
Virupaksha First Day Collection: ‘విరూపాక్ష’ ఎట్లుంది? సూపర్. థ్రిల్లింగ్. మ్యూజిక్ అదిరింది. సెకండ్ హాఫ్ చించేసింది. ఇలా అంతా పాజిటివ్ టాకే నడుస్తోంది. మార్నింగ్ షో నుంచే మస్త్ ఉందనే మాట వినిపిస్తోంది. సుకుమార్ స్క్రీన్‌ప్లే అంటే ఆ మాత్రం ఉండాల్సిందే. సుకుమార్ శిష్యుడు తీశాడంటే అట్లుంటది సినిమా. అందుకే, ఆన్‌లైన్లో టకటకా టికెట్లు బుక్ అవుతున్నాయి. ఈ వీకెండ్ ‘విరూపాక్ష’దే. మరి, కలెక్షన్లు ఎలా ఉన్నాయ్?
ఫస్ట్ డే మంచి వసూళ్లే రాబట్టింది ‘విరూపాక్ష’. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఛరిస్మా కలిసొచ్చింది. ఫస్ట్ డే ఏపీ, తెలంగాణలో దాదాపు 5 కోట్ల షేర్, 8.5 కోట్ల గ్రాస్ రాబట్టింది. వరల్డ్ వైడ్‌గా 6.35 కోట్ల షేర్ వచ్చింది.
నైజాంలో 1.82 కోట్లు, వైజాగ్‌లో 58 లక్షలు, సీడెడ్ 54 లక్షలు, గుంటూరు 46 లక్షలు, కృష్ణా 32 లక్షలు, వెస్ట్‌లో 47 లక్షలు, ఈస్ట్‌లో 40 లక్షలు కలెక్ట్ చేసింది.
‘విరూపాక్ష’ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 22 కోట్లకు జరిగింది. బ్రేక్ ఈవెన్ దిశగా దూసుకుపోతోంది. పాజిటివ్ టాక్ రావడంతో.. ఈ వీకెండ్ కల్లా ఫుల్ పైసా వసూల్ అంటున్నారు. ప్రేక్షకులను థ్రిల్ చేసే సినిమాలకు ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుందని మరోసారి నిరూపించింది ‘విరూపాక్ష’.