Cucumber Benefits: దోసకాయ తినడం వల్ల అనేక అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. నీటి శాతం అధికంగా ఉండే ఈ కూరగాయలో విటమిన్లు, మినరల్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. అందుకే వీటిరి తరచుగా తినడం వలల కూడా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ఇంతకీ దోసకాయ తినడం వల్ల కలిగే పది అద్భుతమైన ప్రయోజనాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
1. శరీరానికి హైడ్రేషన్:
దోసకాయలో 95 శాతం వరకు నీరు ఉంటుంది. వేసవిలో శరీరం డీహైడ్రేషన్ కాకుండా ఉండటానికి ఇది ఒక అద్భుతమైన మార్గం. ముఖ్యంగా వ్యాయామం తర్వాత లేదా అధిక వేడిలో పనిచేసే వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది.
2. బరువు తగ్గడానికి సహాయపడుతుంది:
దోసకాయలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. దీంతో అనవసరమైన ఆహారం తీసుకోవడం తగ్గుతుంది. ఫలితంగా బరువు నియంత్రణలో ఉంటుంది.
3. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
దోసకాయలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది. రోజూ దోసకాయ తినడం వల్ల జీర్ణాశయం ఆరోగ్యంగా ఉంటుంది.
4. చర్మానికి మంచిది:
దోసకాయలో సిలికా, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచుతాయి. కంటి కింద డార్క్ సర్కిల్స్, ఉబ్బిన కళ్ళపై దోసకాయ ముక్కలు పెట్టడం ఒక సాంప్రదాయ చిట్కా.
5. రక్తపోటును నియంత్రిస్తుంది:
దోసకాయలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. శరీరంలో సోడియం ప్రభావాన్ని తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.
6. శరీరంలోని విషపదార్థాలను తొలగిస్తుంది:
దోసకాయలో నీరు అధికంగా ఉండటం వల్ల మూత్రవిసర్జన ఎక్కువగా జరుగుతుంది. దీనివల్ల శరీరంలోని విషపదార్థాలు, మలినాలు సులభంగా బయటకు వెళ్తాయి. ఇది కాలేయం, కిడ్నీల ఆరోగ్యానికి కూడా మంచిది.
7. రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
దోసకాయలో విటమిన్ సి, కె, బీటా కెరోటిన్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి తోడ్పడతాయి. దీంతో జలుబు, దగ్గు వంటి చిన్న చిన్న ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది.
Also Read: కంటి సమస్యలు రాకూడదంటే.. ఎలాంటి టిప్స్ పాటించాలి ?
8. కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది:
దోసకాయలో సిలికా అనే మూలకం ఉంటుంది. ఇది ఎముకలను, కీళ్లను బలోపేతం చేస్తుంది. కీళ్ల నొప్పులు ఉన్నవారు రోజూ దోసకాయను ఆహారంలో చేర్చుకోవడం మంచిది.
9. శ్వాసను తాజాగా ఉంచుతుంది:
దోసకాయ ముక్కను నాలుక మీద కాసేపు ఉంచుకోవడం వల్ల నోటిలో ఉండే బ్యాక్టీరియా చనిపోతుంది. దుర్వాసన తగ్గుతుంది.
10. యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది:
దోసకాయలో అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గించి.. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి.
కాబట్టి.. ఆరోగ్యానికి ఇంత మేలు చేసే దోసకాయను మీ రోజువారీ ఆహారంలో తప్పకుండా చేర్చుకోండి. వేసవిలో మాత్రమే కాదు ఇది అన్ని సీజన్లలో మీ ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది.