BigTV English

Janhvi Kapoor: మలయాళ ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడానికి జాన్వీ పాట్లు.. వర్కవుట్ అయ్యేనా?

Janhvi Kapoor: మలయాళ ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడానికి జాన్వీ పాట్లు.. వర్కవుట్ అయ్యేనా?

Janhvi Kapoor: ఒకప్పుడు సౌత్ భాషా ఇండస్ట్రీలను బాలీవుడ్ పట్టించుకునేది కాదు. కానీ ఇప్పుడు అలా కాదు.. సౌత్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడానికి బాలీవుడ్ స్టార్లు సైతం పాట్లు పడుతున్నారు. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీల్లోనే పోటీ ఎక్కువయిపోయింది. తెలుగు, తమిళ, మలయాళ భాషల నుండి కంటెంట్ ఉన్న సినిమాలు వస్తున్నాయి. దీంతో బీ టౌన్ సైతం ఈ రేంజ్‌లో సినిమాలు తెరకెక్కించాలి, ప్రేక్షకులను ఇంప్రెస్ చేయాలి అని టార్గెట్‌గా పెట్టుకున్నారు. అందులో యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) కూడా ఒకరు. ఇప్పటికే తెలుగులో డెబ్యూ చేసి నేరుగా ఇక్కడ ప్రేక్షకులను పలకరించిన జాన్వీ.. ఇప్పుడు మాలీవుడ్‌ను టార్గెట్ చేసినట్టు అనిపిస్తోంది.


వారే టార్గెట్

అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది జాన్వీ కపూర్. ‘ధడక్’ అనే మూవీతో మొదటిసారి హీరోయిన్‌గా ప్రేక్షకులను పలకరించింది. బాలీవుడ్‌లో నెపో కిడ్స్‌ను సపోర్ట్ చేసే వారి సంఖ్య తక్కువేమీ కాదు. అందుకే జాన్వీ కపూర్‌కు కూడా ఇండస్ట్రీ నుండి మంచి సపోర్ట్ దొరికింది. కానీ ప్రేక్షకుల నుండి మాత్రం విమర్శలే వచ్చాయి. శ్రీదేవి వారసురాలు అంటే యాక్టింగ్ ఇలా ఉండకూడదని తన తల్లితో పోలుస్తూ జాన్వీ యాక్టింగ్ గురించి చాలామంది నెగిటివ్‌గా మాట్లాడారు. అయినా కూడా జాన్వీ కపూర్ మాత్రం తన స్క్రిప్ట్ సెలక్షన్‌తో అందరినీ ఇంప్రెస్ చేయాలనుకుంది. అలా ఇన్‌డైరెక్ట్‌గా చాలాసార్లు సౌత్ ఆడియన్స్‌ను టార్గెట్ చేసింది.


Also Read: జ్యోతిక డ్రెస్సింగ్ గురించి సీక్రెట్ రివీల్.. బాపురే అంతా బూతులే..

పరమ్ సుందరి ప్రేమకథ

ప్రస్తుతం జాన్వీ కపూర్ చేతిలో పలు సినిమాలు ఉన్నా.. వాటి గురించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ మాత్రం ఇంకా రాలేదు. అలా తను నటిస్తున్న సినిమాల్లో ఒక సినిమాను తుషార్ జలోటా డైరెక్ట్ చేస్తున్నారు. ఆ మూవీ పేరే ‘పరమ్ సుందరి’ (Param Sundari). ఇందులో మొదటిసారి సిద్ధార్థ్ మల్హోత్రాతో జోడీకడుతోంది జాన్వీ కపూర్. చాలాకాలం పాటు సీరియస్, కమర్షియల్ సినిమాలు చేసి అలసిపోయిన సిద్ధార్థ్.. ఇన్నాళ్ల తర్వాత ఒక రొమాంటిక్ చిత్రంలో నటించడానికి సిద్ధమయ్యాడు. అయితే ఇదొక కేరళ బ్యాక్‌డ్రాప్‌కు చెందిన కథ అని, ఇందులో జాన్వీ కపూర్ మలయాళీ అమ్మాయిగా నటించనుందనే వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రీమేక్స్‌తో మొదలు

2022లో జాన్వీ కపూర్ రెండు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించగా.. ఆ రెండూ సౌత్ సినిమాలకు రీమేక్సే. అందులో ఒకటి తమిళం కాగా.. మరొక మలయాళ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కింది. ‘హెలెన్’ అనే మలయాళ మూవీని ‘మిలీ’ అనే పేరుతో హిందీలో రీమేక్ చేసింది జాన్వీ కపూర్. అంతే కాకుండా ఈ సినిమా కోసం ఒరిజినల్ మూవీని డైరెక్ట్ చేసిన దర్శకుడితోనే చేతులు కలిపింది. ఇప్పుడు మరోసారి ఏకంగా మలయాళీ అమ్మాయిగా నటించి సౌత్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేయాలనుకుంటోంది జాన్వీ. మరి సౌత్ ఆడియన్స్‌ను ఇంప్రెస్ చేయాలనుకునే జాన్వీ కపూర్ ప్లాన్స్ వర్కవుట్ అవుతాయో లేదో వేచిచూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×