BigTV English
Advertisement

Best Mobiles: రూ.20వేల లోపు అద్భుతమైన స్మార్ట్‌ఫోన్స్.. కిర్రాక్ ఫీచర్స్ భయ్యా..

Best Mobiles: రూ.20వేల లోపు అద్భుతమైన స్మార్ట్‌ఫోన్స్.. కిర్రాక్ ఫీచర్స్ భయ్యా..

Best Mobiles: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎవరి చేతిలో చూసిన స్మార్ట్ ఫోనే కనబడుతోంది. చాలా తక్కువ ధరకు మొబైల్స్ అందుబాటులో ఉండడంతో అందరూ సులభంగా కొనుగోలు చేస్తున్నారు. ఈ రోజుల్లో రూ.6వేల నుంచి రూ.10వేల మధ్యలో కూడా మార్కెట్లో మంచి మొబైల్స్ దొరుకుతున్నాయి. మార్కెట్లో మొబైల్స్ చాలా తక్కువ ధరకే లభిస్తున్నాయి. చౌక ధరల్లో మంచి ఫీచర్లతో అద్భుతమైన ఫోన్లు షాపుల్లో, ఆన్ లైన్ లో దొరుకుతున్నాయి. అయితే ఇంకా అదనపు ఫీచర్లు, పనితీరు మెరుగ్గా ఉండాలంటే.. కాస్త ఎక్కువ ధర పెట్టి కొనాల్సి ఉంటుంది. మరి మీరు కూడా కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలని చూస్తున్నారా? అయితే రూ. 20వేల లోపు మంచి స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఓసారి ఫోన్ వివరాలను చూద్దాం.


నథింగ్ ఫోన్ 2 ప్రో                                                                                                                                                                మన దేశంలో ఈ స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం అందుబాటులో ఉంది.  ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.18,999గా ఉన్నది. దీని స్పెషల్ ఏంటంటే.. బ్యాక్ ప్యానెల్ ఉంటుంది. ఈ ఫోన్‌లో 6.77 అంగుళాల ఫుల్ HD + AMOLED డిస్ ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రో ప్రాసెసర్, 256GB వరకు UFS 2.2 స్టోరేజ్, 50MP + 50MP + 8MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ వంటి అద్భుతమైన ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

OPPO K-13                                                                                                                                                                    ప్రస్తుతం ఒప్పో ఫోన్లకు మనదేశం మంచి మార్కెట్ ఉంది. చాలా మంది ఒప్పో మొబైల్ కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇందులో మంచి ఫీచర్లు ఉండడంతో అందరూ ఈ మొబైల్స్ కొనుగోలు చేస్తున్నారు. ఈ ఫోన్ ధర మనదేశంలో రూ.17,999 గా ఉంటుంది. ఈ రేటు 8GB + 128GB వేరియంట్ ఫోన్ కు వర్తిస్తుంది. ఈ ఫోన్ 6.67 అంగుళాల ఫుల్ HD + AMOLED డిస్ ప్లే, స్నాప్‌ డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్, 50MP + 2MP బ్యాక్ కెమెరా సెటప్, 16MP ఫ్రంట్ కెమెరా, 7000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లతో ఫోన్ అద్భుతంగా పని చేస్తుంది.


ALSO READ: డిగ్రీ అర్హతతో రాష్ట్రంలో ఉద్యోగాలు.. ఎలాంటి ఎగ్జామ్ లేదు.. డైరెక్ట జాబ్

రియల్ మీ పీ3                                                                                                                                                                    రియల్ మీ ఫోన్లకు భారతదేశంలో మంచి డిమాండ్ ఉంది. చాలా మంది యువత ఈ ఫోన్ కొనేందకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఈ Realme ఫోన్ ప్రారంభ ధర రూ.16,999 కు లభిస్తుంది. ఈ ధర 6GB + 128GB వేరియంట్ ఫోన్‌కు ఉంటుంది. దీనిలో 6.67-అంగుళాల ఫుల్ HD + AMOLED డిస్ ప్లే, స్నాప్‌డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్, 50MP + 2MP బ్యాక్ కెమెరా సెటప్, 16MP ఫ్రంట్ కెమెరా, 6,000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి మంచి ఫీచర్లతో ఈ మొబైల్ అందుబాటులో ఉంది.

వన్‌ప్లస్ నార్డ్ సీఈ4 లైట్                                                                                                                                                      వన్‌ప్లస్ నార్డ్ సీఈ4 లైట్.. ఈ ఫోన్ మంచి ఫీచర్లు ఉన్నాయి. దీని ధర మన దేశంలో రూ.19,999గా ఉంది. దీని  8 జీబీ + 128 జీబీ వేరియంట్ ధర భారత్‌లో రూ.19,999గా ఉన్నది. ఈ ఫోన్ 6.67-అంగుళాల ఫుల్ HD + AMOLED డిస్ ప్లే, స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్, 50MP + 2MP బ్యాక్ కెమెరా సెటప్, 16MP ఫ్రంట్ కెమెరా, 5,500mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లతో  ఈ మొబైల్ అందుబాటులో ఉంది.

Related News

Vivo V40 Pro 5G: ఫోన్‌ కాదు, మినీ కెమెరా స్టూడియో.. ట్రెండ్‌ మార్చిన వివో వి40 ప్రో 5జి పూర్తి వివరాలు

WhatsApp: ఇకపై ఆ ఫోన్లలో వాట్సప్ బంద్.. ఈ లిస్టులో మీ ఫోన్ ఉందేమో చెక్ చేశారా?

Redmi Note 16 Pro 5G: కేవలం రూ.18 వేలలో ఫ్లాగ్‌షిప్‌ లుక్‌.. రెడ్‌మి నోట్ 16 ప్రో 5జి పూర్తి వివరాలు

Flight Mode: మీ ఫోన్లో దాగున్న సూపర్ ఫీచర్.. ఫ్లైట్‌మోడ్‌తో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయని తెలుసా?

AI Smart Glasses: సోనీ కెమెరా, AI అసిస్టెంట్‌.. లెన్స్‌ కార్ట్ స్మార్ట్‌ గ్లాసెస్‌ చూస్తే మతిపోవాల్సిందే!

OPPO A6 Pro Mobile: 7000 mAh భారీ బ్యాటరీతో ఒప్పో ఎంట్రీ.. ఏ6 ప్రో 5జి ఫుల్ డీటెయిల్స్ ఇండియాలో ఇవే..

Vivo 400MP cameraphone: ప్రపంచంలోనే మొదటి 400MP కెమెరాఫోన్.. ఫొటోగ్రఫీ రంగంలో వివో సంచలన మోడల్

Samsung Galaxy F67 Neo 5G: శామ్‌సంగ్‌ నుంచి మరో సూపర్‌ హిట్‌ ఫోన్ ఎంట్రీ.. గెలాక్సీ ఎఫ్67 నియో 5జి స్పెషల్‌ ఫీచర్లు

Big Stories

×