BigTV English

Aamani: ఆ పని చేయకపోతే నేను తట్టుకోలేను.. వీక్ నెస్ బయట పెట్టిన నటి?

Aamani: ఆ పని చేయకపోతే నేను తట్టుకోలేను.. వీక్ నెస్ బయట పెట్టిన నటి?

Aamani: టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటిగా కొనసాగుతున్న నటి ఆమని(Amani) ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఈమె తెలుగు తమిళ కన్నడ భాషలలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎంతో మంది ఆధారాభిమానాలను సొంతం చేసుకున్నారు. ఇకపోతే ఆమని తెలుగులో ప్రముఖ దర్శకుడు ఇవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన జంబలకడిపంబ అనే సినిమాలో హీరోయిన్గా అవకాశం అందుకొని మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సినిమా తర్వాత మిస్టర్ పెళ్ళాం, మావిచిగురు, శుభలగ్నం, హలో బ్రదర్, అల్లరి పోలీస్ వంటివి ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి తెలుగులో కూడా మంచి సక్సెస్ అందుకున్నారు .


బుల్లితెర సీరియల్స్..

ఇలా ఇండస్ట్రీలో ఓవెలుగు వెలుగుతున్న ఆమని తన కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలోనే వివాహం చేసుకోవడం వల్ల ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇలా పెళ్లి తర్వాత పిల్లలు అంటూ కొంత కాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈమె తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ప్రస్తుతం ఆమని పలు సినిమాలలో హీరో హీరోయిన్లకు తల్లి పాత్రలలో మాత్రమే కాకుండా బుల్లితెర సీరియల్స్, బుల్లితెర కార్యక్రమాలలో కూడా పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. ప్రస్తుతం కెరియర్ పరంగా ఆమని ఎంతో బిజీగా గడుపుతున్నారు.


పూజ చెయ్యకుండా వెళ్ళను…

ఇలా కెరియర్ పరంగా బిజీగా ఉన్న ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన సినిమాకు సంబంధించిన విశేషాలతో పాటు తన వ్యక్తిగత విషయాలను కూడా అందరితో పంచుకున్నారు. ఇకపోతే తనకు ఒక బలహీనత కూడా ఉంది అంటూ తన వీక్నెస్ బయట పెట్టారు. ప్రతిరోజు ఉదయం నాలుగు గంటలకు తన రోజు ప్రారంభం అవుతుందని తెలిపారు. రోజు తాను ఉదయం నాలుగు గంటలకే నిద్ర లేస్తానని, నిద్రలేచిన వెంటనే తాను మొదట చేసే పని స్నానం చేసి పూజ (Pooja)చేయటమేనని తెలిపారు.పూజ చేసిన తర్వాతనే ఇతర పనులు చేసుకుంటాను పూజ చేయకుండా నేను బయటకు కూడా వెళ్ళనని తెలిపారు. ఏ రోజేనా పూజ చేయకుండా వెళ్తే ఆ రోజంతా నా మనసు బాగుండదని ఆమెని తెలిపారు.

ప్రతిరోజు ఉదయం లేచి పూజ చేసుకున్న తర్వాతనే యోగ వంటి వాటికీ ప్రాధాన్యత ఇస్తానని ఆమని ఈ సందర్భంగా చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పూజ చేసుకోవడం అనేది నా బలహీనతగా మారింది. ఇక పూజ తర్వాత లలితా సహస్రనామాలు విష్ణు సహస్రనామాలు కూడా చదువుకుంటానని తెలిపారు. పూజ అయిన తర్వాత యోగ వంటివి పూర్తిచేసుకుని తిరిగి షూటింగ్ పనులకు వెళ్లిపోతాను. ఇక ఇంట్లో ఉంటే పిల్లల పనులు చూసుకుంటూ ఉంటానని ఆమని తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ కామెంట్స్ వైరల్ గా మారడంతో పూజ చేసుకోవడం అనేది బలహీనత కాదు.. మీ బలం అంటూ కొంతమంది అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో బిజీగా గడుపుతున్నా, రోజు పూజ చేయడం అంటే మామూలు విషయం కాదని, ఇది అందరి హీరోయిన్ల విషయంలో జరగదు అంటూ ఈమె వ్యాఖ్యలపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఆమని బుల్లితెరపై ఇల్లు ఇల్లాలు పిల్లలు అనే సీరియల్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.

 

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×