేయండి.
- కాల్ బ్లాకింగ్ ఫీచర్‌లను ఆన్ చేసి స్పామ్ కాల్స్‌ను తగ్గించండి.
ఇన్ బిల్ట్ ఫీచర్‌లు, ప్రభుత్వ-సాధనాల కలయికతో, మీరు స్పామ్ కాల్స్ నుండి ఉపశమనం పొందవచ్చు. ఈ సులభమైన సెట్టింగ్స్ అనుసరించి, మీ స్మార్ట్‌ఫోన్‌ను మరింత సురక్షితంగా, శాంతియుతంగా ఉపయోగించండి.

Share