BigTV English

Vangalapudi Anitha: వేశ్యల రాజధాని వ్యాఖ్యల వెనుక భారతి రెడ్డి హస్తం ఉందా!! అనిత సంచలన కామెంట్స్

Vangalapudi Anitha: వేశ్యల రాజధాని వ్యాఖ్యల వెనుక భారతి రెడ్డి హస్తం ఉందా!! అనిత సంచలన కామెంట్స్

Vangalapudi Anitha: సాక్షి ఛానల్‌ డిబేట్‌లో అమరావతిపై జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు దుమారాన్నే రేపుతున్నాయి. అమరావతి వేశ్యల రాజధాని అంటూ ఆయన చేసిన కామెంట్స్‌పై.. రాజధాని ప్రాంత మహిళలు, రైతులు భగ్గుమన్నారు. ఇది యావత్ రాజధాని ప్రాంత వాసులు అవమానపరచమేడనని మండిపడ్డారు. కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలపై నిరసన తెలిపారు. జర్నలిస్ట్ కృష్ణంరాజుపై కేసులు నమోదు చేయాలని.. రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు చేశారు. ఈ వ్యాఖ్యలు మహిళల గౌరవాన్ని కించపరిచాయని, వారి భూములను త్యాగం చేసిన రైతుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయని ఆరోపించారు. కృష్ణంరాజు వ్యాఖ్యలకు నిరసనగా.. ఆయన ఫోటోలను చెప్పులతో కొడుతూ మహిళలు ఆందోళన తెలిపారు.


అమరావతి రాజధానిపై వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ అనేక విజయం సంఘాలు సైతం అగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇది మమ్మాటికి రాజధానిపై కుట్రేనని అందులో భాగంగానే.. ఇలాంటి తప్పుడు ప్రచారంతో.. అమరావతిపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. జర్నలిస్ట్ కృష్ణంరాజుపై కాకినాడలో కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అమరావతి జేఏసీ సైతం కృష్ణంరాజుపై చర్యలు తీసుకోకపోతే.. తీవ్ర ఆందోళనకు సిద్ధమవుతామంటూ హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు మహిళల గౌరవాన్ని కించపరిచాయని, వారి భూములను త్యాగం చేసిన రైతుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయని వారు ఆరోపించారు.

తాజాగా ఆ వ్యాఖ్యలపై ఏపీ హోంమంత్రి అనిత ఫైర్ అయ్యారు. ఎడిటర్ అసోసియేషన్ కీలక వ్యక్తి అయ్యి ఉండి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఏపీ గౌరవాన్ని భగ్నపరిచేలా సాక్షిలో మాట్లాడారు. అమరావతిపై నీచమైన వ్యాఖ్యలు చేయడం దారుణం అని అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశం పై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. ఏపీ ప్రజలకు, అమరావతి ప్రజలకు జగన్, భారతి లు క్షమాపణ చెప్పాలని అనిత డిమాండ్ చేశారు.


మరోవైపు రాజకీయ మీడియా ముసుగులో మహిళల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. రాజధాని గురించి…ఆ ప్రాంత మహిళల వ్యక్తిత్వాలను అవమానించేలా వేశ్యలు అంటూ చేసిన దారుణ వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. తన సొంత మీడియా ద్వారా జరిగిన ఈ దారుణాన్ని ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఖండించక పోవడం విచారకరమని సీఎం చంద్రబాబు విమర్శలు గుప్పించారు. రాజధానిపై విషం చిమ్మే కుట్రలో గట్టు దాటి మహిళల మనోభావాలు గాయపరిచిన వారిపై అత్యంత కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Also Read: తల్లికి వందనం స్కీమ్ ఊగిసలాట, కారణం అదేనా?

ఇదిలా ఉంటే.. టీవీ డిబేట్‌లో కృష్ణంరాజు మాట్లాడిన వ్యాఖ్యలను ఖండిస్తూ టీటీపీ నాయకులు తిరుపతి ఎస్పీకి కంప్లైంట్ చేశారు. జర్నలిస్ట్ వ్యాఖ్యల వెనుక జగన్ ప్రమేయం ఉందని ఆరోపించారు ఎపి గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ ఛైర్మన్ సుగుణమ్మ. అమరావతి మహిళల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించారని.. యావత్ స్త్రీ జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కృష్ణంరాజు, యాంకర్ కొమ్ముల శ్రీనివాస్ మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు.

Related News

Tidco Houses: వ‌చ్చే జూన్ నాటికి టిడ్కో ఇళ్లు పూర్తి.. ప్రతి శనివారం లబ్దిదారులకు అందజేత- మంత్రి నారాయణ

Aadhaar Camps: ఆధార్ నమోదు, అప్డేట్ చేసుకోవాలా?.. ఇప్పుడు మీ గ్రామంలోనే.. ఎప్పుడంటే?

Jagan – Modi: మోదీ భజనలో తగ్గేదేలేదు.. కారణం అదేనా?

Pawan – Lokesh: పవన్ తో లోకేష్ భేటీ.. అసలు విషయం ఏంటంటే?

CM Progress Report: విదేశీ ప్రతినిధులతో సీఎం భారీ పెట్టుబడులే లక్ష్యం!

AP Rains: రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

AP Elections: నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు.. జనవరిలో నోటిఫికేషన్.. నీలం సాహ్ని ప్రకటన!

Toll Plaza Crowd: అమ‌లులోకి కొత్త రూల్స్‌.. టోల్ ప్లాజాల వద్ద భారీగా రద్దీ!

Big Stories

×