Elon Musk : పోటీ ప్రపంచంలో ఎదగాలంటే సరైన ఆలోచన విధానం తప్పనిసరి. ఏ వ్యాపారమైనా ఆలోచనే ఎదుగుదలకు తొలిమెట్టు. ఎంతటి అధినేత అయినా తప్పటడుగు వేస్తే ఒక్క క్షణంలో పాతాళానికి పడిపోతాడు. మరి ప్రపంచ టెక్ అధినేతల్లో ఒకరిగా ఉన్నత స్థాయిలో నిలబడిన.. టెస్లా కంపెనీ అధినేత ఎలన్ మస్క్ వ్యూహాలేంటి? తన ఆలోచనలతో సరికొత్త ప్రణాళికలు సృష్టిస్తున్నాడా? అసలు వెనకపడిన ఫోర్డ్ కంపెనీతో టాప్ స్థాయిలో ఉన్న టెస్లా ఎందుకు డీల్ కుదుర్చుకుంది. దీని వెనుక ఎలన్ మస్క్ ఆలోచనా విధానం ఏంటి? ఒక్కసారి ఆలోచిస్తే.. నిజానికి మస్క్ ను చూసి మిగిలిన వ్యాపారవేత్తలు నేర్చుకోవాల్సింది ఎంతో ఉందనిపిస్తుంది.
ప్రపంచంలో ఉన్న టాప్ టెక్ అధినేతల్లో ఒకరిగా ఉన్న ఎలన్ మస్క్.. ప్రస్తుత టెక్ ప్రపంచాన్ని శాసించే ప్రయత్నాలు చేస్తున్నాడనే చెప్పాలి. ఎలక్ట్రిక్ కార్ల రంగంలో వరల్డ్ వైడ్ గా తన సత్తా చాటాలనే ప్రయత్నిస్తున్నాడు. అయితే ఉన్నత స్థాయిలో నిలబడాలనే లక్ష్యంతో మస్క్ ముందుకెళ్ళినప్పటికీ.. తన లోపాలను తను అంచనా వేశాడు. తన వద్ద ఎక్కువ కార్లు ఉత్పత్తి చేసే సామర్థ్యంలేదని గుర్తించాడు. దీంతో కలిసి నడిస్తేనే వ్యాపారంలో ముందుకు వెళ్ళగలమనే విషయాన్ని నమ్మాడు. ఫోర్డ్ కంపెనీతో డీల్ కుదుర్చుకున్నాడు. టెక్నాలజీని మీకు అందిస్తా.. మీ తయారీ సామర్థ్యాన్ని నాకు ఇవ్వండి అంటూ వ్యూహాన్ని అమలు చేశాడు. దీంతో ఇద్దరు కలిసి అమెరికాలో ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసి లాంఛ్ చేశారు. ఇప్పుడు ఈ కార్ల అమ్మకాలు అమెరికాలో అత్యధిక స్థాయికి చేరుకుంటున్నాయి. నిజానికి ఇదే కదా.. ఎదుగుదలకి మొదటి మెట్టు.
నిజానికి అమెరికాలో ఫోర్డ్ కంపెనీకి ఎంతో చరిత్ర ఉందనే చెప్పాలి. ప్రపంచ దేశాల్లో సైతం ఉన్న అమెరికన్స్ అందరూ ఆ కార్ల పైనే ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే ఈ పోటీ ప్రపంచంలో గత కొన్నాళ్లుగా ఫోర్డ్ వెనుకబడిందనే చెప్పాలి. దానికి పోటీనిస్తూ టెస్లా గట్టిగా నిలబడింది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఫోర్డ్ ను పూర్తిగా ఓడించి… తనదైన ముద్ర వేయాలని ఎలన్ మస్క్ ఆలోచించలేదు. కలిసి ఎదుగుదాం.. ప్రపంచాన్ని శాసిద్దాం అంటూ డీల్ కుదుర్చుకున్నాడు.
తన అనుభవంతో జీవితంలో ఎదగటం ఎలా అనే విషయాన్ని కరెక్ట్ గా గుర్తించాడు ఎలన్ మస్క్. కలిసి ఉంటేనే నిజమైన విజయం అనే విషయాన్ని గుర్తించాడు. నిజానికి టెస్లాకు ఎలక్ట్రిక్ కార్లకి చార్జింగ్ యూనిట్లని ప్రతి చోట ఉంచాలంటే ఖర్చు ఎంత అవుతుందో తెలుసు. అలాగం ఫోర్డ్ వాళ్ళ పరిస్థితి సైతం ఇదే విధంగా ఉండటంతో ఇద్దరూ కలిసి కంబైన్డ్ చార్జింగ్ యూనిట్లని మొదలుపెట్టి వ్యాపారంలో ఎదిగే ప్రయత్నం చేశారు.
దీన్ని బట్టి ఆలోచిస్తే ఒక్క వ్యాపారమే కాదు ఎక్కడైనా ఎదగాలన్నా.. ఓడిపోవాలన్నా ఐకమత్యమే తొలి మెట్టు. చిన్నపాటి వ్యాపారుల నుంచి ఉన్నత స్థాయిలో ఉన్న వారు సైతం ఒకరినొకరు అణుచుకుంటూ పై మెట్టు ఎక్కాలని ప్రయత్నాలు చేస్తున్న ఈ సమాజంలో.. ప్రతీ ఒక్కరూ ఎలన్ మాస్క్ ను ఆదర్శంగా తీసుకొవల్సిందేనంటూ టెక్ ప్రియులు పొగిడేస్తున్నారు.
ALSO READ : ఆర్బీఐ టార్గెట్ గా రెచ్చిపోయిన దుండగులు.. అలర్టైన రిజర్వ్ బ్యాంక్