Big Stories

Elon Musk:- బ్లూ టిక్స్‌తో ఎలన్ మస్క్ ఆటలు..

Elon Musk:- ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ఉంటే ఇంటర్నెట్.. ఇంటర్నెట్ ఉంటే సోషల్ మీడియా యాప్.. సోషల్ మీడియా యాప్ ఉంటే అందులో ఒక అకౌంట్ తప్పనిసరిగా మారిపోయాయి. అంతే కాకుండా ఈరోజుల్లో సోషల్ మీడియాలో అకౌంట్ ఉన్న ప్రతీ ఒక్కరికి సెలబ్రిటీ స్టేటస్ దక్కించుకోవాలన్న కుతూహలం కూడా ఎక్కువయ్యింది. దాన్ని అదునుగా తీసుకొని ఎలన్ మస్క్ బ్లూ టిక్స్‌తో ఆటలు మొదలుపెట్టాడని నెటిజన్లు విమర్శిస్తున్నారు.

- Advertisement -

టెస్లా లాంటి అడ్వాన్స్ టెక్నాలజీ కంపెనీని స్థాపించిన ఎలన్ మస్క్ ఒక్కసారిగా టెక్ ప్రపంచంలో హీరో అయిపోయాడు. కానీ ట్విటర్‌ను సొంతం చేసుకున్న తర్వాత ఎక్కువగా విమర్శల పాలవుతున్నాడు. ట్విటర్ సీఈఓగా ఉద్యోగుల దగ్గర నుండి యూజర్ల వరకు అందరిపై నెగిటివ్ ప్రభావాన్ని చూపించాడు మస్క్. అంతే కాకుండా బ్లూ టిక్స్‌ను అమ్మడం మొదలుపెట్టిన తర్వాత అసలు మస్క్ ట్విటర్‌ను ఏం చేయాలనుకుంటున్నాడు అని అందరూ అయోమయంలో పడిపోయారు.

- Advertisement -

నెలకు కొంత వెలతో బ్లూ టిక్స్‌ను యూజర్లకు అమ్మడం మొదలుపెట్టాడు ఎలన్ మస్క్. దీంతో చాలామంది వాటిని కొని సెలబ్రిటీలులాగా ఫీల్ అవ్వడం మొదలుపెట్టారు. ఇప్పుడు మళ్లీ ఆ బ్లూ టిక్స్‌ను హఠాత్తుగా తీసేసి అందరిలో మళ్లీ కన్ఫ్యూజన్‌ను క్రియేట్ చేశాడు. తాజాగా కొందరు సెలబ్రిటీలకు మినహా ట్విటర్‌లో ఎవరి అకౌంట్‌కు బ్లూ టిక్స్ అనేవి కనిపించడం లేదు. దీంతో మరోసారి ట్విటర్ సీఈఓగా ఎలన్ మస్క్ పేరు వైరల్ అయ్యింది.

ప్రస్తుతం ఇండియాలో నెలకు రూ.900 రూపాయలు కడితే చాలు.. ట్విటర్‌లో బ్లూ టిక్ అకౌంట్‌కు ఓనర్ అయిపోవచ్చు. కానీ సడెన్‌గా దాదాపు 4 లక్షల యూజర్లకు ఉన్నట్టుండి బ్లూ టిక్స్ మాయమైపోయాయి. అంతే కాకుండా కొందరు సెలబ్రిటీలకు మాత్రం బ్లూ టిక్స్ అలాగే ఉన్నాయి. అదే సమయంలో ఎలన్ మస్క్.. నా తరపున వారికి ఈ బ్లూ టిక్స్ అందిస్తున్నా అని ట్వీట్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీనికి పలువురు సెలబ్రిటీలు సైతం స్పందించారు.

‘నేను ట్విటర్ అకౌంట్‌లో ట్విటర్ బ్లూను సబ్‌స్క్రైబ్ చేసుకున్నట్టుగా చూపిస్తోంది. కానీ నేను చేసుకోలేదు. దీనికి సంబంధించి నేను ఒక ఫోన్ నెంబర్ ఇచ్చానని ట్విటర్ అంటోంది. కానీ నేను ఇవ్వలేదు.’ అని స్టీఫెన్ కింగ్ ట్వీట్ చేశారు. దీనికి సమాధానంగా మస్క్.. ‘వెల్‌కమ్. నమస్తే’ అని ట్విట్ చేశాడు. స్టీఫెన్ కింగ్‌తో పాటు రిహాన్నా, టైలర్ స్విఫ్ట్ లాంటి వారికి బ్లూ టిక్స్ అలాగే ఉన్నాయి. అయితే దీనికి కారణం మాస్క్‌యేనా లేదా వారు నిజంగానే వాటిని సబ్‌స్క్రైబ్ చేసుకున్నారా అన్న విషయం తెలియాల్సి ఉంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News