E-Paper
Advertisement

Types of heart attack : గుండెపోటు అయిదు రకాలు.. ఏఐ వివరణ..

Types of heart attack  : గుండెపోటు అయిదు రకాలు.. ఏఐ వివరణ..
Advertisement
.

Types of heart attack : గుండెపోటు అనేది ఈరోజుల్లో ఏ వయసు వారికి వస్తుంది, ఏ సమయంలో వారి ప్రాణాలను తీసుకొని పోతుంది అనేది చెప్పడం కష్టంగా మారింది. అందుకే ఈ మధ్యకాలంలో గుండెపోటుపై, గుండె సంబంధిత వ్యాధులపై శాస్త్రవేత్తలు ప్రత్యేకమైన దృష్టిపెట్టారు. గుండెపోటును స్టడీ చేయడం కోసం వారు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) సాయం కూడా తీసుకున్నారు. ఈ పరిశోధనల్లో మనిషికి ఒకటి కాదు.. అయిదు రకాల గుండెపోటు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుందని గుర్తించారు.

గుండెపోటులో రకాలు ఉంటాయని చాలామందికి తెలియదు. గుండెపోటు అంటే మామూలుగా గుండెనొప్పితో పడిపోవడం, ఆపై ప్రాణాలు కోల్పోవడం అని చాలామంది అనుకుంటారు. కానీ అదంతా పూర్తిగా నిజం కాదని ఏఐ అంటోంది. పేషెంట్లకు భవిష్యత్తులో హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఉందా లేదా అని ఏఐ టూల్స్‌తో తెలుసుకునే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు ఇటీవల బయటపెట్టారు. గుండె అనేది శరీరంలో ఇతర భాగాలకు రక్తం అందించలేక ఫెయిల్ అయినప్పుడు గుండెపోటు అనేది సంభవిస్తుంది అన్నది మాత్రమే చాలామందికి తెలుసు. కానీ దీనిని అయిదు రకాలుగా విభజించవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

Advertisement

గత 20 ఏళ్లలో యూకేలో గుండెపోటుతో బాధపడిన వారిపై శాస్త్రవేత్తలు పరీక్షలు చేపట్టారు. 30 ఏళ్లు, అంతకంటే తక్కువ వయసు ఉన్నవారిపై ఈ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల అనంతరం వారు గుండెపోటును అయిదు రకాలుగా విభజించారు. అదే ఎర్లీ ఆన్సెట్, లేట్ ఆన్సెట్, అట్రియల్ ఫిబ్రిల్లేషన్ (అంటే గుండె రిథమ్ సరిగా లేకపోవడం), మెటాబొలిక్ (అంటే ఒబిసిటీ లాంటి వ్యాధుల వల్ల ఇతర గుండె సంబంధిత వ్యాధులకు దారితీయడం), కార్డియో మెటాబొలిక్ (ఒబిసిటీ, గుండె సంబంధిత వ్యాధులకు సంబంధించింది).

గుండెపోటులో సబ్ టైప్స్‌ను విభజించడంతో పాటు వాటి గురించి వివరంగా కూడా స్టడీ చేయడం మొదలుపెట్టారు. ప్రతీ ఏడాది ఎర్లీ ఆన్సెట్‌తో 20 శాతం మంది, లేట్ ఆన్సెట్‌తో 46 శాతం మంది, అట్రియల్ ఫిబ్రిల్లేషన్‌తో 61 శాతం మంది, మెటాబొలిక్‌తో 11 శాతం మంది, కార్డియో మెటాబొలిక్‌తో 37 శాతం మంది చనిపోతున్నారని వారి పరిశోధనల్లో తేలింది. అంతే కాకుండా ఈ సబ్ టైప్స్ గురించి పూర్తిగా కనుక్కోవడం కోసం ఒక యాప్‌ను కూడా డిజైన్ చేశారు. ఈ యాప్ కేవలం పేషెంట్లకు మాత్రమే కాదు.. ఎంతోమందికి ఈ సబ్ టైప్స్ గురించి అవగాహన వచ్చేలా చేస్తుంది.

Advertisement

ఇలా గుండెపోటుకు సబ్ టైప్స్‌ను విభజించి, పరీక్షించడం వల్ల ఏయే టైప్‌కు ఎలాంటి చికిత్సను అందించవచ్చు తెలుసుకోవడం సులభంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ప్రస్తుతం పేషెంట్లకు ఎలాంటి గుండెపోటు సంభవించిందో తెలుసుకోవడం పూర్తిగా కష్టమని, కానీ త్వరలోనే దానికి తగిన టెక్నాలజీని కనిపెడతామని వారు హామీ ఇస్తున్నారు. సబ్ టైప్స్‌కు చికిత్స విషయంలో ఖర్చు ఎలా ఉంటుందో తెలుసుకోవడం కూడా తమ టార్గెట్ అని శాస్త్రవేత్తలు బయటపెట్టారు.

Related News

బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఆఫీస్, స్టూడెంట్స్‌కు పర్ఫెక్ట్

రూ.9,490కే ఫ్రిజ్..సింగిల్ రూమ్స్, బ్యాచిలర్స్‌కు బెస్ట్!

తక్కువ ధరలో బెస్ట్ బ్రాండెడ్ వాచ్.. రెడ్‌మీ నుంచి మార్కెట్‌ను షేక్ చేసే కొత్త మోడల్!

Huawei Watch GT 7 సిరీస్ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!

వేగంగా కదులుతోన్న ఆస్ట్రేలియా ఖండం.. ఆసియాలోని ఆ దేశాలను ఢీకొట్టనుందా?

ఈ మ్యూజిక్ బీట్స్ చూస్తే.. మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!

పాకెట్ ఫ్రెండ్లీ ప్రైస్‌లో.. డైనమిక్ థండర్ సౌండ్!

కొత్త మోడల్ వచ్చేలోపే శాంసంగ్ మాస్టర్ ప్లాన్.. బెస్ట్ AI ఫోన్‌పై ఊహించని డిస్కౌంట్!

Big Stories

Advertisement
×